వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది. ఆసక్తిగల రచయితలు తమ వ్యాసాలను జూన్ 15, 2008 లోగా submissions at eemaata.com కి పంపించవలసిందిగా మా విజ్ఞప్తి. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి ఎనభయ్యవ జన్మదినమైన జూన్ 19 వరకు ప్రతి వారం కొన్ని కొత్త వ్యాసాలను ప్రచురిస్తూ, జూన్ 19 న ఈ ప్రత్యేక సంచికను పూర్తిగా విడుదల చేయాలని మా సంకల్పం.
మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు!
— ఈమాట సంపాదకులు