ఈమాట జులై 2008 సంచికకు స్వాగతం. ఈ సంచికలో శబ్ద తరంగాలు శీర్షికలో-
- భద్రిరాజు కృష్ణమూర్తిగారితో “సుమనస్పతి” గారి (ఆకాశవాణి) ఇంటర్వ్యూ
- తెలుగు నవలా సాహిత్యంపై ప్రముఖ రచయిత్రి, పాత్రికేయురాలు డా. మృణాళిని గారి ప్రసంగం.
- తెలుగు వార్తా పత్రికలపై గూడూరి నమశ్శివాయ గారి ప్రసంగం (దానితో పాటు స్వర్గీయ శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన కొన్ని పద్యాలు)
- ఆరుద్రతో పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి ముఖాముఖీ (ఆకాశవాణి కైఫీయతులనుండి)
ఈ సంచికలో కొన్ని వ్యాసాలు –
- పర్యటన కోసం అమెరికా వచ్చిన ఇద్దరు రచయితల రచనలని సమీక్షించే విన్నకోట రవిశంకర్ వ్యాసాలలో మొదటి భాగం
- నండూరి సుబ్బారావు గారి ఎంకిపాటలపై ఒక స్పందన, రామ్ గోపాల్వర్మ చిత్రాలపై ఒక విశ్లేషణ
- కంప్యూటింగ్ పుర్వాపరాలు వ్యాస పరంపరలో ప్రముఖ బ్రిటీష్ గణిత శాస్త్రజ్ఞుడు, తత్వశాస్త్రవేత్త జార్జ్ బూల్ (George Boole) గురించి వ్యాసం.
- మరికొన్ని ఇతర వ్యాసాలు
ఇంకా కథలు, కవితలు, ఇతర శీర్షికలు …
ఆరుద్ర తో ముఖాముఖీ, గూడూరి వారి ప్రసంగాల్ని మాకందించిన పరుచూరి శ్రీనివాస్ గారికీ, ఈ సంచిక నిర్మాణంలో సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాము.
— సంపాదకులు