ఈమాట నవంబర్ 2010 సంచికకు స్వాగతం!

Issue Index Image

ఈ సంచికనుండీ ఒక కొత్త శీర్షికను మొదలు పెడుతున్నాం. పాఠకులైన మీరందరూ ఉత్సాహంగా పాలు పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరిన్ని వివరాలకు మా ఆహ్వానాన్ని చూడండి.

ఈ సంచికలో మీకోసం:

ఆహ్వానం: కథ నచ్చిన కారణం శీర్షికలో పాల్గొనవసిందిగా పాఠకులకు ఆహ్వానం.
కవితలు: జలప్రపాతము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; పరిశోషణం – వైదేహి శశిధర్; దుప్పట్లో ముడుక్కున్నా – పాలపర్తి ఇంద్రాణి; మొలక – డా. గరిమెళ్ళ నారాయణ జీనో పేరడాక్సు – మాధవ్ మాచవరం అనుసరణ కవిత; నా అందం ఏమయింది – ఉదయకళ; జీవితం – గెడ్డాపు లక్ష్మీ ప్రసాద్.
కథలు: న్యాయవాదం – సాయి బ్రహ్మానందం గొర్తి; మన్మధుని బాణాలు – రచయిత ఎవరో చెప్పగలరా?
వ్యాసాలు: విన్నకోట రవిశంకర్ రెండోపాత్ర: ఒక పరిచయం – కే. వీ. ఎస్. రామారావు; తిరుక్కుఱళ్ లోని ఒక వర్గాన్ని కామవేదముగా అనువదించిన జెజ్జాల కృష్ణ మోహన రావు గారు చేస్తున్న పరిచయం; రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల సమీక్ష – వేలూరి వేంకటేశ్వర రావు.
గ్రంథాలయం: తిరుక్కుఱళ్ లోని కామత్తుప్పాళ్ వర్గానికి తెలుగు సేత: కామవేదము – జెజ్జాల కృష్ణ మోహన రావు.
శబ్దతరంగాలు: శబ్ద సాహిత్యం ఏ నడలో ఏ ఎడలో – కనకప్రసాద్ గీతం, మైఖెల్ మఖల్ సంగీతం; ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుండి అలనాటి ప్రసారం నాటికి నేడు నాటిక – పరుచూరి శ్రీనివాస్ సేకరణ. కుటుంబరావు, సీతారత్నం పాత్రధారులైన ఈ నాటకం వింటే మీరు నవ్వకుండా వుండలేరని మా నమ్మకం.
శీర్షికలు: కథ నచ్చిన కారణం లో రెండుబంట్లు పోయాయి కథ ఎందుకు నచ్చిందో చెబుతూ వేలూరి వేంకటేశ్వర రావు; సామాన్యుని స్వగతం నుంచి మరో స్వగతం వాహన యోగం – వింధ్యవాసిని; రాముని ధనుష్టంకారాన్ని పదాల్లో ప్రతిధ్వనించిన మల్లికార్జున భట్టు పద్యం గురించి చీమలమర్రి బృందావనరావు నాకు నచ్చిన పద్యం శీర్షికలో.
ప్రకటనలు: డా. శ్రీదేవి మురళీధర్ రచించిన పుస్తకం ఆవిష్కరణ ఆన్లైన్‌లో ఉచితంగా లభ్యం. ఆల్కహాలిక్‌ల ప్రవర్తన ఎలా వుంటుంది, ఆ వ్యసనానికి లోబడినవారి లక్షణాలు, వారి ఇళ్ళలో పెరిగే పిల్లల మానసిక ఎదుగుదలపై అవి చూపే ప్రభావమూ ఎంతో చక్కగా వివరించారు. మీరసలు తాగకపోయినా, ఆ ప్రపంచం మీకు తెలియకపోయినా సరే, ఈ పుస్తకం ఒక్కసారి చదవండి. మీరు మెచ్చుకుని తీరతారు; ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం 2010 విజేతల వివరాలు – తమ్మినేని యదుకుల భూషణ్.

మీ సద్విమర్శలు తెలియజేయండి. తప్పులుంటే మన్నించి సరిదిద్దండి. ఈమాట చదవండి, చదివించండి.

ఈమాట సంపాదకుల బృందం.