విరోధి నామసంవత్సర శుభాకాంక్షలతో ఈమాట మార్చి 2009 సంచికకు స్వాగతం!
ఈమాట సంపాదకులలో ఒకరైన శంకగిరి నారాయణస్వామి (నాసీ) గారు వ్యక్తిగత కారణాల వల్ల ఈమాట సంపాదక బాధ్యతల నుంచి వైదొలిగారు. వారు సంపాదక బృందంలో ఒకరుగా గత సంవత్సరంలో చేసిన కృషికి మా కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా కాకపోయినా, ఈమాటకు వారి సహాయ సహకారాలు ఇకముందు కూడా ఉంటాయనే మా నమ్మకం.
ఈ సంచికలో విశేషాలు:
- ఈమాట వ్యవస్థాపక సంపాదకులలో ఒకరైన సురేశ్ కొలిచాల రాస్తున్న ఈమాట జ్ఞాపకాల వ్యాసపరంపరలో మొదటి భాగం: “ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు“
- ఉత్తర హరివంశకావ్యాన్ని రచించిన నాచన సోమన పద్యనిర్మాణ వైచిత్రి గురించి వ్యాసం: “నాచన సోమన చతుర వచో విలాసం“
- నన్నెచోడ కవిరాజు రచించిన కుమార సంభవ కావ్య లక్షణాల ఆధారంగా నన్నెచోడుడు ఏ కాలంవాడో విశ్లేషించే వ్యాసం ” నన్నెచోడుని క్రౌంచపదం“
- నాకు నచ్చిన పద్యం శీర్షికన “వసుచరిత్రలో చంద్రోదయం” వ్యాసం
- మనకు తెలియని మన త్యాగరాజు వ్యాస పరంపరలో 4వ భాగం
- సత్యజిత్ రాయ్ చిత్రత్రయంలో చివరి చిత్రమైన “అపు సంసార్” గురించి వ్యాసం
- “కథ-2006” వార్షిక సంచికలో వచ్చిన “అతడు, నేను, లోయ చివరి రహస్యం” కథపై విశ్లేషణాత్మక వ్యాసం: “అతడు, నేను, అతడి కథ“. పాఠకుల సౌలభ్యం కోసం కథా రచయిత, ప్రచురణకర్తల అనుమతితో ఆ కథని కూడా ప్రచురిస్తున్నాము.
- ఒక కథలో కథావస్తువుకున్న ప్రాముఖ్యత, దానిని పాఠకుడికి చేరవేసే విధానంలో గల తేడాలపై ఆరి సీతారామయ్య గారి వ్యాసం: “కథ దేని గురించి?“
- ఇటీవలే విడుదలైన విశ్వగుణాదర్శం అనే పుస్తకంపై వెల్చేరు నారాయణరావు పరిచయాత్మక వ్యాసం: “విశ్వగుణాదర్శ కావ్యపరిచయం“
- కనకప్రసాద్, అఫ్సర్, రవికిరణ్ తిమ్మిరెడ్డి, జెజ్జాల కృష్ణ మోహనరావుల కవితలు
- హేమ వెంపటి కథ: “శ్రీ ఆంజనేయ రక్షా కవచం“
- “ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం” వేలూరి వెంకటేశ్వర రావు సంపాదకీయం
- అనివార్య కారణాల వలన కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు వ్యాసం ఈ సంచికలో ప్రచురించలేక పోతున్నాం. పాఠకులకు మా క్షమాపణలు.
ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ సంచికకు సహకరించిన రచయితలు, సమీక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.