వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్‌

నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ సాధించినటువంటి మహనీlుుడు ఉస్తాద్‌ అల్లాఉద్దీన్‌ఖాన్‌. ఈనాడు అనేకమంది గాయకులూ, వాయిద్యకారులూ శా్త్రీసlు సంగీతం వినిపిస్తునా్నరు. కాని ఒక శతాబ్దం కిందట మన దేశంలో సంగీతమంటే ప్రధానంగా గాత్రసంగీతమే. ఉత్తరాదిలో అనేక రకాల వాద్యసంగీతానికి గాత్రంతో సవూనమైన ప్రతిపత్తి కలిగించినవాడు ఉస్తాద్‌ అల్లాఉద్దీన్‌ ఖాన్‌.

అల్లాఉద్దీన్‌ఖాన్‌ 1862లో ఇప్పటి బంగ్లాదేశ్‌కి చెందిన ప్రాంతంలో ఒక సంసా్కరవంతుల సంపన్న కుటుంబంలో జన్మించాడు. (ఆ కారణంగా ఆయన బంగ్లాదేశ్‌వాడనీ, ఈనాటి మధ్యప్రదేశ్‌ పురసా్కరానికి ఆయన అర్హుడు కాడనీ మతపరమైన విదే్వషంతో ఇటీవల ఒక స్థానిక రాజకీlు ప్రబుద్ధుడు వాదించాడు. అతనికి తెలుసో తెలియదో కాని 1905దాకా బెంగాల్‌ విభజనే జరగలేదు.) అల్లాఉద్దీన్‌కు ముందు మూడు నాలుగు తరాల క్రితమే హిందువులైన వారి పూర్వీకులు ఇస్లాం మతం పుచు్చకునా్నరు కనక ఆయనకు చిన్నతనంలోనే హిందువుల సంస్కృతీ, ఆచారవ్యవహారాల గురించి మంచి అవగాహన ఏర్పడింది. తరవాతి కాలంలో ఆయన మతవిదే్వషాలకు అతీతుడుగా తన కూతురికి అన్నపూర్ణ, మనమలకు ఆశీశ్‌, ధా్యనేశ్‌ వంటి ేపర్లు ెపట్టుకున్నాడు.

చిన్నవయసులో అల్లాఉద్దీన్‌కు స్కూలు చదువు సరిపడక తన సోదరుడు ఫకీర్‌ ఆఫ్తాబుద్దీన్‌వద్ద మొదట తబలా, వయొలిన్‌ నేర్చుకున్నాడు. (ఈ ఆఫ్తాబుద్దీనే తరవాతి కాలంలో ఫ్లూట్‌, దోతారా వంటి వాయిదా్యలపై శా్త్రీసlుసంగీతం వినిపించాడు). చిన్నప్పుడే సంగీతం ిపచ్చి ఉండడంతో అల్లాఉద్దీన్‌ సంచారజీవితం గడిపే ఒక వాద్యబృందం వెంట తాను ఒక అనాథనని వారికి చెప్పి, ఢోలక్‌ వగైరా వాదా్యలు వాయిస్తూ ఢాకా దాకా ఊరూరూ తిరిగాడు. తరవాత అతను ఎన్నో కష్టాలుపడి, కలకత్తా చేరుకుని అక్కడ గోపాల్‌చంద్ర భట్టాచార్య అనే ప్రసిద్ధ గాయకుడి వద్ద ఏడేళ్ళపాటు గాత్రం నేర్చుకున్నాడు. ఆ ిపవు్మట ఒక ఎనిమిదేళ్ళ పిల్లతో అతనికి వివాహం చేయటానికి అతని సోదరుడు అతన్ని తనవెంట స్వగ్రామానికి తీసుకెళా్ళడు. అలా ఇంటికెళ్ళిన కొద్దిరోజుల వ్యవధిలోనే అల్లాఉద్దీన్‌కు తన గురువు మరణవార్త అందింది. అల్లాఉద్దీన్‌ ఎంతో వ్యథతో ెపళ్ళయిన రాత్రే కలకత్తాకు తిరిగివచ్చాడు. ఇక గాత్రసంగీతానికి స్వస్తి చెప్పి వయొలిన్‌, క్లారినెట్‌, పియానో, షహనాయ్‌, డ్రమ్స్‌ వగైరా రెండు వందలకు పైగా రకరకాల వాయిదా్యల్లో తర్ఫీదు పొందాడు. అతనికి శిక్షణ నిచ్చినవారిలో వివేకానందుడి సోదరుడైన హబుల్‌ దత్తా, కలకత్తా ఈడెన్‌ గార్డెన్‌ ఆర్కెస్ట్రా నిరా్వహకుడు రాబర్ట్‌ లోబో, అతని భార్యా, హజారీ అనే షహనాయి విదా్వంసుడూ తదితరులునా్నరు.

మొదట్లో భుక్తికోసం అల్లాఉద్దీన్‌ అనేక థిlేుటర్లలో వాయిదా్యలు వాయించేవాడు. ఒకసారి ఆయన ఎవరిదో సరోద్‌ వినడం తటస్థించింది.గంభీరంగా, గమకాలు అద్భుతంగా పలికే సరోద్‌కు సితార్‌, వీణలాగా మెట్లుండవు. అది మధ్య ఆసిlూనుండి మన దేశానికి దిగుమతి అయిన వాదా్యనికి ఒక రూపం. ఇక సరోద్‌ నేర్చుకుంటే తప్ప లాభం లేదనిపించి అల్లాఉద్దీన్‌ రామ్‌పూర్‌ సంస్థానం చేరుకున్నాడు. అక్కడ అహ్మదలీ అనే విదా్వంసుడికి శిష్యుడయాడు. తరవాత రామ్‌పుర్‌లో ఉన్న అనేక గొప్ప కళాకారులతో పరిచయం ఏర్పడింది. అందరిలోకీ గొప్పవాడు వజీర్‌ఖాన్‌ అనే ఉస్తాద్‌. తాన్‌సేన్‌ సంప్రదాయానికి చెందిన వజీర్‌ఖాన్‌ నవాబు ఆస్థానంలోనివాడు. ఆయనవద్ద శిష్యుడుగా చేరడానికి అల్లాఉద్దీన్‌ నానాపాట్లూ పడి మొత్తం మీద సాధించాడు. ఆ ఘట్టాన్నొక జానపద కథలాగా అల్లాఉద్దీన్‌ తరవాతి యుగంలో తన శిష్యులకు చెప్పాడు. మొత్తానికి వజీర్‌ఖాన్‌ వద్ద ధ్రుపద్‌ వగైరా శైలులలో గాత్రం, సరోద్‌, సుర్‌శృంగార్‌, రబాబ్‌ వంటి వాయిదా్యలూ నలభై ఏళ్ళపాటు సాధన చేశాడు. మధ్యలో అల్లాఉద్దీన్‌ కుటుంబం అతన్ని బలవంతెపట్టి రెండో వివాహం జరిపించింది. అయినా అతని మనసంతా సంగీతం మీదనే ఉండేది. ెపళ్ళవగానే గురువు దగ్గరికి పరిగెత్తాడు. అది భరించలేకపోయిన రెండో భార్య కొనా్నళ్ళకు ఆత్మహత్యకు ప్రlుత్నించిందని టెలిగ్రాం రావడంతో వజీర్‌ఖాన్‌కు అల్లాఉద్దీన్‌ సంగతి అర్థమయింది. అప్పట్నించీ అతనికి అతిశ్రద్ధతో సంగీతం నేర్పసాగాడు. తాను స్వlుంగా వైణికుడు కనక ఆ ఒక్కటీ తప్ప ఏ వాయిద్యంలోనైనా కృషి చేసేలా అల్లాఉద్దీన్‌ చేత వజీర్‌ఖాన్‌ ప్రవూణం చేయించాడు. అందువల్లనే అల్లాఉద్దీన్‌ ఇతరులకు నేర్పినా తాను మాత్రం సితార్‌, వీణలపై ఎన్నడూ కచేరీలు చెయ్యలేదు.

1929లో అల్లాఉద్దీన్‌ఖాన్‌

అల్లాఉద్దీన్‌ కచేరీలు చేస్తున్న రోజుల్లో ఇతర విదా్వంసులు రంగురంగుల చమ్కీ దుస్తులూ, తలపాగాలూ, నగలూ, మెడల్స్‌తో అట్టహాసంగా దర్శనమిచే్చవారు. ఆlున మాత్రం నిరాడంబరంగా ఉండేవాడు. కాని బుకా్క ఫకీరులాగా కనిపించే అల్లాఉద్దీన్‌లో ఏదో తేజస్సు వెలుగుతున్న ట్టనిపించేది. సాధన చేస్తున్న దశలో ఆయనది రోజుకు కనీసం పదహారు గంటల రాక్షస సాధనే. మధ్యలో కునుకు తీlుకుండా తన జుట్టును గది పైకప్పునుంచి వేలాడే రింగుకు కట్టుకునేవాడట. జీవితమంతా సంగీతసాధకుడుగా గడిపిన అల్లాఉద్దీన్‌ సంగీతం కోసం ఎంతటి త్యాగానికైనా ిసద్ధపడేవాడు.

సరోద్‌ విదా్వంసుడు అల్లాఉద్దీన్‌ఖాన్‌

అల్లాఉద్దీన్‌కు ముందు వాయిద్యకారులంతా ఎవరి ధోరణిలో వారు తలోరకంగా వాయించేవారు. కొందరిది అతి నింపాదిగానూ ఇతరులది వేగవంతమైన వినా్యసాలతోనూ సాగేది. కొందరిది నాజూకు పద్ధతయితే కొందరిది బలంగా మోగే బాణీ. ఎన్నో దశాబ్దాలపాటు తాను ఒంటబట్టించుకున్న అన్ని శైలులనూ మేళవించి కచేరీల్లో అన్నిటి అందాలనూ కలగలిపి ప్రదర్శించే పద్ధతిని ప్రవేశెపట్టినవాడు అల్లాఉద్దీన్‌ ఖానే. తాళవాదా్యలూ, తంత్రీవాదా్యలూ ఇలా ఎన్నో రకాల వాయిదా్యలతో ఆయనకు ఉండిన గాఢమైన పరిచయం ఇందుకు తోడ్పడింది. ఆయన సంగీతంలో ఆలాపన, ధ్రుపద్‌ ధమార్‌, ఖlూల్‌, ఠువ్రీు, తరానా, టపా్ప మొదలైనవాటి అందాలన్నీ కలగలిసిపోయి ఉండేవి. అందుకు మొదట్లో ఆయనను వివుర్శించినవారూ లేకపోలేదు. కాలక్రమేణా అదంతా వాద్య సంప్రదాయంలో భాగమైపోయింది.

తరవాతి కాలంలో అల్లాఉద్దీన్‌ మైహర్‌ మహారాజు వద్ద ఆస్థాన విదా్వంసుడుగా పనిచేశాడు. తాను చిన్నతనంలో సంగీతం నేర్చుకోవడానికి ప్డడ కష్టాలు మరెవరికీ కలగకూడదని ఆయన భావించడం వల్ల ఎందరో ేపద విదా్యర్థులు బాగుప్డడారు. స్థానికులైన వందమంది అనాథ బాలలతో మైహర్‌ ఆర్కెస్ట్రా తయారు చేశాడు. వాళ్ళకందరికీ రకరకాల వాయిదా్యలు వాయించడంలో తన ఇంటివద్దనే ఉచితంగా తర్ఫీదు నిచే్చవాడు. జాతీlు, విదేశీ శైలుల కలయికతో భారతీlు సంగీతంలో వాద్యబృందాని కిదే తొలి ప్రlుత్నం.

సంగీత తపస్వి

అల్లాఉద్దీన్‌ను చిన్నప్పుడు ఆలం అనేవారు. ఋషివంటివాడు కనక వయసు మళా్ళక బాబా అనే ేపరు స్థిరపడింది. సుదీర్ఘమైన ఆయన జీవితసంగీత యాత్రలో అనేక దశాబ్దాలు క్షణాల్లా గడిచిపోయాయి.

1940ల చివరిలో తీసిన ఈ దుర్లభమైన ఫోటోలో ఉన్నవారు (ఎడమ నుంచి వరసగా) తబలా విదా్వంసుడు కంఠే మహారాజ్‌, తబలా విదా్వంసుడు కిషన్‌ మహారాజ్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, రవి శంకర్‌, తబలా విదా్వంసుడు అహ్మద్‌జాన్‌ థిరక్వా

స్వగృహంలో అల్లాఉద్దీన్‌ఖాన్‌

ఆయన శిష్యగణంలో మైహర్‌మహారాజుా, కుమారుడైన అలీఅక్బర్‌, కుమార్తె అన్నపూర్ణ, తరవాత అల్లుడుగా మారిన రవిశంకర్‌, సరోద్‌ నిపుణుడూ, బెంగాలీ ిసనీ సంగీతదర్శకుడూ అయిన తిమిర్‌బరన్‌, పనా్నలాల్‌ ఘోష్‌, నిఖిల్‌ బెనర్జీ తదితరులునా్నరు. స్వlుంగా వేణువులో ప్రతిభావంతుడైన పనా్నలాల్‌ ఘోష్‌ ఎంతో గౌరవంతో ఆయనకు శిష్యుడయాడు.

అల్లాఉద్దీన్‌కుమార్తె, రవిశంకర్‌ మొదటి భార్య అన్నపూర్ణ

1938 ప్రాంతాల అల్లాఉద్దీన్‌తో రవిశంకర్‌కు పరిచయం ఏర్పడింది. రవిశంకర్‌ తన అన్నగారైన ఉదయశంకర్‌తో అప్పుడప్పుడూ చిన్న చిన్న డాన్స్‌ ఐటమ్స్‌ చేస్తూ, విలాసజీవితం గడుపుతూ యూరప్‌ అంతటా తిరిగాడు. అప్పట్లో కొనా్నళు్ళ ఉదయశంకర్‌ బృందంలో సంగీతదర్శకుడుగా అల్లాఉద్దీన్‌ విదేశాలు పర్యటించాడు. అధునాతనమైన దుస్తులతో ఎప్పుడూ అమ్మాయిలవెంట పడే రవిశంకర్‌ను ఆయన వివుర్శిస్తూండేవాడు. ఆ తరవాత భారతీlు సంగీతం అంటే మోజు పెంచుకున్నరవిశంకర్‌ 1938లో తన తల్లి చనిపోవడంతో మన దేశానికి తిరిగివచ్చి, అల్లాఉద్దీన్‌ ఇంటికి వెళా్ళడు. శిరోముండనం చేయించుకుని, గాయత్రీ మంత్రం నేర్చుకుని, సాదా దుస్తులతో తన ముందుకు వచ్చిన రవిశంకర్‌ను అల్లాఉద్దీన్‌ మొదట గుర్తుపట్టలేకపోయాడు. రవిశంకర్‌ ఆయనను నెమ్మదిగా మెప్పించి, పొరుగునే ఒక్క నులకమంచం మాత్రమే ఉన్న ఒక గది అద్దెకు తీసుకుని, బైట దోమలూ, తేళూ్ళ, తోడేళూ్ళ ఉనా్న లెక్క చేయకుండా సంగీతసాధన చేయసాగాడు. రవిశంకర్‌లో కలిగిన పరివర్తనకు సంతోషించిన అల్లాఉద్దీన్‌ అతనికి తన కుమారుడు అలీ అక్బర్‌తో బాటు సంగీతం నేర్పి 1939లోనే అలహాబాద్‌లో కచేరీ కూడా ఏరా్పటు చేశాడు. సంగీతం సరిగ్గా నేర్చుకోనందుకు అయిదో ఏటి నుంచీ ఎన్నో సార్లు తండ్రి చేత దెబ్బలు తిన్న అలీ అక్బర్‌తో పోలిస్తే రవి శంకర్‌ సంగీతశిక్షణ కాస్త మృదువుగానే సాగింది.

రవిశంకర్‌, అలీఅక్బర్‌ఖాన్‌లకు సంగీతం నేర్పుతున్న అల్లాఉద్దీన్‌ఖాన్‌

శిక్షణలో కఠినుడైనా అల్లాఉద్దీన్‌ పద్ధతులు సులువుగా అర్థమయేలా ఉండేవి. తాళజ్ఞానం సరిగ్గా ఉండటానికి శిష్యులచేత ఆయన మొదట్లో తబలా సాధన చేయించేవాడు. తనకు తెలిసినదంతా ఏదీ దాచుకోకుండా శిష్యులకు నేరే్పవాడు. రవిశంకర్‌ శిక్షణ పూర్తయాక తనవద్దకు వచ్చిన నిఖిల్‌బెనర్జీ స్వభావానికి ప్రత్యేకంగా సరిపోయే వేరొక పద్ధతిలో ఆయన సంగీతం నేర్పాడు.

నిఖిల్‌ బెనర్జీని ఆశీర్వదిస్తున్న అల్లాఉద్దీన్‌ఖాన్‌

తాను సరోద్‌ కచేరీలు చేస్తున్న రోజుల్లో అల్లాఉద్దీన్‌ తన కచేరీలో చివరి అంశంగా రవిశంకర్‌ అలీఅక్బర్‌లతో కలిసి ఒక ఐటం వాయించేవాడు. ఆ విధంగా వారిని శ్రోతలకు పరిచయం చేసి పైకి తీసుకొచ్చాడు. సంగీతం నేర్చుకునేవారికి ఇతరత్రా జీవితంలో నిష్ఠా, నీతినిlుమాలూ చాలా ముఖ్యవుని ఆయన చెపుతూండేవాడు. ఎటువంటి ఆడంబరాలూ, కీర్తికాంక్షా లేకుండా ఆదర్శప్రాయంగా సాధుపుంగవుడిలాగా జీవించాడాయన.

సంగీతమే జీవితంగా సాగిన సుదీర్ఘ యాత్ర

పంతొమ్మిదో శతాబ్దంలో మొదలెట్టి, మొదట్లో సంగీత ిపపాిసగా, తరవాత సాధకుడుగానూ, గురువుగానూ వాద్యసంగీతంలో గొప్ప కృషి చేస్తూ నూటపదేళు్ళ జీవించిన ఈ సంగీత తపస్వికి ఎన్నో సనా్మనాలూ, బిరుదులూ లభించాయి. 1952లో సంగీతనాటక అకాడమీ ఫెలోషిప్‌, 1958లో పద్మభూషణ్‌, విశ్వభారతి యూనివర్సిటీ డాక్టరేట్‌ మొదలైనవి ఆయనను వరించాయి. తన జీవితకాలంలోనే శిష్యులకు ప్రపంచఖ్యాతి రావడం చూడగలిగాడు. ఆయన శైలికి ముఖ్యమైన వారసుడు ఆయన కుమారుడైన అలీఅక్బర్‌ఖాన్‌. ఆయన అనేక దశాబ్దాలుగా కాలిఫోర్నియాలో స్థిరపడి అక్కడ సంగీతకళాశాల నడుపుతున్నాడు. అతనికీ, రవిశంకర్‌ తదితరులకూ అనేకమంది ేపరుమోసిన శిష్యులునా్నరు. వారి దా్వరా బాబా అల్లాఉద్దీన్‌ఖాన్‌ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

కచేరీ దా్వరా గురువుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న రవిశంకర్‌, అలీఅక్బర్‌ఖాన్‌


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...