రచయిత వివరాలు

గరిమెళ్ళ నారాయణ

పూర్తిపేరు: గరిమెళ్ళ నారాయణ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.

 

విమానాన్ని చూసిన ప్రతిసారీ
వినమ్రంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది

ఎగిరే రేకుల డబ్బాలా కాక
చేపా హంసలు ఒక్కటై దర్శనమిచ్చే
దేవతా సోయగంలా అనిపిస్తుంది

సంజీవ పర్వాతాన్ని అమాంతంగా
మోసుకు పోతున్న హనుమంతుడి
కార్యోన్ముఖుత ని గుర్తుకు తెస్తుంది

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

దేవున్ని నమ్మిన వాళ్ళకు
నమ్మని వాళ్ళకు కూడా
ఏదో దైవ సాక్షాత్కారం జరిగినట్టు ఉంటుంది.