జననం

పాతిక లాలసాతప్త దేహాల పరిమళాలతో
ఐదు మంచుపర్వతాల సౌందర్యాలతో
అసంఖ్యాక జంటగోళాల చలన సంగీతంతో
వెయ్యి కళ్ళ మమతల నీలి కాంతులతో
శతకోటి చల్లని చంద్రుళ్ళ వెన్నెలలతో
నూరు చిరు పచ్చికల మెత్తని ఆనందాలతో
రెండు రాగరంజిత లోయల అనురాగాలతో
కోటికోట్ల నక్షత్రాల తళుకు చూపులతో
నలభయ్ యవ్వనం సూర్యుళ్ళ దాహంతో
ఒకే ఒక్క మనసుతో ఒకేఒక్క మనసు కోసం
ఇంత కాలానికి జన్మించాను