“జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశంలో 1950, 60 దశకాల్లో ప్రవహించటం మానేసింది. శుష్క నినాద ప్రాయమైన రాజకీయ అకవిత్వం దేశమంతటా అల్లుకుంది. క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?” అంటూ చిట్టిపొట్టి ఆనందాల్నీ, ప్రేమల్నీ, దిగుళ్ళనీ, స్నేహాల్నీ, ఆశల్నీ, నిరాశల్నీ, సందేహాల్నీ ప్రతిఫలించే కవిత్వం కోసం తహతహలాడిపోయిన అనుభూతి కవి ఇస్మాయిల్ గారి ఈ “కరుణ ముఖ్యం” పుస్తకం, ఈమాట గ్రంథాలయంలో కొత్తగా చేరిన గ్రంథరాజం.
[ఈ పుస్తకాన్ని ఓపిగ్గా టైప్ చేసి ఈమాట సాహితీ గ్రంథాలయంలో చేర్చమని అందజేసిన మూలా సుబ్రహ్మణ్యం, వినీల్ గట్టు గార్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు.]