పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు.
సి. మృణాళిని
- పూర్తిపేరు
- సి. మృణాళిని
- ప్రస్తుత నివాసం
- హైదరాబాదు
జీవిత విశేషాలు
రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.