మొలక

తన కళ్ళల్లోకి చూస్తూ
సర్వస్వాన్నీ మరచిపోమంటుందో
లేక తనే నా సర్వస్వమంటుందో
అర్ధం కాదు

ఒక్క సారిగా
సమయం ముందుకు
నేను వెనకకు
వెళ్ళి పోతూ ఉంటాం

అప్పటివరకూ
అలుపెరగనీయకుండా వేధించిన
ఆలోచనలన్నీ
ఆవిరైపోతాయి.

తనను రక్షిస్తోందనుకునే నా
పెద్దతనమంతా పోయి
కువకువల కిలకిలల
గోరువెచ్చని
పాల మీగడల
మృదుత్వ నిర్మలత్వంలోకి
ఇమిడిపోతుంది

పసిపాపతో కలిసి
మరో పాపవైపోగలిగిన
ప్రతిసారి
కొత్తగా చిగురిస్తున్నట్టే…
అమ్మంతటి అపారమైన
ప్రేమని రచిస్తున్నట్టే…

బాల వైద్యాన్ని
గుర్తించిన
ప్రతిసారి
మరొక కొత్త వైద్యుడికి
ప్రాణం పోస్తున్నట్టే.


రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...