వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు?

మనోరమ నాకన్నా బాగా పెద్దమ్మాయి. దానికి చాలా విషయాలు తెలుసు. అది మగపిల్లల బళ్ళో చదూతూంది. నే నాల్గోక్లాసు చదూతూన్నప్పుడు నాన్న తనతోపాటు నన్నూ కానుకుర్తివారి సత్రంకి తీసుకెళ్ళేడు. అదిగో – ఆవేళ అక్కడ మొట్టమొదటి సారి మనోరమని చూశా. మాటాడే. నాటకం చూడ్డానికే కాదు, డబ్బులు దండడానికీ వచ్చేనని చెప్పింది.

మొత్తానికి ఇళ్ళకన్నా, ఇళ్ళు చూపించిపెట్టే ఏజంట్ల వెదుకులాట అనేది అతి ముఖ్యం అయిపోయింది నాకు. ఆ పనిలోనే ఒకరోజు కాస్త పాపభీతి, దైవభక్తి మెండుగా ఉన్నట్టు కనపడే ఒక ఏజెంట్‌ దొరికాడు. నేను అతడిని కలవడానికి వెళ్ళిన సమయంలో అతను ఒక దేవత పటం ముందు నేలమీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు.

తిలక్ మొదటగా తనను తాను చూసుకున్నది, చెక్కుకున్నది, పక్వమైనదీ ఒక పద్యకవిగానే. అందుకనే ఆయన వచనకవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టిన తరువాత కూడా పద్యాన్ని విడిచిపెట్టలేదు. తిలక్ పద్యం ఒక మెత్తందనాల జల్లు. కవితాగుణాల పెల్లు. ఆయన ఛందస్సును కించపరచకుండా లొంగదీసుకొని దానికి ఆధునికభాష నేర్పాడు. వినమ్రంగా పద్యసరస్వతి చెంపపై సరికొత్తగా చిటికవేశాడు. ఆమె నవ్వును గమనించి తల పైకి ఎత్తాడు. తన ఛాతీని విప్పార్చాడు.

గడ్డకట్టిన జీవితాలు
మాటలు మర్చిపోయి
ప్రేమలు కరువై
అరచేతులు రుద్దుకుంటూ
గొంగళ్ళు కప్పుకున్న
మానవాళి ఆనవాళ్ళు.

ఒకచోట నీళ్ళలోకి దిగి, వేగంలేని అలలతో ఆడుతున్నాం. నాయర్‌కి ఈత వచ్చు. నాకూ ప్రకాశం బారేజ్ దగ్గరి ఘాట్‌లలో ఈదిన అనుభవం ఉన్నా, సముద్రంలో ఇదే మొదటిసారి… ఇంతలో, కొద్దిదూరంలో ముగ్గురు విదేశీ వనితలు. అంతే. మా చూపులు అటే తిరిగిపోయాయి. వాళ్ళు పరుగెడుతున్నారు. అలలకి అల్లంత దూరంలో ఉండగానే ఒక్కొక్కటిగా బట్టలు వలిచేసుకుంటూ దభేల్ దభేల్మంటూ నీళ్ళలోకి దూకారు. ఆ నవ్వులూ కేరింతలూ… నాయర్ ముఖంలో ఒక వెర్రి సంతోషం.

పాఠకులంటే ఎంతో చిన్నచూపు ఉంటే కాని ఓ రచయిత ఇలాంటి కథ రాయలేడు. మనుషులను సెన్సిటైజ్ చేయడం ఓ కుట్ర. రాజకీయాలకంటే సాహిత్యమే ఆ పని ఎక్కువ చేస్తుంది. దాన్ని రాజకీయం వాడుకుంటుంది. ఈ కథలో పేదరికం, వివక్ష, వెర్రి ప్రేమ ఇలాంటి వాటిని ఓవర్ రొమాంటిసైజ్ చేయడం ద్వారా పాఠకుడి ఆలోచనలతో కాకుండా ఎమోషన్‌తో ఆడుకోవాలనే ఆలోచన ఈ కథను, రచయితను ఇద్దరినీ అధమ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లుంది.

చిన్నప్పుడు నిజానికీ అబద్ధానికీ తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది. ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టడంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లమ్మక్క వేలు పట్టుకుని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలి వచ్చే పనివాళ్ళ కేకలు. వొద్దన్న పనులు చేస్తుంటే కలిగే ఆనందం, నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది.

టెస్ట్ స్ట్రిప్ మీద రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ కేరీ-ఆన్‌ లోంచి విడిచిన బట్టలని తీసి బాత్‌రూమ్‌లో ఒక మూల పడేసింది. మేకప్ తుడుచుకుని, మొహం కడుక్కుని, నైట్‌డ్రెస్‌లోకి మారి ఫోన్ చేతిలోకి తీసుకుంది. అప్పటికే మోగన్ నించి రెండు మిస్‌డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టడంవల్ల ఆమెకి తెలియలేదు. హబ్బీ అని, మోహన్ అనీ కాక ఆ పేరుతో భర్తనంబర్ లిస్ట్ చెయ్యడం తప్పితే, అతని ఇష్టానికి విరుధ్ధంగా చేసిన పని ఏదీ ఆమెకు గుర్తుకురాదు.

ముఖమంతా మాపుతో
నలిగిన పువ్వులా ఉంది
అంత భద్రంగా
లోపల దాచుకున్నానంటే
బహుశా కోహినూర్ వజ్రంకన్నా
విలువైనదే అయ్యుంటుంది

ఒకరోజు కొత్తబట్టలు కట్టుకుని మా ఇంటికి వచ్చింది మా అక్కను కలవడానికి. ఆ రోజు ఏ పండగా కాకపోవడంతో ఆ రోజు తన పుట్టిన రోజని గ్రహించాను. మధ్యాహ్నమల్లా కూచుని మంచి ఆర్ట్ పేపరు మీద వాసు రాసిన పాటని పొందికగా రాసి, మూడో చరణంలో ‘మూర్తి’ అన్న పదాన్ని కోట్‌లలో పెట్టి వాళ్ళమ్మగారు లేని సమయం చూసి వాళ్ళింటికి వెళ్ళి ‘ఇది నీకు నా పుట్టినరోజు కానుక’ అని చెప్పి బుచ్చిరత్నానికి ఇచ్చేను. అది చదివి నమ్మలేనట్టు నావంక చూసింది.

నాటు అంటే అర్థం తెలుసా? మొదట్లో జనం గుంపులు, గుంపులుగా ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి తిరుగుతూ బతికేవారు. తర్వాత తర్వాత వ్యవసాయం చెయ్యడం నేర్చుకున్నారు. దాంతో ఒక్కొక్క గుంపు ఒక్కొక్కచోట స్థిరపడ్డారు. అంటే నాటుకుని స్థిరంగా ఎక్కడికీ వెళ్ళకుండా ఒక్క చోటే నిలిచి ఉన్నారు.

పుస్తకం పేరు, రచయిత పేరు తప్పా తెలిసిన సమాచారం ఏమీ చేతిలో లేదు. నా ఆదివారాలూ నా ఖాళీసమయాలూ నాకు కాకుండా పోయాయి. ఇక వెతుకులాట మొదలయింది. ఆయన బెజవాడలో డాక్టర్‌గా యే ప్రాంతంలో నివసించేవారు? యెలా వుండేవారు? వారి ఫోటో యేమైనా దొరుకుతుందా? వారి పిల్లలెవరన్నా కనిపిస్తారా?

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: