రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

విన్నపం

రచన: కె. శ్రీహిత
నవంబర్ 2003

మా ముఖ ద్వారాలకు
లేనిపోని అలంకారాలు చెయ్యొద్దు
తడబడే అడుగులు చూసి
మెట్ల తలలు కొట్టించొద్దు
గడపలను పగలకొట్టించొద్దు

నోరు తిరక్క మాటల్ని వొంచితే
నాలుక మందమై ఒత్తుల్ని ఖండిస్తే
‘ ఎవడు అడగొచ్చాడ ‘ ని
ఏకంగా అక్షరాలనే భక్షిస్తే
క్రొత్త గాలి బావుందని
మెచ్చుకోలు చప్పట్లు విప్పొద్దు
సన్మానాలు చేసి శాలువాలు కప్పొద్దు

మా పాటకు మద్దెల మీరు
మీ పాటకు మద్దెల మేము
గోడలే శ్రోతలైన పాట కచ్చెరీలో
పరస్పరం భుజాల్ని చరుచుకుని
పరవశులమై చిందులెయ్యొద్దు

చిత్రకారుడి స్పర్శలు
రాగాల మేళవింపులూ
బోసిగా నిల్చున్న గోడకు
ఇంద్రధనుర్వర్ణాల
రససంగమం కలిగిస్తే
ఇవన్నీ హంగులూ తతంగాలు
కాలాహరణ కారణాలని కొట్టి పారెయ్యొద్దు

గుండె చప్పుళ్ళకూ
హృదయ స్పందనలకు
భేదం గుర్తించే గుణాన్ని
మత్తుమందుతో నిద్రపుచ్చొద్దు

మందీ మార్బలం ఉందనీ
మందలో మన మాటే వేదమని
ఉత్సవ విగ్రహాలకు ప్రచార స్తోత్రాలు చెయ్యొద్దు
మొక్కుబడి మంగళ హారతులు ఇవ్వొద్దు
రేపటికి అస్తుల్ని పస్తుల్ని ఆస్తులుగా
మిగల్చొద్దు

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • విన్నపం
  • వృత్తం
  • భయం

ఇటువంటివే…

  1. నెమ్మదిగా నాట్యం
  2. బొంగురు గొంతు పాట
  3. రంగు
  4. చెరిగిపోని ..
  5. ఎల్లండెల్లండి

నవంబర్ 2003 సంచికలో ...

  • విన్నపం
  • మన దీపావళి కథ
  • ఆవిడ
  • ఇసక-1
  • ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) సంస్మరణ
  • ఎల్లండెల్లండి
  • కనువిప్పు
  • కొన్ని అనువాదాలు
  • చలంతో రజని ముఖాముఖి
  • చెరగని స్మృతులు 1 పన్నెండు పంపుల కథ
  • చెరిగిపోని ..
  • జాషువా గారి గబ్బిలం
  • తెలుగు జీవిత చరిత్రలు:ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”
  • నవంబర్ 2003
  • నెమ్మదిగా నాట్యం
  • నేరం నాది కాదు!
  • నౌకరీ
  • పాటల్లో లయవిన్యాసాలు
  • బొంగురు గొంతు పాట
  • భావప్రకటనా స్వాతంత్య్రం
  • మ్యూజింగ్స్
  • రంగు
  • వంటా వార్పు
  • విమర్శాదర్శము
  • శ్రీలలితా సహస్రనామ వైశిష్య్టమ్‌
  • సత్యం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రంగు
చెరిగిపోని ..

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.