రచయిత వివరాలు

మూలా సుబ్రహ్మణ్యం

పూర్తిపేరు: మూలా సుబ్రహ్మణ్యం
ఇతరపేర్లు:
సొంత ఊరు: విశాఖపట్నం
ప్రస్తుత నివాసం: పాలక్కాడ్, కేరళ.
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఇస్మాయిల్, బుచ్చిబాబు, త్రిపుర
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://etiodduna.blogspot.com/
రచయిత గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.

 

వేసవికాలపు సాయంత్రం
విరగకాసిన మావిడి తోటలో
వేలకొద్దీ కాయల్ని చూస్తూ
విరాగివై కూర్చుంటే

‘సహస్ర శీర్షాపురుషః’ అర్ధం కోసం
వేరెక్కడో వెతకక్కరలేదు నువ్వు!

ఏదో ఒక రోజు గేటు పడుతుంది
వాహనాలన్నీ బుద్దిగా
ఒక వరసలో నిలబడిపోతాయి
కారు వేగంలో అప్పటిదాకా వినబడని
రేడియోలో పాటని వింటూ
బద్దకంగా మెటికలు విరుచుకుంటూ
కిటికీలోంచి బయటకి చూస్తావు

తెల్లారి లేస్తే
ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి
నీ ముంగిట్లో గుమ్మరించేస్తారు

కొద్దిపాటి మంచిని
చెత్తకుప్ప నుంచి
వేరు చేసుకోవడం
చెప్పనలవికానంత కష్టం

ఈపాటికే అతనొచ్చేసి
ఆ నది ఒడ్డున తోచిందేదో
రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు
లేదూ
చదివేందుకూ రాసేందుకూ ఏముందని
కలాన్నీ కాలాన్నీ ఆ నదిలోకే విసిరేశాడో

అతను టార్చి వేశాడు. ఆ సన్నని కాంతిపుంజం ఆ దట్టమైన చీకట్లో ఒక వెలుగు సొరంగం తవ్వుతున్నట్టుగా వ్యాపించింది. గడ్డి మధ్యలో చిన్న కాలిబాట. చుట్టూ కీచురాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. చీకటి, నిశ్శబ్దం ఇంత దట్టంగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ చీకట్లో ఒక మనిషి దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే అతణ్ణి అనుసరించడం కొత్తగా ఉంది. మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది.

కేవలం నీ చూపు సోకే నేనో నదినై ప్రవహించాను దిగంతాల్లో వెలిగే నక్షత్రాల్ని నా లోతుల్లోకి ఆహ్వానించాను జలపాతాన్నై అగాధాల లోతుల్ని అన్వేషించాను నా […]

కవిత్వాన్నీ,ఉల్లిపాయనీ ఎవరు పోల్చారో గానీ ఎంత నిజమో కదా అనిపిస్తుంది. పొరలు పొరలు గా ఒలిచేస్తే రెండిటిలోనూ చివరికి మిగిలేదు ఒక మహా శూన్యం […]

తను సృష్టించుకున్న ఎండల్లో తానే తిరిగి తిరిగి ఎర్రగా కందిపోయిన సూర్యుడు నాటకంలో తన పాత్రకోసం తెరవెనక ఎదురుచూసే నటుడిలా చంద్రుడు ఉదయం తొడిగిన […]

India Vs Australia cricket match చూస్తున్నాను.ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ గెలవడం నేను ఉదయాన్నే నిద్ర లేవడం లాంటిదే! ఎప్పుడో గాని జరగదు. ఇరవైరెండేళ్ళ […]

నువ్వొచ్చే దాకా ఆకాశంలో విహరించేవాడిని నువ్వొచ్చి భూమ్మీదకు తీసుకొచ్చావు ఆకాశం లో మేఘం లా విహరించే నేను చల్లని నీ చూపు తాకి వర్షమై […]

గోడ గడియారపు ముల్లుల్లా బ్యాటరీ అయిపోయేవరకు తిరుగుతూనే ఉంటాం మనం గడియారపు సెకెన్ల ముల్లులా నాకు కాస్త తొందరెక్కువ అన్నీ అనుభవించెయ్యాలని “ఎంజాయ్‌మెంట్‌ ” […]