రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అనురాగ దగ్ధ సమాధి

రచన: రేవతీదేవి

నేనెవరినో మీకెవరికీ తెలియదు
ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును
నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన
జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు

ఆ కళ్ళు ఆ అనురాగం కళ్ళు
అనురాగం ఎంత అందంగా ఉండటానికి వీలుంటుందో
అంత అందంగానూ ఉండే ఆ అనురాగం కళ్ళు
లోకమంతట్లోనూ నన్నే చూసే ఆ అందమైన అనురాగం కళ్ళు
నాలోనే లోకమంతటినీ చూసే ఆ అనురాగపుటందమైన కళ్ళు
అనురాగ జలధులై
యుగయుగాల సమస్త ప్రాణికోటి అనురాగాన్నీ
నా పైన అవిరళంగా వర్షించే అనురాగమేఘాలు ఆ కళ్ళు

ఏమిటీ ఆ కళ్ళు మీకు తెలీదా
మూణ్ణిమిషాల్లా గడిచిన ఐదు శతాబ్దాలుగా
అనుక్షణం చూస్తున్న నాకే తెలియదు
ఆ కళ్ళ అనురాగ నీలిమలో కరిగికలిసి లీనమైపోవటం తప్ప

ఈ హృదయం
రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు
ఆ మమతల చెక్కిలిచేర్చనిదే
ఈ సెగ చల్లారదు

ఎర్రని మధువుతో వెచ్చగా చిప్పిలే యీ పెదాలతో
ఆ ఒళ్ళంతా తడవనిదే
ఈ సెగ చల్లారదు

వేడి నెత్తుటితీగలై సాగిన యీ చేతుల బిగింపులో
ఆ మెత్తని నున్నటి గట్టి శరీరం చిదకనిదే
ఈ సెగ చల్లారదు

ఈ సాంద్ర లాలసా తప్త వేదనాస్తిత్వం
ఆ ప్రగాఢాత్మీయ సాన్నిధ్య సాయుజ్యం పొందనిదే
ఈ సెగ చల్లారదు

ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ
ఆ శతసహస్ర ప్రకంపనల వేళ్ళు మీటనిదే
ఈ సెగ చల్లారదు

ఆ శ్వాసలో శ్వాసై ఆ ప్రాణంలో ప్రాణమై
ఆ ఊపిరిలో ఊపిరై ఆ జీవంలో జీవమై
భ్రమించి తపించి క్రమించి శ్రమించి గతించనిదే
ఈ సెగ చల్లారదు

ఆదిశంకర సౌందర్యలహరిలో పునీతమై తను
రాధామాధవ నైతికాద్వైత సమాగమంలో పవిత్రమై నేను
తనువంతటా మనసైన మనసంతటా తనువైన
నేనైన తనలో పరిపూర్ణమై మేము

ఈ కామమోక్ష మోక్షకామ అశాంతుల అగ్నిగోళ
మహారణ్యాల కాంక్షా సౌందర్య తాండవ కీలల్లో
దగ్ధమై ప్రభవించి ప్రభవించి దగ్ధమై
రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Sainath Reddy March 8, 2017 11:44 am

    ఆహా మహాద్భుతంగా రాసారండి. గౌరవనీయులైన శ్రీమతి రేవతీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాధాలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రుచించని మాట
  • హృచ్ఛితి
  • ఉన్మాద ప్రకృతి
  • నిష్క్రమణ
  • దేవుడూ

ఇటువంటివే…

  1. శిలాలోలిత
  2. దారి
  3. హృచ్ఛితి
  4. నేనూహించని కవిత
  5. శిలాలోలిత : విషయ సూచిక

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఉక్కు శిశువు
మలిపలుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.