రెండు కవితలు

1. తపస్సు

కిరణాలన్నీ
ఊపిరి బిగబట్టి
భూతద్దంలో
ఒంటి కన్నుతో…

సూది బెజ్జంలోకి
సూర్యుణ్ణి దింపినట్టు
కాగితం పొరని
కాల్చుకుంటూ

అటువైపుకి

2. పురుషసూక్తం

వేసవికాలపు సాయంత్రం
విరగకాసిన మావిడి తోటలో
వేలకొద్దీ కాయల్ని చూస్తూ
విరాగివై కూర్చుంటే

‘సహస్ర శీర్షాపురుషః’ అర్థం కోసం
వేరెక్కడో వెతకక్కరలేదు నువ్వు!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...