సావిత్రి గురించి కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో.
రచయిత వివరాలు
పూర్తిపేరు: కొడవటిగంటి రోహిణీప్రసాద్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://rohiniprasadk.blogspot.com/
రచయిత గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు.
కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచనలు
విలాయత్‌ఖాన్ సితార్ కచేరీ మొదటిసారిగా మద్రాసులో 1965లో. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ స్వయంగా మొదటి వరసలో కూర్చుని, విని ఆనందించిన ఆ కచేరీకి చిట్టిబాబు కూడా హాజరయారు. అందులో విలాయత్‌ఖాన్ పిలూ రాగంలో తన తాతగారు ఇమ్‌దాద్‌ఖాన్, తండ్రి ఇనాయత్‌ఖాన్ వాయించిన పిలూ రాగపు గత్‌లను సగర్వంగా వాయించారు.
రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.
విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు.
తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది.
సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది.
పహాడీ హిందూస్తానీ రాగమే కాని, కర్నాటక విద్వాంసులు కూడా లలితగీతాల్లో ఈ పహాడీ రాగం వినిపిస్తూ ఉంటారు. బాలమురళి పాడిన అష్టపది రమతే యమునా, వోలేటి పాడిన గడచేనటే సఖీ వగైరాలు ఇందుకు ఉదాహరణలు.
నవంబర్ 1952 కినిమా సంచికలో అప్పటి సినీరంగంలో పైకొస్తున్న హాస్యనటులు రేలంగి, జోగారావు, బాలకృష్ణ, పద్మనాభం తమ తొలి అనుభవాలను వివరించారు.
దాశరథి రాసిన నిండుపున్నమి పండువెన్నెల అనే పాట ఏడక్షరాల లయమీద కష్టపడి అమర్చడం జరిగిందనీ బాలసరస్వతి చెప్పింది.
తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు.
పూనాలో పుట్టి పెరిగిన ఆమె తండ్రి మరాఠీ స్టేజి నాటక సంగీతప్రియుడు. భైరవి రాగం పేరు అతనికి తెలియడం అతని సంస్కారాన్ని సూచిస్తుందని నేను సమాధానం చెప్పాను. ఆ తరం మహారాష్ట్రులకు నాట్యసంగీత్ అంటే వల్లమాలిన అభిమానం.
తప్పటడుగులు వేసే తెలుగింటి పిల్లవాడు ఈ రచనలో మన కళ్ళముందు ఎంతో ముద్దుగా సాక్షాత్కరిస్తాడు. చదువుకోడానికే ఎంతో అద్భుతంగా, తెలుగుదనం ఉట్టిపడే ఈ రచనకు శంకరాభరణంలో స్వరరచన జరిగింది.
మా నాన్నా, మా బాబాయీ ప్రతిఏటా తల్లిదండ్రులకు తద్దినాలు పెడుతూ ఉండేవారు. ఒకసారి తమతో ఉపవాసం ఉండవలసిన పురోహితుడు కర్మకు ముందు రహస్యంగా హోటలుకెళ్ళి తినిరావడం వారి కంటబడిందట.
అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే.
ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’
సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.
రాగం, స్వరం, తాళం, లయ అన్నిటిమీదా బాలమురళికి ఎంతో అధికారమూ, నియంత్రణా ఉన్నాయి. ఆయనను మైలు దూరానికి కూడా సమీపించగల కర్నాటక గాయకులు లేరు. ఆయనకు సమకాలికులం అయినందుకు మనమంతా గర్వపడాలి.
మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది.
ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.
హిందుస్తానీ గాత్రంలో ప్రాచుర్యంలో ఉన్న వివిధ పద్ధతులను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
ప్రపంచంలోని సినీదర్శకులలో అగ్రశ్రేణికి చెందిన సత్యజిత్ రాయ్ (1921-1992) గొప్పతనాన్ని వర్ణించడానికి బహుముఖప్రజ్ఞాశాలి అనే పదం కూడా సరిపోదేమో. దర్శకత్వం మటుకే కాక, కథారచన, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమటోగ్రఫీ, సంగీత దర్శకత్వం, కళాదర్శకత్వం ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి శాఖలోనూ అత్యుత్తమ స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన రాయ్ చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కూడా మేటి అనిపించుకున్నాడు.
కంప్యూటర్ కీబోర్డు మీద వావీవరస లేకుండా టైప్ చేసినట్టయితే మహాకావ్యం తయారవుతుందా? అవదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సంగీతం కీబోర్డు మీద అయితే ఏదైనా రాగం పలుకుతుందా? చాలామంది నమ్మకపోవచ్చుగాని పలుకుతుంది. నిజానికి అన్నీ తెల్లనివో, నల్లనివో వాయిస్తే రాగం పలకకపోవడమే అరుదు. అతి ప్రాథమిక స్థాయిలో సంగీతం వాయించదలుచుకున్నవాళ్ళ కోసమే ఈ వ్యాసం.
ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు.
అతను లతా మంగేశ్కర్ చేత పాడించకుండానే హిందీ సినీ రంగంలో సంగీత దర్శకుడుగా వెలిగాడు. స్వరజ్ఞానమేదీ లేకుండానే సంగీత దర్శకత్వం చేపట్టి విజయం సాధించాడు.
సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో “బ్రహ్మవిద్య” కాదని నా ఉద్దేశం. శాస్త్రీయ సంగీతాన్ని కొంతవరకూ “డీ మిస్టిఫై” చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్‌కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్” పాట కోసమని ముకేశ్ నౌషాద్ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్ చేశాడట. అప్పటి కమిట్‌మెంట్ అటువంటిది.
ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.
దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుందికాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే.
తెలుగు బాలసాహిత్య జాతకంలో “చంద్ర మహాదశ” వంటిదేదో “చందమామ”తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది.
హిందూస్తానీ గాత్రంలో విలంబిత్ ఖయాల్ విన్న తెలుగువాళ్ళు కొందరు “ఇదేమిట్రా, పులితేన్పు లొచ్చినట్టుగా పాడుతున్నాడూ?” అంటారు.
శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్ వ్యవహారం. అయనా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయ. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.
సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.
శాస్త్రీయ రాగాలతో ఘంటసాలకు ఉండిన గాఢమైన పరిచయం, వాటిని సాహిత్యానికి ఎలా ప్రతిభావంతంగా వాడుకోవాలో తెలియడం, కొత్త రాగాలను ప్రవేశపెట్టి అవసరమైనప్పుడు వాటిచేత (శ్రీశ్రీ చెప్పినట్టు) “అందంగా చాకిరీ చేయించుకోవడం” ఆయనకు బాగా తెలుసు.
1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి.
1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్ […]
కొన్నేళ్ళ కిందట నా దగ్గర సితార్ నేర్చుకుంటున్న ఒక హిందీ అమ్మాయి “సంగీత కచేరీల్లో అప్పుడప్పుడూ ఎందుకు వాహ్వా అంటూ ఉంటారు?” అని అడిగింది. […]
నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ […]
ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]
సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్, కర్ణాటక సంగీతపు […]
రాగాన్ని విని ఆనందించడానికి కొంత పరిజ్ఞానం అవసరమేమో కాని లయబద్ధమైన సంగీతం అందరికీ సులువుగా బోధపడుతుంది. సైన్యం కవాతులో గుర్రాలు కూడా భేరీల మోతను […]
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా […]
హిందూస్తానీ సంగీతకారులు చాలామంది ప్రతి ఏడాదీ తమ గురువుల పేర సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ ఆనవాయితీ కర్ణాటకసంగీతంలో కనబడదు. తెలుగువారిలోనే ద్వారం, పారుపల్లి, […]
“కొందరు పబ్లిసిటీ కోసం సాధన చేసి దాన్ని సంపాదించుకుంటారు. నా వంటివాళ్ళు సంగీతాన్ని సాధించే ప్రయత్నంలోనే మునిగితేలుతూంటారు. నాకు పబ్లిసిటీ అంతగా రాకపోవడంలో ఆశ్చర్యం […]
ఈ రోజుల్లో తమ పిల్లలకు సంగీతం నేర్పించాలని చాలా మంది తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరివద్ద నేర్చుకోవాలనేది ఒక సమస్య అయితే ఎటువంటి […]
అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఉయాల తీయని గాంధర్వ హేల గాయకమణి ఘంటసాల సి.నారాయణరెడ్డి ఘంటసాలవారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగభావమేది! […]
(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లోని లోతుపాతులను తేలికైన భావాల్లో వివరిస్తూ రాస్తున్న వ్యాసాలు “ఈమాట” పాఠకులకు చిరపరిచితాలు. సితార్ వాద్యకారుడిగా, […]
(కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు శాస్త్రీయసంగీతంలో, ముఖ్యంగా హిందూస్తానీసంగీతంలో, విశేషమైన ప్రతిభ ఉన్నవారు. సితార్ వాద్యకారులు. ఎన్నో లలితసంగీత కార్యక్రమాలు ఇచ్చారు, ఇప్పించారు. సంగీతం గురించిన […]
ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం కానిదంతా (జానపద సంగీతం తప్ప) లలిత సంగీతమే అనే భావన ఉండేది. అందులో భావగీతాలూ, సినిమా పాటలూ అన్నీ భాగంగా […]
ఈ సంచికలో శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి రెండు వ్యాసాలు — ‘షికారు పోయి చూదమా..’, ఓహో యాత్రికుడా..’– ప్రచురిస్తున్నాం. తియ్యటి బాణీల […]