క్రీడాభిరామం:విషయ సూచిక

వినుకొండ వల్లభరాయడు 14వ శతాబ్దం చివర్లో, అంటే శ్రీనాథుడి కాలంలోనో కొన్నేళ్ళ తరవాతనో వున్నవాడు. అతని తండ్రి తిప్పయమంత్రి హరిహరరాయల కోశాగార సంరక్షకుడు.

ఈ రచన “వీథి” అనే పేరున్న రూపకం. శ్రీనాథుడి శైలికి అద్భుతమైన పేరడీలున్నాయిందులో. నిజానికి ఈ గుణం వల్ల ఇది శ్రీనాథుడు రాసినదేనని కొందరు కవులు గట్టిగా అభిప్రాయపడ్డారు కూడ.

తాటాకుల మీద ఒకే ఒక్క ప్రతి దొరకటంతో దీన్లో కొన్ని భాగాలు ఇప్పుడు లేవు.

దీన్లో ఉన్న ప్రత్యక్ష శృంగారం చాలామంది పండితులకి నచ్చలేదు. అందువల్ల “చంద్రలేఖావిలాపం,” “రాధికాసాంత్వనం,” “అహల్యాసంక్రందనం,” “తారాశశాంకం” మొదలైన కావ్యాలతో పాటు క్రీడాభిరామం కూడ వెలివేతకి గురైంది.

ఐతే దీన్లో ఉన్న శృంగారం వెగటు కలిగించేది కాదు. సరదాగా, అలవోకగా సాగేది. పరిశీలించి చూస్తే ఎన్నో అద్భుతమైన కల్పనలు ఉన్నాయిందులో.

ప్రస్తుతానికి మూలం మాత్రం ఇస్తున్నాం. త్వరలో కొంత లఘుటీక కూడ కలపాలని మా ప్రయత్నం .

  1. క్రీడాభిరామము:తొలిభాగం
  2. క్రీడాభిరామం:రెండవభాగము
  3. క్రీడాభిరామం:మూడవ భాగము
  4. క్రీడాభిరామం:నాల్గవ భాగము
  5. క్రీడాభిరామం:ఐదవ భాగము
  6. క్రీడాభిరామం:ఆరవ భాగము
  7. క్రీడాభిరామం :ఏడవ భాగము
  8. క్రీడాభిరామం :ఎనిమిదవ భాగము