పెను చీకటికవతల
ఏముందో తెలుసుకోవాలనీ
ఆది అంతాలను గ్రహించాలనీ
జనన మరణాల
రహస్యాన్ని ఛేదించాలనీ
నేను అనుకుంటుంటే,
రేయి లేదు
పగలు లేదు
మొదలు చివరలసలే లేవు
ఆఖరికి
చావు బ్రతుకులు కూడా
లేవని నీవంటావు.
మరి ఉన్నదేమిటయ్యా అంటే
ఉన్నదంతా ‘నువ్వే’ నంటావు
‘నేనా’ అని ఆశ్చర్యపోతుంటే
దొంగలా నవ్వుతూ
నా కళ్ళలోకి చూస్తావు
నా లోలోపల దాక్కొని
‘అదే నేను’
నన్ను వెతుకు అంటావు.
రచయిత రాధ మండువ గురించి:
భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి. ... పూర్తిగా »
Begin typing your search above and press return to search. Press Esc to cancel.