రచయిత వివరాలు

పూర్తిపేరు: సూరపరాజు రాధాకృష్ణమూర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

వాస్తవంలో యివి రెండు కావు కూడా. పారలౌకికంలో లౌకికం యిమిడి ఉంటుంది, గుర్తించగలిగినవాడికి. ఈ రెండు ప్రేమలను సూఫీలు ఇష్కే హకీకీ, ఇష్కే మిజాజీ అంటారు. తమిళ వేదాంతులు చిరిన్బమ్ పెరిన్బమ్ అంటారు. వీరందరికీ ముందు ఉపనిషత్తే చెప్పింది, దివ్యానందం స్త్రీపరిష్వంగంలా ఉంటుందని:

ఎలియట్ ఎక్కడనుండి ఎవరినుండి దేనిని గ్రహించినా యథాతథంగా గ్రహించడు కదా. అంతేకాదు, తిరిగి యివ్వకుండా ఏదీ తీసుకోడు. ఈ ఉపనిషత్తులోని ‘దత్త దామ్యత దయధ్వమ్’ వరుస మార్చి, ‘దత్త దయధ్వమ్ దామ్యత’ చేశాడు. అంతే కాదు. ఆ ఉపదేశాలకు తన స్వీయభాష్యం కూడా చెప్పాడు, కవితారూపంలో.

ఇక్కడ గమనించవలసింది ఏమంటే, డెత్ బై వాటర్‌ను ఎలియట్ తన మిత్రుడి మరణంతో కలిగిన శోకంలో, తన వివాహవైఫల్యంలో మొదలుపెట్టాడు. ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ వద్దనలేదు. ఏమిటి దీని అర్థం పరమార్థం? కవి లేకుండా, కవి కష్టసుఖాలు, కవి అనుభూతి లేకుండా, కవిత్వం లేదు.

ఇది చదివినప్పుడు మరో పడవప్రణయం గుర్తొస్తుంది. పరాశరమహర్షిని తన పడవ ఎక్కించుకొన్నది మత్స్యగంధి. నది దాటిస్తుండగా, పరాశరుడు ఆ కన్యను కోరాడు, ఆ చిన్న యిరుకు పడవలోనే, అప్పటికప్పుడే జరిగిపోవలె అన్నాడు. ఆ కన్నెపిల్ల సందేహిస్తుంటే, ‘నీ కన్యాత్వంబు దూషితంబుగాదోడకు’ అని ఆశ్వాసించాడు.

కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు.

జీవితాలు వ్యర్ధంగా గడిచిపోతున్నాయి, త్వరపడండి, సార్థకం చేసుకోండి, అన్న హెచ్చరిక. ‘ఎ గేమ్ అఫ్‌ కోర్స్‌’ ప్రారంభదృశ్యం లోని సంపన్నస్త్రీ అయినా, ముగింపుదృశ్యం లోని లిల్ అయినా జీవితాల ముగింపు ఒకటే. క్లియోపాత్ర లాగానో ఒఫీలియా లాగానో కథ విషాదాంతమే – మరణమో, సదృశమైన జడజీవనమో. కాని జీవితచదరంగం యిద్దరికీ సామాన్యమే.

ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి.

మొక్కలు నాటడం విన్నాం, శవాలు నాటడం! ఆ ప్రేతానికి రెండువేల సంవత్సరాలు గడిచినా, క్రిందటి ఏడాదే అనుకుంటున్నాడు. పోయిన ఏడాది నీ పెరట్లో శవాన్ని నాటావు కదా? అది మొలిచిందా? అని అడుగుతున్నాడు! అసలు వాళ్ళు ప్రేతాలేనా? ప్రేతప్రాయులైన ప్రాణులా? అతడు మాట్లాడుతున్నది, ప్యూనిక్ యుద్ధం గురించేనా, లేక గత ఏడాది జరిగిన ప్రపంచయుద్ధమా?

జాతకాలు చెప్పేవాళ్ళు రెండు విధాలు. కొందరు, జాతకచక్రం చేతిలోకి తీసుకొంటూనే, ‘ఓహో! ఆహా! మహజ్జాతకం! ఆరు నెలలలో అమెరికా వెళ్ళి పోతావు. వచ్చేటపుడు ఒక ఐ-ప్యాడ్ తెస్తావుగా నాకోసం’ అంటాడు. మరొకాయన, చక్రం చూస్తూనే ముఖం చిట్లిస్తాడు. ‘ఈ పిల్లకు కుజదోషం’ అని మొదలుపెట్టి, కట్టకముందే తాళి తెంపేస్తాడు.

గొప్ప పాట! గొప్ప భావన! సీతమ్మ శోకం లోకానికంతటికీ తెలిసేది, జలధితరంగాల లాగా. రామయ్య బాధ లోకానికి తెలిసేది కాదు. ఆ శోకం ఆయన మదిలో భద్రం. ఇది అర్థానికి ఒక పొర. ఈ తెర తొలగిస్తే మరో గాఢార్థం. కనుకట్టులో కనువిప్పును దాచిన మహాకవి వేటూరి! కనుకట్టు: సీతారాముల వియోగం; కనువిప్పు: సముద్రము తరంగము, రెంటికీ వియోగమా?

వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు?

ఈ కవితను ఎలా చదవాలి? అడగవలసిన ప్రశ్న: ఎలా చదవకూడదు? ఇది చదవకూడని కవిత. సరిగమలు చదివితే సంగీతమవుతుందా? వేస్ట్‌ లాండ్‍ లోని పదాల, పదార్థాల స్వరాలకు సంగీతరచన చేసుకొని, చెవులు మూసుకొని వినాలి. అర్థం చేసుకోవలసినది కూడా కాదు.

వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.

ప్రాచ్యంలో కవులు సాధారణంగా ఆధ్యాత్మిక ఆర్తిని సూచించడానికి రతిని వర్ణిస్తారు. పరమాత్మను స్త్రీగా (ఉమర్ ఖయ్యామ్), పురుషుడిగా (సూరదాసు, క్షేత్రయ) భావించి కవిత చెప్పారు. ఈ రతి ఎలియట్‍లో విరతిగా కావ్యవస్తువు అయింది. అంటే, లైంగికవాంఛ, దాని సాఫల్యము ఎలియట్ కవితలలో అభావరూపంలో ఉంటుంది.

కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు.

సాహిత్యంలోగాని యితర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.

హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.

బోద్‌లేర్ అసాధారణకవి. అతడికి ఖ్యాతి అపఖ్యాతి కూడా అమితంగా లభించాయి. అపఖ్యాతిలో కొంత అతడు కోరి తెచ్చుకున్నదే. అతని అపఖ్యాతికి ప్రధానకారణం అతడి అద్భుత కవితా శిల్పాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్లనే. ఆ రచనా శిల్పాన్ని కొంతైనా ఆవిష్కరించే ప్రయత్నమే యీ వ్యాఖ్య.

సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.

ఒక రచయిత తన రచనకు గ్రహించిన మూలాన్ని–అది చరిత్ర గాని పురాణం గాని–తన రచనకు అవసరమైన విధంగా మార్చుకోడంలో విశేషం లేదు. షేక్స్‌పియర్ చరిత్రను మార్చడమే కాదు, ఆ చరిత్రను తన వ్యక్తిజీవనావసరాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇది కూడా విశేషమేమీ కాదు. విశేషమేమంటే, ఆ అవసరాలు నాటకంలో తొంగికూడా చూడలేనంతగా కథను కళగా మలచుకోవడం.

దాన్తె ఇటాలియన్ భాషలో తెలుగులో నన్నయలాంటివాడు. అతనికి పూర్వం ఒకరిద్దరు ఆ భాషలో కవులున్నా, దాన్తె కావ్యంతో ఆ భాషకు గొప్ప గుర్తింపు వచ్చింది. హోమర్ గ్రీకు, వర్జిల్ లాటిన్‌తో సాటిగా దాన్తె ఇటాలియన్ గుర్తింపు పొందింది. దాన్తెకు మనమేమీ బిరుదులివ్వనవసరం లేదు. ఆయనకు బోలెడంత ఆత్మవిశ్వాసం. తిక్కనకేమీ తీసిపోడు.

స్త్రీపర్వంలో పగ పరాకాష్ఠ చేరిన సన్నివేశం ప్రసిద్ధం. ఆ పగను ఊహించిన కృష్ణుడు (పగను ఊహించడానికి పరమాత్ముడే కానక్కరలేదు) ధృతరాష్ట్రుడికి ముందు ఉక్కుభీముణ్ణి ఉంచిన కథ తెలియని వాడుండడు భారతదేశంలో. పగ పగతో ఆరదు, ఎన్నటికీ తీరదు. ఉక్కు తీర్మానాలు కూడా తుక్కు కావలసిందే. ఇదే భారతం తీర్మానం. భారతం చెప్పిన పరిష్కారం ఏమిటి?

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.