కేవలం నీ చూపు సోకే
నేనో నదినై ప్రవహించాను
దిగంతాల్లో వెలిగే నక్షత్రాల్ని
నా లోతుల్లోకి ఆహ్వానించాను
జలపాతాన్నై
అగాధాల లోతుల్ని
అన్వేషించాను
నా అస్తిత్వాన్ని రూపు మాపేందుకు
అల్లంత దూరంలో
అంతులేని సముద్రానివై
మళ్ళీ నువ్వే!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ... పూర్తిగా »