జనవరి 2007 సంచికలో-
- నారాయణస్వామి కవితల సంకలనం “సందుక” పై విన్నకోట రవిశంకర్ సమీక్ష – “పోగొట్టుకున్నవాడి పాట”, “భాషా సంబంధ నిరూపణ” పై సురేశ్ కొలిచాల వ్యాసం, వాడుక భాషలో పద్యాల పై భైరవభట్ల కామేశ్వర రావు గారి వ్యాసం, “జానపద సాహిత్యంలో స్త్రీలు” అన్న అంశం పై ఆచార్య జ్యోతి గారి వ్యాసం, తన రచనల గురించి అంపశయ్య నవీన్ గారి వ్యాసం :”నేను నా రచనలు“.
- వైదేహీ శశిధర్, ఉదయకళ, ముకుంద రామారావు, రవికిరణ్ తిమ్మిరెడ్డి, పాలపర్తి ఇంద్రాణి , మూలా సుబ్రమణ్యం గార్ల కవితలు
- యథార్థ చక్రం ఐదవ భాగం, నిడదవోలు మాలతి, వేలూరి వేంకటేశ్వర రావు గార్ల కథలు.
2007 లో ఈమాటలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ముఖ్యమైనవి:
- ఈమాటకి మరొక కొత్త వేషం
- పాత సంచికల పునర్వ్యవస్థీకరణ
- ప్రముఖ రచయితల బ్లాగులు
- Improved search feature
ఇవి మీ మెప్పు పొందుతాయనీ, 2007 లో ఈమాట మరింతమంది పాఠకులకి చేరువౌతుందని ఆశిస్తూ, సెలవు, నమస్కారం.
సంపాదకులు