చెట్టు కొమ్మలు పలచబడడంతో అడ్డులేని గాలి ఆమెని ఈడ్చి కొడుతూ వుంది. ఎంత అవస్థ పడ్డా అవతలి వైపు చెట్టు కొమ్మలందట్లేదు. నిరాశతో దుఃఖం వొచ్చిందామెకి. మళ్ళీ శక్తి కూడదీసుకొని చెట్టు కొమ్మలందుకునేంతలో గాలి వాటిని విడిపించింది. ఆమె పట్టులోంచి జారిపోయిన చెట్టు కొమ్మలు ఆమె మొహాన్ని గాలి విసురుకు కొరడాలలా కొట్టాయి. గాలి, చెట్టు కొమ్మలూ కలిసి ఆమె గొంతుకు ఉరి బిగించాయి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: శారదఇతరపేర్లు:
సొంత ఊరు: హైదరాబాద్
ప్రస్తుత నివాసం: బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://sbmurali2007.wordpress.com/
రచయిత గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు.
శారద రచనలు
నా వైపు చూసిందా అమ్మాయి. ఊపిరి బిగబట్టి తనవైపే చూశాను. అమ్మాయి సన్నగా ఒక నవ్వు నవ్వి, మెల్లగా చేతులు సాచి నెమ్మదిగా నేలని తన్ని పైకి లేచింది గాలిపటంలాగా. అలాగే నవ్వుతూ నా వంక చూస్తూ గోడల పక్కగా హాయిగా పైకి ఎగురుతూ… తేలిగ్గా ఒక దేవతలాగా తేలుతూ అలాగే మెల్లగా గది పై కప్పుదాకా ఎగిరింది. పై కప్పు దగ్గ్గరకు రాగానే, చేయి ఎత్తి కప్పును నెట్టి ఆ ఊతంతో మళ్ళీ మెల్లగా కిందకు రాబోయింది. కానీ మళ్ళీ తేలసాగింది.
వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవి కాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడని, అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది.
ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.
“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”
కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.
ఈ పులి వేటకన్నీ కలిసొచ్చాయి. ముందస్తుగా మిసెస్ పేకిల్‌టైడ్ తనకి పులిని చూపెట్టిన వారికి వెయ్యి రూపాయిల బహుమతి ప్రకటించింది. అదృష్టవశాత్తూ పక్కనే వున్న ఒక వూళ్ళో పెద్ద పులి తిరుగుతోందనీ, చాలా మేలు జాతి పులి అనీ, కొడితే అలాటి పులినే కొట్టాలనీ వదంతులు వినొచ్చాయి.
ఆ కిటికీ గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.
నేను పొరబడ్డానేమో అనుకున్నాను. ఇంటికొచ్చి అదేదో ఆఫీసు పార్టీలో మా పిల్లలతో కలిసి మృణాలిని తీయించుకున్న ఫోటో వెతికి తీసాను. సందేహం లేదు, అతనే!
మా పడవ మునిగి పోతుంది. మాక్కావల్సిందీ అదే!
“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో. వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్ళి చేసి బాధ్యత తీరిందన్న […]
ఏ మనిషైనా తనని ఏదో ఒక వర్గానికి చెందిన మనిషినని అనుకుంటాడు భాషా పరంగా నైన, ప్రాంతీయ పరంగా నైనా, సాంఘిక, ఆర్థిక స్థాయి పరంగా నైనా. తన వర్గానికి చెందిన మనిషి కష్టనష్టాలకు స్పందిస్తాడు. ఆ వర్గానికి చెందని మిగితా మనుష్యుల గొడవ పెద్దగా పట్టదు. వాళ్ళవి చెప్పుకోదగ్గ కష్టాలనిపించవు.
“నాకు విడాకులిస్తే, నా దారి నేను చూసుకుంటాను.” పేపర్ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు. ఎప్పట్లాగే అతనికి సరోజ మొహం చూడగానే జాలి, వాత్సల్యం కలిగాయి. […]