సెప్టెంబర్ 2006 సంచిక విడుదల

ఈ సంచికలో విశేషాలు:

  • భావ జానపద కవిత్వాల పై వెల్చేరు, పరుచూరి గార్ల వ్యాసం
  • పాల్కురికిపై పరిశోధన చేసిన ఆచార్య పి. జ్యోతి గారి వ్యాసం
  • ఈ మధ్యే మరణించిన జి. వి. సుబ్రమణ్యం గారికి నివాళిగా నవ్య సంప్రదాయోద్యమం గురించి ఆయన రాసిన వ్యాస పరంపర నుండి కొన్ని భాగాలు
  • అతి పిన్న వయస్సులోనే princeton university లో ప్రొఫెసర్ పదవి పొందిన మంజుల్ భార్గవ పై వేమూరి గారి వ్యాసం.
  • అంపశయ్య నవీన్ గారి అమెరికా పర్యటన సందర్భంగా అట్లాంటాలో చేసిన ప్రసంగం.
  • చంద్రా కన్నెగంటి, లైలా, వేలూరి, వైదేహి శశిధర్ గార్ల కథలు
  • యథార్థ చక్రం మూడవ భాగం, తిరుపతి వెంకట కవుల గురించి వేలూరి గారి వ్యాసం, శాస్త్రీయ సంగీతాన్ని “డీ మిస్టిఫై” చేసే రోహిణీప్రసాద్ గారి వ్యాసం, మత్తేభ విక్రీడితంలో నవరసాల గురించి మోహన రావు గారి వ్యాసం

పాఠకుల సూచన మేరకు ఈ సంచిక నించి ఈమాట వేషంలో మరిన్ని మార్పులు చేస్తున్నాము. అందులో ముఖ్యమైనవి:

  • ప్రతి పేజీలో కుడిపక్కన ఇంకో కాలమ్.
  • సంచికలోని ప్రతి రచన పేజీలో కుడిపక్క కాలమ్‌లో ఆ సంచిక విషయ సూచిక.
  • ఒకటి కన్నా ఎక్కువ పేజీలున్న ప్రతి రచననీ ఒకే పేజీలో చదవడానికి లింకు. ఇటువంటి రచనలని విషయసూచిక పేజీ నించే ప్రింట్ చేసుకోగలిగే సౌకర్యం.
  • ప్రతి రచనకీ కుడిపక్క కాలమ్‌ లో printer friendly page కి లింక్
  • మీ సౌకర్యం కోసం printer friendly page ఇంకొక విండో లో కనబడుతుంది.

ఈ మార్పులు మీ మెప్పు పొందుతాయనీ, ఈమాట కొత్త సంచిక గురించి మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారనీ ఆశిస్తాము.