ఆమెకు ఈ తంతు అంతా అయోమయంగా అనిపించేది. ఉజిరెలో హాస్టల్లో అమ్మాయిలు పెళ్ళి గురించి, భర్త గురించి గుసగుసలాడుతూ కిసుక్కున నవ్వుకుంటున్నవారు ఆమెను చూడగానే మాటలాపి మౌనం వహించేవారు. ఎందుకంటే ఆమెకి భర్త గురించి, పెళ్ళి గురించి, తర్వాతి సంగతుల గురించి మాటలు వింటే యాక్ అనిపించేది. అందుకే ఆమె వచ్చాక హాస్టలు అమ్మాయిల ఆటపట్టింపులు ఆగిపోయేవి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: పూర్ణిమ తమ్మిరెడ్డిఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: హైదారాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://pustakam.net
రచయిత గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.
పూర్ణిమ తమ్మిరెడ్డి రచనలు
ఢిల్లీ నగరం గురించి విశేషంగా రాసి, తిరుగులేని వ్యంగ్య రచయితగా పేరు తెచ్చుకున్నా ఫిక్‍ర్ తౌన్‍స్వీకి సాహిత్య అవార్డులు ఏవీ రాలేదు. ఇప్పటికీ తక్కిన హిందుస్తానీ రచయితలంత విరివిగా ఆయన పేరు వినిపించదు. కానీ ఒక్కసారి అలవాటైతే మాత్రం మర్చిపోలేని చమత్కార వచనం ఆయనది. తప్పక చదవాల్సిన రచయిత. ప్రతినిత్యం వాడుకలో ఉన్న పదాలకి తనదైన శైలిలో అర్థాలు, నిర్వచనాలు ఇచ్చారు లుఘాత్-ఎ-ఫిక్రీ అనే రచనలో.
నేను అన్నాను: నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. లే, అంటరానితనాన్ని నిర్మూలించు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమని కలిగించు. హిందువులు తమలో తాము మతం గురించి కొట్టుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వగైరా కులాలన్నింటిని ఒకటి చేయండి. హిందూ ముస్లిములని కలపండి. లోకంలో శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసేస్తే, ఆ పైన అందరం కలిసి ఆరాముగా జీవితాన్ని గడుపుదాం.
‘ఘర్షణలు ఆ ప్రాంతం పొలిమేరలు దాటలేదు’ అంటే మనుషులు నరుక్కోవడం, ఆస్తులు తగలెట్టడం లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకలేదు, అని. మరది యంత్రాంగం పనిజేయడం వల్లా లేకపోతే తంత్రాంగం ఊరుకోవడం వల్లా అన్నది తెలీదు; ఎవరికీ, ఎప్పటికీ!
“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”
నాకు మాత్రం ఆ నదిలో కొట్టుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. నాని ఉబ్బిపోయిన శవాలు. కుక్కలు పీక్కొని తిన్న శవాలు. ఆనవాలు పట్టలేని శవాలు. గంగా! పాప వినాశినీ! మా ధర్మచరితకు పవిత్రసాక్షివి! శివుని జటాజూటంలో కొలువైన ఉగ్రతేజానివి! ఎందుకు రహస్యాలు నీలోనే దాచుకోవడానికి నిరాకరించావు?
మాతృత్వంలోని మాధుర్యం, తల్లిప్రేమ గొప్పతనం, అమ్మ అనిపించుకోవడం స్త్రీమూర్తికి గౌరవం అంటూ గొంతెత్తి అరుస్తున్న సమాజం నిజంగా తల్లుల పట్ల ఎలా ప్రవర్తిస్తోంది? ఒక స్త్రీ తల్లిగా మాత్రమే మిగిలిపోక ఒక మనిషిగా కూడా తన జీవితాన్ని మలచుకోవాలనుకుంటే? అసలు పిల్లలే వద్దనుకుంటే? అందరు మగవారు తండ్రి పాత్రలకు ఎలా సరిపోరో, ఆడవారు కూడానూ అందరూ తల్లి పాత్రలకు సరిపోరు అన్న వివేచన అసలు వస్తుందా?
ఐఐటీ-జీలు, ఎమ్‌సెట్‌లు అని బండకేసి బాదించుకోవడం తప్ప ఇంకోటి తెలియనివాళ్ళు, ఆ మాత్రం కాంపిటీటివ్ స్పిరిట్ లేకుండా, చూపించకుండా ఉండలేరు. కానీ అతడి మీదున్నది ప్రేమో-దోమో-ఇంకేదో అనేది ఇంకా తేలకముందే, ‘నీ సుఖమే నే కోరుకున్నా… నిను వీడి అందుకే వెడుతున్నా’ లాంటి సినిమాస్థాయి త్యాగాల ట్యూన్లు మనసులో ఎందుకు మొదలవుతాయో ఆమెకి అర్థమై చావదు.
స్టే-ఎట్-హోమ్ డాడ్‍గా ఉండే ఉద్దేశ్యం లేదని సందీప్ స్పష్టం చేశాడు అందరికీ. పాలసీ ప్రకారం వచ్చే ఆర్నెళ్ళ లీవ్ కాకుండా ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నొచ్చుకున్నాడు. అనిత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు, ఆమెకి ఆమె ఉద్యోగం అంత ముఖ్యం! ఇద్దరూ మొండిపట్టు పట్టి బాబుని పూర్తిగా ఏ ఆయాకో వదిలేయడం ఇష్టం లేక, మనసు చంపుకుని ఉద్యోగం మానుకున్నాడు.
మొదటి దొమ్మీ ఆ సందు మొదట్లో ఉన్న హోటలు దగ్గర జరిగింది. వెంటనే అక్కడ ఒక సిపాయిని కాపలాకని పెట్టారు. రెండో దొమ్మీ రెండో రోజు సాయంకాలం పచారీ దుకాణం దగ్గర జరిగింది. సిపాయిని మొదటి సంఘటనా స్థలం నుండి తప్పించి, రెండో ఘటనా స్థలం వద్ద కాపలా ఉంచారు. మూడో కేసు రాత్రి పన్నెండింటికి లాండ్రీ దగ్గర జరిగింది.
ఇద్దరు దోస్తులు కలిసి పది-ఇరవై మంది ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని ఎంచుకొని, నలభైరెండు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. రాత్రి గడిపాక ఒక దోస్తు ఆ అమ్మాయిని అడిగాడు: “నీ పేరేంటి?” అమ్మాయి తన పేరు చెప్పేసరికి వాడు అదిరిపడ్డాడు: “అదేంటి, మాకేమో నీది వేరే మతమని చెప్పారు?” అమ్మాయి బదులిచ్చింది: “అబద్ధమాడారు వాళ్ళు.”
ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులుంటాయి.
నువ్వు కొంచెం ఆలోచించి ఉంటే నీకు తెలిసేది నువ్వు ముమ్తాజ్‌ని, ఒక ముస్లిమ్‌ని, ఒక స్నేహితుణ్ణి కాదు చంపివేసింది, నువ్వు చంపివేసింది ఒక మనిషిని, అని. వాడొక దగుల్బాజీ అయినా సరే. నువ్వు చంపింది నీకు నచ్చని వాడి దగుల్బాజీతనాన్ని కాదు, వాడినే. వాడు ఒక ముసల్మాన్ అయితే నువ్వు వాడిలోని ముసల్మానీని చెరిపివేయలేదు. వాడి జీవితాన్నే చెరిపివేశావు.
ఒకసారి… కాస్త కనికరం ఉన్న రజాకారు ఒకడు సహరన్‌పూర్‌లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తానులో ఉన్న అమ్మానాన్నల దగ్గరకి వెళ్ళడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే ఒదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్ళినప్పుడు, అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూరప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని, ఒక రజాకారు చెప్పాడు.
మరుసటి రోజు, వాళ్ళమ్మాయి రాత్రికి రాత్రి మాయమైపోయిందని తెలుసుకున్నాక, వాడి అత్తవారింట్లో పెద్ద గొడవ మొదలైంది. ఒక వారం వరకూ ఆమె కోసం అక్కడా ఇక్కడా వెతికారు. ఎవరికీ ఈ సంగతి గురించి తెలియనివ్వలేదు. కానీ తర్వాత, అమ్మాయి వాళ్ళ అన్నయ్య నా దగ్గరకి వచ్చాడు. అతడికి తోడుదొంగనైనట్టు మొత్తం కథ చెప్పుకు రావాల్సి వచ్చింది.
మనుషులు మనుషులని చంపారు. ఆడవాళ్ళని చెరిచారు. భవనాల్లోని ఎండిన కట్టెలు, నోరులేని ఇటుకలను కూడా అదే చేశారు. ఆ తుఫానులో ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టారని, వారి రొమ్ములను కోశారని విన్నాడు. అతడు చుట్టుపక్కల చూస్తున్నవన్నీ నగ్నంగా, ప్రాణం లేకుండా తెగి పడున్నాయి.
అంబాలా ఛావనీలో ఆమె దందా బాగా నడుస్తుండేది. ఛావనీలో తెల్లవాళ్ళు ఆమె దగ్గరకు తాగి వచ్చేవారు. ఒక మూడు నాలుగు గంటల్లో ఆమె షుమారు పదిమందిదాకా తెల్లవాళ్ళను తృప్తి పరచి ఇరవై ముప్ఫై రూపాయలదాకా పుట్టించేది. ఈ తెల్లవాళ్ళు దేశీలకన్నా మంచివాళ్ళు. వాళ్ళేం అంటున్నారో సుల్తానాకు అర్థం అయేది కాదు నిజమే కాని వాళ్ళ భాష అర్థం కాకపోవటం అనేది ఆమెకి బాగా ఉపయోగపడింది.
అదబే-లతీఫ్ మాస పత్రికలో, నా కథ ఒకటి కాలీ సల్వార్ పేరిట 1942లో అచ్చయ్యింది. దీనిని అందరూ అశ్లీలమని అన్నారు. ఇది పచ్చి అబద్ధం. కథలు రాయడం నా వృత్తి. నాకు సాహిత్యపు అన్ని లక్షణాలతోనూ పరిచయముంది. నేను ఇంతకు మునుపు ఇలాంటి అంశాల మీదే అనేక కథలు రాసున్నాను. వీటిలో ఏ కథ కూడా అశ్లీలం కాదు. నేను ఇకపై కూడా ఇలాంటి అంశాల గురించి రాస్తాను. అవేవీ కూడా అశ్లీలమవ్వవు.
ప్లేన్ ఎక్కాను. ఇండియా నుండి ఇరవై వరకూ మిసెడ్ కాల్స్. అమ్మకేమవ్వచ్చు? హార్ట్ అటాక్? కిడ్నీ ఫెయిల్యూర్? అమ్మకేమీ కాదు. జెనీవాలో ఆ పార్క్ లో బొమ్మను చూడగానే అమ్మే అని అనిపించింది. తల కిందకు వంచి, భుజాలు వంగిపోతూ, చేతులు మోకాళ్ళపై పెట్టుకొని కూర్చున్న బొమ్మ. ఆడో మగో తెలిసే వీలు లేని బొమ్మ. ఛాతీ లేదు. పక్క ఎముకలు లేవు. పొట్ట లేదు. బొడ్డు లేదు. మెడ నుండి తుంటి వరకూ పెద్ద సున్నా. అంతా ఖాళీ.
టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ళ కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం.
తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది. కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.
డాక్టర్‌తో నీ సంభాషణ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తావు. ప్రిస్క్రిప్షన్ కోసం హేండ్‌బేగ్ అంతా తిరగతోడుతావు. చివరకు దొరుకుతుంది. అందులో పైన నీ పేరు, వయసు రాసుంటుంది. ఒక పక్కగా నీ ఎత్తు, బరువు, బిపి వగైరా వివరాలు. పేజీ మధ్యలో నువ్వు చెప్పిన లక్షణాలు అన్నీ వుంటాయి. డాక్టర్‌కు కాఫెటేరియాలో నువ్వు విన్నవి కూడా చెప్పావు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా విన్నది గుర్తొస్తుంది నీకు.
సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…
అతని ముఖంలో ఏ మార్పూ కనిపించటం లేదు కానీ అతడి ఒంటిమీద వెంట్రుకలన్నీ గొంగళి దారాలుగా మారిపోయుండడం చూసి హడలిపోయింది. భయంతో వణికిపోయింది. పట్టుకొని లాగటానికి చూసింది. బలంగా పీకితేగానీ ఊడి వచ్చేలా కనిపించలేదు. అందుకని వెళ్ళి తన వాక్సింగ్ స్ట్రిప్ తెచ్చి, అతడి చేతికి అతికించి, కాసేపుంచి ఫట్‍మని లాగింది. అది ఊడి రాలేదు గానీ, అతడు లేచి కూర్చున్నాడు .
ఆమె అతడిని చూసింది. అదే క్షణాన అతడూ చూశాడు. చూసి, చూపు తిప్పుకున్నాడు. ఐస్ వల్ల గ్లాస్‌కి చెమటలు పడుతున్నాయి. ఆమె అతడిని గమనిస్తూనే ఉంది. ఒక్కో గుక్క తాగి, గ్లాస్ కిందపెట్టి, ఆమెను చూడబోయి, ఆమె గమనిస్తుందని గమనించి, రెప్పలనీడలో కళ్ళను అటూ ఇటూ పరిగెత్తిస్తూనే ఉన్నాడు.
ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ ఉంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ, బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.
యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తుంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?