రచయిత వివరాలు

కొడవళ్ళ హనుమంతరావు

పూర్తిపేరు: కొడవళ్ళ హనుమంతరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఈకాలపు సాహిత్యంతో పరిచయం తక్కువ. ఇప్పటికీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివిన రచయితలంటేనే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో కొందరు - శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, ఉప్పల, రావిశాస్త్రి, బీనాదేవి, బుచ్చిబాబు, చండీదాస్.
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.

 

ప్రతి అడుగుకీ చెయ్యవలసిన పని కేవలం ఓ గుర్తుని చదవడం, అవసరమైతే దాని స్థానంలో వేరే గుర్తుని రాసి, స్థితి మారి అటో ఇటో కదలడం. అంతే. ఈ మాత్రం చెయ్యడానికి మనిషి ఎందుకు, ఓ యంత్రాన్ని పెడితే సరిపోతుంది గదా. అదీ ట్యూరింగ్ ఆలోచన. మనిషి మనఃస్థితులని ఈ యంత్రం యాంత్రికస్థితులుగా అనుసరించాలి. ఇది కారు లాంటి యంత్రమా? గేర్లు ఉంటాయా? కరెంటు మీద నడుస్తుందా? ఇవేవీ ముఖ్యం కాదు. ఇది కేవలం గణిత భావానికి ఆకారం ఇవ్వడం. పోయి నిర్మించాలని లేదు. కాని ముఖ్యంగా గ్రహించాల్సింది – ఎలాంటి ఆల్గరిదమ్ అయినా సరే ఇలాంటి యంత్రంతో చేసెయ్యవచ్చు. మీకది నమశక్యం కాదంటే నేనర్థం చేసుకోగలను. మీకు నమ్మకం కలగాలంటే యంత్రాలతో కొన్ని లెక్కలు చేయించాలి.

“ఈ వాక్యం అబద్ధం” అన్నది నిజమైతే, తన గురించి తను చెప్పుకున్నది నిజమన్న మాట; మరి తన గురించి తను ఏం చెప్తున్నది? తను అబద్ధమని!

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

జీవితాంతమూ అనాదరణకి గురైన ఫ్రేగె ఆధునిక కంప్యూటర్ కి మూలమైన తార్కిక గణితానికి సంస్థాపకుడిగా, అరిస్టాటిల్ స్థాయి మేధావిగా, వైశ్లేషిక తత్వానికి (analytic philosophy) మూలపురుషుడిగా గుర్తిస్తారు.

జార్జ్ బూల్ బీజగణితాన్ని తర్కశాస్త్రానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికి పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు క్లాడ్ షానన్.

పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.

నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అపర అరిస్టాటిల్‌గా పేరు తెచ్చుకున్న లైబ్‌నిట్జ్ జీవితాన్నీ, బహుముఖ ప్రతిభనీ, కంప్యూటర్ సైన్సుకి మూలాధారమైన అతని విప్లవాత్మక ఆలోచనలనీ ఈ వ్యాసం ద్వారా రేఖామాత్రంగానయినా పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం

“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.

ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.

“సాహిత్యం వల్ల తాత్కాలిక ప్రయోజనం విశేషంగా ఉండటమే కాక అది త్వరగా అయిపోతే అంత మంచిది… నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.”

గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల