ఈమాట పాఠకులందరికీ దీపావళి, థేంక్స్ గివింగ్ శుభాకాంక్షలు. ఈమాట నవంబర్ 2007 సంచికలో —
కొడవటిగంటి కుటుంబరావు
10/28/1909 – 08/17/1980
ఈమధ్య వార్తల్లో తరచూ వినబడుతున్న “తెలుగుని అంతర్జాతీయభాషగా గుర్తింపు చేయిస్తాం” అన్న నినాదం పెద్ద అభూతకల్పన, ఫాంటసీ మాత్రమే. కానీ, అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా బోధన మాత్రం ఫాంటసీ కాదు, నిజమే! అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా బోధన, సంస్కృతీచరిత్రల అధ్యయనాల సాధ్యాసాధ్యాల గురించి వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “ఫాంటసీ — రియాలిటీ“.
ఇంకా విశేషాలు —
- హిందుస్థానీ సంగీతంలో ఘరానాల గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మల్టీమీడియా వ్యాసం: “హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు“
- బెంగుళురు నాగరత్నమ్మ గురించి జెజ్జాల కృష్ణమోహన రావు గారి సచిత్ర వ్యాసం: “విద్యాసుందరి“. దానికి అనుబంధంగా నాగరత్నమ్మ గారు త్యాగరాజు మీద రచించిన అష్టోత్తర శతనామం.
- సుమారు 4500 సంవత్సరాల క్రితం అతి మహోజ్వలమైన సంస్కృతికి చిహ్నమైన భాష, పురాతన ఈజిప్ట్ సంస్కృతిలో అంతర్భాగమైన “హైరోగ్లిఫ్” (Hieroglyph) లిపి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి సచిత్ర వ్యాసం: “రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష “
- కంప్యూటర్ సైన్సు రంగంలో నోబెల్ బహుమతి అనదగ్గ టూరింగ్ బహుమతి పోందిన డేటాబేస్ శాస్త్ర నిపుణుడు జిమ్ గ్రే గురించి కొడవళ్ళ హనుమతరావు గారి వ్యాసం: “అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే“
- “నాకు నచ్చిన పద్యం” వ్యాస పరంపరలో, శ్రీనాథుడి శృంగార నైషధంలో హంస నలమహారాజుని వేడుకునే సన్నివేశంలో పద్యం గురించి చీమలమర్రి బృందావన రావుగారి వ్యాసం.
- రవికిరణ్ తిమ్మిరెడ్డి, కనకప్రసాద్ సరిపల్లి, “ఉదయకళ”, ఝాన్సీలక్ష్మి కొత్త గార్ల కవితలు – (వరుసగా): “బైపోలార్ భూతం“, “జేబఱబూచి“, “శ్రావణమాఘాలు“, “వసంతభామిని“.
- వేలూరి వేంకటేశ్వర రావు, భైరవభట్ల కామేశ్వర రావు, డొక్కా శ్రీనివాస ఫణి కూమార్ గార్ల కథలు : “తీన్ కన్యా“, “ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story“, “అదిగోపులి“.
- అక్టోబర్28 వ తేదీ ప్రముఖ రచయిత, పాత్రికేయులు శ్రీకొడవటిగంటి కుటుంబరావుగారి పుట్టినరోజు. ఈసందర్భాన్నిపురస్కరించుకొని కుటుంబరావు గారు 1952 లో రాసిన నాటిక: “ఉత్తరకిష్కింధ“
ఈమాటకు రచనలు పంపగోరే వారికి సూచనలు
- ఈమాటలో ప్రచురించే ప్రతి రచనను కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి అంచనాల ఆధారంగానే ప్రచురణ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇందుకు వీలుగా మీ రచనలని సంచిక ప్రచురణ తేదీకి కనీసం 2-3 వారాలు ముందుగా పంపమని మా మనవి. రచనలు RTS, లేదా యూనికోడ్ తెలుగులో కానీ ఈమైలు ద్వారా పంపాలి. పీడీయఫ్, జిఫ్, జేపెగ్ (PDF, gif, jpeg) రూపంలో, లేదా స్కాన్ చేసిన రాతప్రతులని పంపవద్దని మనవి. ఈ రూపాల్లో ఉన్న రచనలని యూనికోడ్ లోకి మార్చడం దాదాపు అసాధ్యం.
- పుస్తక సమీక్షలు పంపగోరేవారు సాధ్యమైతే తాము సమీక్షించబొయే పుస్తకం ముఖచిత్రం కూడా పంపమని మనవి. అలాగే ఆ పుస్తకం వెల, ప్రతులు దొరికేచోటు వగైరా సమాచారం కుడా సమీక్షతో జత చేయాలి.
- ఈమాట ఎలెక్ట్రానిక్ పత్రిక కాబట్టి, వ్యాసాలు పంపగోరే వారు వ్యాసంతో పాటు రిఫరెన్సులు (ఆన్లైను రిఫరెన్సులు –వెబ్ సైటు లింకులు అయితే మంచిది) పంపాలి.
- వ్యాసంతో బొమ్మలు పంపేటప్పుడు, అవి ఇతర వెబ్‌సైట్లనించి తీసుకున్నవైతే, ఆ విషయాన్ని వ్యాసంలో పేర్కొనాలి.
ఈ సంచిక నిర్మాణంలో సహాయపడ్డ సమీక్షకులు, రచయితలందరికి మా కృతజ్ఞతలు. పాఠకులు తమ అభిప్రాయాలని “బాగుంది, బాగులేదు” లాంటి ఒకటి రెండు మాటలతో కాకుండా, నిర్మాణాత్మకంగా ఉండేలా రాయమని కోరుతున్నాము.
–సంపాదకులు