రచయిత వివరాలు

పూర్తిపేరు: జయమోహన్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: https://www.jeyamohan.in
రచయిత గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

 

మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది.

తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు. అణంజి వంగి తాణప్పన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను. “ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి.

చెమటలు కక్కుకుంటూ బయటకు పరిగెత్తాను. కాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మెలమెల్లగా నాలో తార్కిక చింతన తిరిగి మొదలై అంతా నా భ్రాంతేనని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. గది లోపలికి వెళ్ళడానికి భయమేసింది. వరండాలోనే పడుకున్నాను. మా వీధి చాలా వెడల్పుగా ఉంటుంది. చక్కగా గాలి వీస్తుంది. అలసిపోయి ఉండటంతో నిద్రపోయాను. ఎదురింటి కుక్క వరండా కింద పడుకుని ఉంది.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు.

బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలై, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి.

నాకు చిన్నతనం నుండి పరిచయం, అలవాటు, చనువూ ఉన్న ఏరు ఇది. నా చిన్ననాటి స్నేహితురాలు. వర్షాకాలంలో ఆమె తెంపరితనం. రాత్రివేళల్లో ఆమె మౌనం. మంచుకాలపు వేకువ జాముల్లో ఆమె సిగ్గు. ఎంత దగ్గరది ఈ ఏరు నాకు! వంపు తిరిగి ఆదీ అంతమూ లేకుండా అనంతమైన ఒక డొంకదారిలా ప్రవహిస్తూ సాగే ఆమెలో నాకు తెలియని వేలాది రహస్యాలు ఉన్నట్టు అనిపిస్తోంది.

ఆయన ఆర్ధికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమానభారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్‌కు కలిగించింది.

అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.

పర్వత శిఖరాలు… కాలంతో వాటికి పనేముంది? కాలాతీతమైన స్థితి వాటిది. సిక్కులు ప్రార్థించేటప్పుడు, ‘సత్ శ్రీ అకాల్’ అంటారు. అ-కాలం. కాలంతో పని లేనిది. ఎంత గొప్ప మాట. కాలాతీత అవస్థలో ఎవరి కాలానికైనా అంతం ఎలా వస్తుంది? కాలా! ఓ మృత్యుదేవతా! నా దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యొద్దు! నిన్నెత్తి విసిరేస్తాను! ఎందుకని… కొంచెం కూడా బాధ అనేదే లేదు? బాధ అనేదే జీవితం. అది జీవితం మీద ఎప్పుడూ కదలాడే, మృత్యువు నీడ.

కోతి ముందుకు వచ్చి ఆ బైక్ పక్కన చేరి అతను బిగిస్తున్న నట్టుని తడిమి చూసింది. వంగి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి కొరికింది. అతను దాన్నే చూస్తున్నాడు. ఇందాక పైకి లేస్తూ చేతిలో ఉన్న స్పానర్ కింద పడేశాడు. ఆ కోతి వంగి స్పానర్ చేతికి తీసుకుని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని చూసింది. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది, నోట్లో పెట్టుకుని తర్వాత దాన్ని బోల్ట్ మీద పెట్టి అతనిలాగే బిగిస్తున్నట్టు అభినయం చేసింది.

నిర్వహణలో పాలుపంచుకోవడం ప్రారంభించాక అధికారి మొదటిసారిగా అధికారపు రుచిని తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆ అధికారం ఎలా వస్తుంది అన్నదీ కనుక్కుంటాడు. ఇంకా ఇంకా అధికారానికి వాడి మనసు ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసం తనను తాను మార్చుకుంటూ పోతాడు. కొన్నేళ్ళలో వాడు అధికార వ్యవస్థలో ఉండి మిగిలినవాళ్ళలాగా మూసలోకి సరిపడేలా మారిపోతాడు. వాడు ఎంతో కాలంగా కలలుగని తెచ్చుకున్న లక్ష్యాలన్నీ ఎక్కడో తప్పిపోతాయి.

నేను అనుభవించాను. అన్ని వేళలా, నన్ను బయటే నిల్చోబెట్టారు. పాలక నిర్వాహణ శిక్షణ అన్నది ‘నేను ఆజ్ఞాపించడానికి పుట్టాను’ అని నమ్మించడానికి చేసే నేలబారు వశీకరణ విద్య తప్ప మరోటి కాదు. అయితే నాకు మాత్రం అలా చెప్పలేదు. నాకేసి వచ్చిన మాటలు అన్నీ ‘నువ్వు వేరే’ అన్న అర్థాన్నే మోసుకొచ్చి నాకు చెప్పాయి: ‘మా దయ వల్ల, మా కరుణ వల్ల, మాకున్న సమతాధర్మంవల్ల మాత్రమే నీకు ఇక్కడ కూర్చునే అవకాశం కలిగింది. కాబట్టి ఆ కృతజ్ఞతతో మాకు విశ్వాసబద్ధుడిగా ఉండు.’

ఒక తురకోడు పెద్ద కులస్తుడైన పిళ్ళైపై ఎలా చెయ్యి చేసుకుంటాడు? అని ఒక ముఠా సరంజామా వేసుకుని వస్తే, శాలమహాదేవాలయం ట్రస్టీ అనంతన్ నాయర్ వాళ్ళను ఆపి ‘పోయి మీ పనులు మీరు చూస్కోండ్రా! వావీ వరుసల్లేకుండా అడ్డగోలుగా ఒ‌ళ్ళు కైపెక్కి జంతువులా ప్రవర్తిస్తే తురకోడి చేతుల్లోనైనా చస్తాడు, చీమ కుట్టయినా చస్తాడు’ అన్నాడట. అనంతన్ నాయర్ మాటకు శాలబజార్‍లో ఎవరూ ఎదురు చెప్పరు.

వాటితోబాటే మోసాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు కూడా. నోట్లో తాంబూలం వేసుకుని పెదిమలు పక్కకు తిప్పి, చాడీ చెప్పారంటే ఆ శివుడైనా పార్వతిని పక్కకు పెట్టేయగలడంటే చూసుకో! వాళ్ళెవరూ కవులూ కారు, వాళ్ళ మాటల్లో ధర్మం అనే అఱం లేదు కాబట్టి సరిపోయింది. అధర్మపాలనో, ప్రజలకు సంక్షోభం కలిగించే పనులకో తలపడిన రాజులమీద కవులు తిరగబడి ‘అఱం పాడటం’ అనే ధర్మాన్ని తమ పద్యాల్లో వస్తువుగా పెట్టి పాడితే, ఆ రాజు వంశమే నిర్మూలం అయిపోయేది!

కూవం నదిలా నల్లగా నురగలు కక్కతూ ప్రవహిస్తోంది. నెల రోజల క్రితం చచ్చిపోయిన ఒక గొడ్డు కాలువలో కొట్టుకుని వచ్చింది. దానికి కొక్కెం వేసి లాగి ఒడ్డున వేశాడు డిల్లిబాబు. గద్దలను తెచ్చి ఆ చచ్చిన గొడ్డు మీదకు వదిలాడు. హుషారుగా శవానికి ప్రదక్షిణలు చేశాయి కానీ చీల్చడానికో, పొడిచి లాక్కుని తినడానికో వాటికి చేతకాలేదు. ఎప్పుడూ చిన్న చిన్న ముక్కలుగా చేయబడిన గొడ్డు మాంసానికే అలవాటు పడ్డాయి. వాటికి ఆహారం అంటే అదే. ఎలుకలను కూడా తిని ఎరగవు.

ఆ రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనలాంటి చక్కని మాటకారిని నేను చూడలేదు. కాలక్షేపం, తత్వం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం అని ఒక అంశంనుండి మరో అంశానికి జంప్ చేస్తూ! జేమ్స్ బాండ్‌లాగా కార్ నుండి హెలికాప్టర్‌కి ఎగిరి, ఆక్కణ్ణుండి బోట్‌లోకి దూకి, ఒడ్డుచేరుకుని, అక్కణ్ణుంచి బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోతున్నట్టు. ఆ రోజునుండి వారానికి మూడు రోజులైనా ఆయన్ని కలవడానికి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలు ఇచ్చేవారు.

‘అవును. నేను మాట్లాడి తీరాలిప్పుడు!’ అంటూ రంగప్ప చప్పట్లు కొట్టాడు. ‘అందరూ వినండి. నేను పందెపు రొక్కాన్ని నమశ్శివాయంకు ఇవ్వడానికి వచ్చాను!’ నాకు ఆ మాటలు అర్థం కాలేదు. విన్నవాళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ‘నేను ఓడిపోయాను. కాబట్టి ఇదిగో, ఐదు లక్షలకుగాను చెక్కును నమశ్శివాయంకు ఇస్తున్నాను.’ తన జేబులోనుండి ఒక బ్రౌన్ కవర్ తీసి టేబిల్ మీద పెట్టాడు.