స్మైల్ ఒఖడే… ఇహ లేడు!
ప్రముఖ కవి, రచయిత “స్మైల్” డిసెంబర్ అయిదవ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు. స్నేహితుడైన స్మైల్ జ్ఞాపకాలు వేలూరి వేంకటేశ్వర రావు మాటలలో. (ప్రత్యేక వ్యాసం, 08 డిసెంబర్ 2008)
ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! ఈ సందర్భంగా ఈమాటకు మీ సహాయ సహకారాలు కలకాలం ఉంటాయని ఆశిస్తూ, ఈ సంచికను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సంచికలో:
- ఏమిటీ ఈమాట మాట? ఈమాట ప్రారంభించినప్పటి ఆశయాలు ఎంతవరకూ నిజమయ్యాయి? కే.వీ.యస్. రామారావు మాటల్లో: “పదేళ్ళ ఈమాట మాట“. వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం : “ఈమాట -నామాట“.
మరికొన్ని విశేషాలు:
- శబ్ద తరంగాలు శీర్షికలో ఆకాశవాణి ఆర్కైవుల నుండి పరుచూరి శ్రీనివాస్ సేకరించిన రెండు అపురూప ఆడియో కార్యక్రమాలు: 1978 లో ఉగాది సందర్భంగా మహానటి సావిత్రి సమర్పించిన అరుదైన రేడియో కార్యక్రమం: “జనరంజని“. చలం రచించిన “పురూరవ” నాటికకు శ్రవ్య రూపం, కొత్తగా ప్రారంభించిన “ఈ-పుస్తకాలు” శీర్షికలో “పురూరవ” నాటకం పూర్తి పాఠం.
- డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్(DTLC) 10వ వార్షికోత్సవ సమావేశాలపై ఒక సమీక్ష.అదే సమావేశంలో వెల్చేరు నారాయణరావుగారిచ్చిన ముఖ్యోపన్యాసం “సాహిత్య విమర్శ: అక్కడ, ఇక్కడ” ప్రసంగ పాఠం. వేలూరి వేంకటేశ్వర రావు గారిచ్చిన “నేనొక సాధారణ పాఠకుణ్ణి” ప్రసంగ వ్యాసం.
- ఇటీవలే విడుదలైన మాలతి నిడదవోలు రాసిన “తెలుగు ఉమెన్ రైటర్స్ 1950 – 1975” పుస్తకంపై వేలూరి వేంకటేశ్వరావు సమీక్ష.
- లైలా యెర్నేని, రమ్యగీతిక, కే.వి.గిరిధర రావు, విన్నకోట రవిశంకర్ల కథలు.
- “కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు“, “మనకు తెలియని మన త్యాగరాజు“, “నాకు నచ్చిన పద్యం” వ్యాస పరంపరల్లో తరువాతి భాగాలు.
- ఇంకా, కవితలు, రాబోయే సాహితీ కార్యక్రమాల ప్రకటనలు, పాఠకుల అభిప్రాయాలు, ఇతర ఆకర్షణలు.
ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.