రచయిత వివరాలు

సంపాదకులు

పూర్తిపేరు: సంపాదకులు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

ఒక కథ నచ్చడానికీ నచ్చకపోడానికీ మనకు ఎన్నో కారణాలుంటాయి. నచ్చనివాటిని కాసేపు పక్కన పెట్టి, ఏదైనా కథ మీకెందుకు నచ్చిందో ఆ కారణాల గురించి ముచ్చటించుకోడం కోసమే ఈ శీర్షిక.

ఈ సంచికలో:

  • ‘కథ నచ్చిన కారణం’ కొత్త శీర్షిక ప్రారంభం. పాల్గొనమని మా పాఠకులకు ఆహ్వానం.
  • విన్నకోట రవిశంకర్ కవిత్వ పరిశీలన, నాటికి నేడు రేడియో నాటిక, దేశికాచారి, వైదేహి శశిధర్, పాలపర్తి ఇంద్రాణి తదితరుల కవితలు. జెజ్జాల కృష్ణ మోహనరావు తిరుక్కుఱళ్ అనువాదం కామవేదం. ఇంకా…

ఈ సంచికలో మీకోసం…

ద్రౌపది నవల పై చెలరేగుతున్న వివాదంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం ఇతిహాసాలూ, ప్రబంధాలూ; జయదేవుని అష్టపది సా విరహే తవదీనా పై పాటలతో, అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసిన వ్యాసం; సహజగాయని ఎస్.వరలక్ష్మి పాడిన అపురూపమైన పాటలు కొన్ని అందిస్తూ పరుచూరి శ్రీనివాస్ శబ్దతరంగాలలో; ఇంకా కవితలు, వ్యాసాలూ, శీర్షికలూ….

జులై 2009 సంచికలో–
నిద్రిత నగరం – వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్ష, వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో ‘ప్రభావం’ అంటే ఏమిటి?, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం: ఫాదర్స్ డే. ఇంకా కథలు, కవితలు, వ్యాసాలు.

ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం. ప్రముఖ కవి, రచయత శ్రీ స్మైల్ డిసెంబర్ 5వ తేదీ మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.

ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంచికలో:

ప్రత్యేక వ్యాసం: ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత “స్మైల్” (మహమ్మద్ ఇస్మాయిల్) జ్ఞాపకాలు వేలూరి వేంకటేశ్వర రావు మాటలలో.

  • ఏమిటీ ఈమాట మాట? ఈమాట ప్రారంభించినప్పటి ఆశయాలు ఎంతవరకూ నిజమయ్యాయి? కే.వీ.యస్. రామారావు మాటల్లో: “పదేళ్ళ ఈమాట మాట“. వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం : “ఈమాట -నామాట“.

ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కొత్త కథలు, వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు. ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.

ఈమాట జులై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో భద్రిరాజు కృష్ణమూర్తి, ఆరుద్ర తో ఇంటర్వ్యూ, సి. మృణాళిని గారి ఉపన్యాసం. జె.యు.బి.వి. ప్రసాద్, సాయి బ్రహ్మానందం గొర్తి, శర్మ దంతుర్తి గార్ల కథలు. ఇంకా వ్యాసాలు, కవితలు, ఇతర ఆకర్షణలు.

విరోధి నామసంవత్సర శుభాకాంక్షలతో ఈమాట మార్చ్ 2009 సంచికకు స్వాగతం!

ఈమాట సంపాదకులలో ఒకరైన శంకగిరి నారాయణస్వామి (నాసీ) గారు వ్యక్తిగత కారణాల వల్ల ఈమాట సంపాదక బాధ్యతల నుంచి వైదొలిగారు. వారు సంపాదక బృందంలో ఒకరుగా గత సంవత్సరంలో చేసిన కృషికి మా కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా కాకపోయినా, ఈమాటకు వారి సహాయ సహకారాలు ఇకముందు కూడా ఉంటాయనే మా నమ్మకం.

– ఈ సంచికలో…

భద్రిరాజు గారి అశీతితమ జన్మదిన సందర్భంగా ఆయన గురించి చేకూరి రామారావు, వెల్చేరు నారాయణ రావు, కె. కె. రంగనాథాచార్యులు, ఆరుద్ర, బూదరాజు రాధకృష్ణ గార్లు రాసిన వ్యాసాలను ఈ సంచికలో చివరి విడతగా మీకు అందజేస్తున్నాము. సమయాభావం వల్ల, ఈ ప్రత్యేక సంచికకోసం మాకు పంపించిన కొత్త రచనలన్నింటిని ప్రచురించలేక పోయాము. మిగిలిన రచనలను జులై సంచికలో తగుమాత్రంగా సమీక్షించి ప్రచురిస్తాము. ఈ సంచికకోసం పాత వ్యాసాలను సేకరించడంలో మాకు ఎంతగానో సహాయ పడ్డ వాడపల్లి శేషతల్పశాయి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది.

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.

  • – ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు
  • – ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు
  • – “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు

పూర్తి వివరాలు»

ఈమాట జనవరి 2008 సంచికలో —

ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట

ఇంకా విశేషాలు —

ఈ సంచికలో మరొక ముఖ్యమైన విశేషం, శంఖవరం పాణిని గారు ఈ సంచికనుంచీ ఈమాట సంపాదక వర్గంలో భాగస్వామి అయ్యారు. పాణిని వృత్తి రీత్యా బయోకెమిస్ట్. ఎమరీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ప్రొఫెసర్. ప్రవృత్తి రీత్యా, తెలుగు సాహిత్యం, సంగీతం, — రెండింటిలోనూ ద్రష్టే అని చెప్పచ్చు. యాహూ గ్రూపు “రచ్చబండ” మోడరేటర్లలో ఒకరుగా, అంతకు ముందు తెలుసా (తెలుగు సాహిత్యం) గ్రూపు లో క్రియాశీలక సభ్యులుగా, “ghantasAla.info” వ్యవస్థాపకులలలో ఒకరిగా ఇంటర్నెట్టులో చిరపరిచితులు. పాణినిగారు ఈమాటలో భాగస్వామి కావడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది,వారికి ఈమాట స్వాగతం పలుకుతోంది.

విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది.

కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట మే 2007 సంచిక విడుదల! ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణ, స్వర్గీయ సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ సాహిత్యాన్ని లోతుగా, […]

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు జనవరి 2, 2007 మంగళవారం నాడు చిత్తూర్ […]

వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్ళకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

“జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశంలో 1950, 60 దశకాల్లో ప్రవహించటం మానేసింది. శుష్క నినాద […]

 “ఈ మాట” పాఠకులకు  స్వాగతం! ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. ఈ వారాంతంలో జరుగుతున్న “ఆటా” సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో బహుమతి […]

” పఠాభి”గా అవతరించిన తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి “ఫిడేల్ రాగాల డజన్” ద్వారా తెలుగుదేశంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయ బహుమతి లభించిన “సంస్కార” చిత్రం ద్వారా యావద్భారత […]

దాదాపు ముప్పైయేళ్ళ క్రితం గుంటూరు జిల్లాలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ పలుప్రాంతాల్లో విద్యాభ్యసించి, దేశం కొన్ని ప్రాంతాల్లో నివాసించి, జె.పి.సార్త్ర్ పై పరిశోధించి; డాక్టరేట్ ముగియకుండా, […]

చాసోతో ముఖాముఖి ,
కృష్ణశాస్త్రి ఆకాశవాణి ప్రసంగం ,
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు,
రాయప్రోలుతో ముఖాముఖి ,
చూడు చూడు నీడలు (లలితగీతం) ,
పతితులార భ్రష్టులార (లలితగీతం) ,
కొన్ని ఇస్మాయిల్ కవితలు

వినుకొండ వల్లభరాయడు 14వ శతాబ్దం చివర్లో, అంటే శ్రీనాథుడి కాలంలోనో కొన్నేళ్ళ తరవాతనో వున్నవాడు. అతని తండ్రి తిప్పయమంత్రి హరిహరరాయల కోశాగార సంరక్షకుడు. ఈ […]

తమ్మినేని యదుకుల భూషణ్‌ గారు కథకుడిగా, కవిగా సమీక్షకుడిగా, అనువాదకుడిగా ఈమాట పాఠకులకు సుపరిచితులు. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే ఈ కవితాసంకలనం, “సముద్రం” […]

ఇది “ఈమాట” ద్వితీయ జన్మ దిన సంచిక! ఇందుకు కారకులైన రచయిత్రు(త)లకు, పాఠకులకు అభివందనచందనాలు, దివ్యదీపావళి శుభాకాంక్షలు! “ఈమాట”కు రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా […]

ఈ సంచికలో ఒక విశేషం ఉంది. అందువల్లనే ఇది బయటకు రావటం కొంత ఆలస్యం అయింది కూడ. తానా వారు ఈ వారాంతంలో జరగబోతున్న మహాసభలను పురస్కరించుకొని జరిపిన కథల పోటీలో వచ్చిన 700 పైగా కథల్నుంచి ఆరింటిని ఉత్తమమైన వాటిగా నిర్ణయించి బహుమతులు ప్రకటించారు. ఆ ఆరు కథల్నీ ఈ సంచికలో ప్రచురిస్తున్నాం!