ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.
రచయిత వివరాలు
పూర్తిపేరు: లియో టాల్స్టాయ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
లియో టాల్‌స్టాయ్ రచనలు
మర్నాడూ ఆ పైరోజూ కూడా స్తిపనీదా ఆలోచనలు ఎవ్‌గెనీని వదల్లేదు. ఏవో పనులున్నా అవన్నీ చేస్తున్నా మనసునిండా ఈవిడే. పెళ్ళితో తన పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయాయనే అతననుకున్నాడు. స్తిపనీదా పొందు అతనిప్పుడు కోరుకోటల్లేదు కానీ ఆమె పైని వ్యామోహం ఇంకా ఉన్నందుకు అతను మథనపడ్డాడు. తరవాత గుర్రాల దగ్గరకి నడుస్తుండగా తనను దాటి పరుగెత్తుకుంటూ పోయిన అదే ఎర్ర గౌనూ తలకు చుట్టిన ఎర్ర రుమాలూ అదే ఆరోగ్యవంతమైన శరీరం అతనికి ఆ పొలాన్నీ ఆ గడ్డివామినీ ఆ మధ్యాహ్నాలనూ గుర్తుకు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టాయి.
సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్‌హాడన్‌ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది. దీనికి లైలీ ఒప్పుకోలేదు. “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్‌హాడన్‌తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”
ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.
అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్ళముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?
“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.
మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో.
ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్‌ని తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేక దాన్ని మూడు ముక్కలుగా కాల్పించేడు నిప్పుల మీద. అవి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని, “ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”
“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.
అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.
“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”
ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరివిధాలా పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్ళగలడం అసంభవం.
సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది.
పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్‌తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్ కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్‌ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్‌కి గుర్తు లేదు.