కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట మే 2007 సంచిక విడుదల!
- ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణ, స్వర్గీయ సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ సాహిత్యాన్ని లోతుగా, కూలంకషంగా చర్చిస్తూ 1952లో రాసిన వ్యాసం శ్రీశ్రీ కవిత్వం పై.. మరో వ్యాసం. సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీకి సమకాలికులు.
- గరికపాటి మల్లావధాని గారి గురించి వేలూరి గారి సంపాదక వ్యాసం, దానికి అనుబంధంగా తొమ్మిదవ శతాబ్దపు అరుదైన శృంగార కావ్యం “అమరు శతకం” నించి కొన్ని శ్లోకాలు, వాటికి తెలుగు, ఇంగ్లీష్ అనువాదాలు .
- మరికొన్ని విశేష వ్యాసాలు –ప్రముఖ నేపధ్య గాయకుడు డా. పీ.బీ. శ్రీనివాస్ గారి వ్యాసం సుమధుర సందర్భోచిత స్వర రచన, జుగల్బందీ కచేరీల గురించి కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి సచిత్ర వ్యాసం, కడప జిల్లాలో అంతరించి పోతున్న అపురూపమైన కలివి కోడి అనే పక్షి గురించి జమ్మి కోనేటిరావుగారి సచిత్ర వ్యాసం.
- మరణాన్ని వివిధ కోణాలనించి పరిశీలించే మూడు కథలు: బ్లాగులలోకంలో “రానారె” గా పరిచితులైన యర్రపురెడ్డి రామనాధ రెడ్డి గారి కథ న త్వం శోచితుమర్హసి, వేలూరి వేంకటేశ్వర రావు గారి కథ అనాథ ప్రేత సంస్కారాత్.., డా. అరుణా పాణిని గారి మొదటి కథ ముగ్గురు ముసలమ్మలు.
- ఇవికాక, రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి ఆరు చిత్తు రూపాలు (sketches), విప్లవ్ గారి కొత్త కథ పేకాట.
- వైదేహీ శశిధర్ , చంద్రశేఖర్ కన్నెగంటి , సాయి బ్రహ్మానందం గొర్తి , మూలా సుబ్రహ్మణ్యం , ఇంద్రప్రసాద్ , యోగానంద్ సరిపల్లి గార్ల కవితలు, ఆరి సీతారామయ్య గారి హైకూలు.
ఈ సంచిక నిర్మాణంలో సహాయపడ్డ సమీక్షకులు, రచయితలు, మిత్రులందరికి మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తూ.
సంపాదకులు