దివ్వెలు

1.

వర్షంలో
పూర్తిగా తడిసింది
ఆకులన్నీ రాల్చుకున్న చెట్టు.

2.

కొబ్బరి చెట్టుకి
తెల్లటి పూలు
కొంగలు.

3.

కలిసిపోయాయి
మీద కొమ్మలూ కింద నీడలూ
ఏ నీడ ఏ చెట్టుదో!

4.

తన పాదాలకి
తనే పూజ చేసుకుంటూ
పూలచెట్టు!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...