రచయిత వివరాలు

కె. వి. గిరిధరరావు

పూర్తిపేరు: కె. వి. గిరిధరరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!

నాలుగడుగులేశాడో లేదో, మళ్ళీ సైకిల్ బెల్ మ్రోత. ఈ సారి ఆగకుండా, అదే పనిగా! కిటికీ వైపుకు దూకి, కర్టెన్ తెరిచి సైకిల్ వంక చూశాడు. ఎవరో స్టాండ్ వేసిన సైకిల్ మీద కూర్చుని అదే పనిగా గంట మ్రోగిస్తున్నారు. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. మెరుపు కాంతిలో కనిపించిన దృశ్యానికి రవి నిలువెల్లా వణికి పోయాడు! ఉరుము శబ్దం సైకిల్ బెల్ మ్రోతను మింగేసింది. గభాలున కిటికీ తెరను మూసేసి, లైటార్పి, గజగజలాడిపోతూ నిండా దుప్పటి కప్పుకున్నాడు.

ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

వఱడు అంటే ముసిలి నక్కట. ఆ జంతువు ప్రతీకగా మానవ నైజాన్ని ఇంత సూటిగా చిత్రీకరించిన ఈ కథ మొదటి సారి చదివినప్పుడు నన్నెలా ప్రభావితం చేసిందో, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎప్పుడు చదివినా అలానే నన్ను పట్టి ఊపేస్తుంది.

‘రావణాసురుడి పది తలలకూ, ఒకే రకం మొహం వుంటుందా? లేక ఒక్కో తలకూ ఒక్కో రకం మొహం వుంటుందా?’ ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న! ఆరో తరగతిలో వున్నప్పుడు టీచర్‌ని అడిగాను. ఇదే ప్రశ్న ఇంట్లో అన్నయ్య నడిగితే అసలు రావణుడే లేడు పొమ్మన్నాడు. నాన్న నడగాలంటే భయం.

దాదాపు అర్థ శతాబ్దం క్రితం వ్రాసిన ఈ కథల్లో కనిపించే ప్రాంతాలు, పరిసరాలు నాకు పరిచయం లేనివి. కానీ పరిసరాలను, పాత్రలను కళ్ళ ముందు నిలిపేందుకు వాడిన భాష, వాక్యాలు నిత్యనూతనం.

కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.

అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.

అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!

“ఒక్క పూట మందు లేకపోతే ప్రాణం పోదులే…రమేష్ గారు చూడండి…అస్సలు మందు ముట్టుకోరట. ఏ దురలవాటూ లేదట. వింధ్యకు అన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తాడట. చూసి నేర్చుకోండి” అంటూ బయల్దేరదీసింది.

సావిత్రికి నాకూ మధ్యనున్న స్నేహం ప్రేమగా మారడం నాకు ఒప్పుగా కనిపించింది, సావిత్రి ఇంట్లో వాళ్ళకు తప్పుగా తోచింది. నేనూ, గోపీ చనిపోయాక ఎవరిని నరకంలోకి తోస్తారు? ఎవరిని స్వర్గంలో కూర్చోబెడతారు?

ఇరవైయేళ్ళుగా అమెరికాలో కంప్యూటర్‌ రంగంలో వివిధ స్థాయిల్లో పని చేసి, కొన్నాళ్ళు స్వంతంగా ఒక వైర్‌లెస్‌ టెక్నాలజీ కంపెనీని నడిపి, ఏడాది క్రితమే స్వదేశానికి తిరిగొచ్చాడు శ్రీవాత్సవ. సౌకర్యవంతమైన అమెరికా జీవితాన్ని, డాలర్లలో జీతాన్ని వొదిలేసి ఇక్కడికెందుకొచ్చారని ఎవరైనా అడిగితే…జన్మభూమిపై మమకారంతో దేశసేవ చేయడానికి వొచ్చానని చెబుతాడు. దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రం అమెరికాలో కంప్యూటర్ల జోరు తగ్గి, ఇండియాలో అవకాశాలు పెరగడంతో…ఇంకాస్త సంపాదించుకోవడానికి తిరిగొచ్చాడు తప్పితే జన్మభూమీ, దేశసేవా ఇవన్నీ కాకమ్మ కబుర్లు అంటారు.

సాయంత్రం ఐదున్నరకు ఉక్కబోస్తుంటే ఆవలిస్తూ నిద్ర లేచాను. రూములో నేను తప్ప మిగిలిన వాళ్ళెవరూ కన్పించలా. మొహాన కాసిన్ని చన్నీళ్ళు చల్లుకుని, టవల్‌ కోసం […]

రూంలో వుండేది నలుగురం. నాకు బియ్యంలో కొలత ప్రకారం నీళ్ళు పోసి, అన్నం వండడం కూడా రాని రోజులవి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఎవరు […]

పొద్దుపొద్దున్నే నిద్ర కళ్ళతో గోడను పట్టుకుని, బెడ్రూములోంచి వంటగదిని దాటుకుని, ముందు గదిలోకి వచ్చి, తలుపు తీసి పేపరు కోసం చూడ్డమూ   వారం రోజుల్లో […]

అటు వైపు మా మేనేజర్‌ జెఫ్‌, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్‌ మధ్యలో నేను. ఇలాంటి చిక్కులో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు. జెఫ్‌ […]

1 తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలనే ప్రయత్నమే తానా కథల పోటీ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం[1]. […]

వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా […]

కారులు, విమానాలు, మెషీను గన్నులు … మధ్య లో కూర్చుని నవ్వుతూ ఆడుకుంటున్న ఒక రెండు మూడేళ్ళ పిల్లవాడు. వాడు ఆడుకునే ఆ కాస్త […]

ప్రతి రోజు లానే సూర్యుడు అందరూ అనుకునే విధంగానే తూరుపు దిక్కు లోంచి లేచి, అపార్మ్టెంటు అద్దాల్లోంచి,”ఈ ఇంట్లో వాళ్ళు లేచారా?” అనుకుంటూ తొంగి […]

మొహం పైకెత్తి ఆకాశంలోకి తేరిపార చూస్తూ వస్తున్న ఆంజనేయులును చూసి “నువ్వెంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నా మరీ అలా పైకి చూసి నడవక్కర్లా!” అన్నాడు […]

గరాజ్‌ లో పూజ జరుగుతోంది సంప్రదాయ బద్దంగా. అక్కడవున్న వాళ్ళు, లంకంత ఇల్లు ఎలా వుంటుందో అప్పటిదాకా చూడకపోయినా  ప్రసాద్‌  కొన్న కొత్త ఇల్లు […]

(అమెరికాలో కొత్తదంపతుల అనుభవాల్ని అనుభూతుల్ని అందంగా మధురసనిష్యందంగా మనముందుంచుతున్న కె. వి. గిరిధరరావు కథలు “ఈమాట” పాఠకులు ఈపాటికే కొన్ని చూశారు. ఆకోవలోదే ఈ […]

(వర్ధమాన కథకుడు, కవి గిరిధరరావు నేటితరం అమెరికా తెలుగు వాళ్ళ దృక్పథాల్ని, అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న రచయిత. ఈ కథలో సంఘటనలు ఎందరికో స్వానుభవాలు.) “అది […]

“నేను వెళ్ళిపోతున్నాను” అంది గీత, హాలు లో తన సూట్‌ కేసుల ప్రక్కనే నిలబడి. “ఎక్కడికి?!” అడిగేడు అప్పుడే ఆఫీసు నుండి ఇంటి కొచ్చిన […]

“ఈ టైంలో ఎవరబ్బా …” విసుగ్గానే ఫోనందుకున్నాను. “హలో ” సాధ్యమైనంత సౌమ్యంగానే. “ఓ మీరా… ఇంటి దగ్గర్నుంచేనా నేనిప్పుడే చేస్తాను పెట్టేయండి” అన్నాన్నేను. […]

(కె.వి. గిరిధరరావు గారు శాన్‌ డియేగో లో ఉంటారు. ఇండియాలో పత్రికలలో కవితలు, కథలు ప్రచురించారు. ) “ప్లీజ్‌ మరోసారి జాగ్రత్తగా వెదికించండి. ఆ […]