రచయిత వివరాలు

పూర్తిపేరు: కొల్లూరి సోమ శంకర్
ఇతరపేర్లు: శంకర్‌నాగ్
సొంత ఊరు: పేరూరు, తూర్పు గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొ.
హాబీలు: చదవడం, రాయడం, అనువాదాలు, సినిమా పాటలు, క్రికెట్, క్యారం బోర్డు ఆడడం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

 

ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు.

హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టు‍గా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.

అయితే ఇలాంటి టాలెంట్ కంపెనీని విడిచిపెట్టినందుకు అజీజ్ ఎంతో సంతోషించాడు. తను ఒక్కడే ఉన్నప్పుడు అర్ధరాత్రిళ్ళు జిన్ తాగుతూ ‘దండగ మనుషులు’ అని అనుకునేవాడు వాళ్ళ గురించి. అతనికి సంబంధించినంతవరకూ ఏజన్సీ బెస్ట్ కాపీరైటర్, ఆపరేషన్స్ మాన్, ఆర్ట్ డైరక్టర్ అన్నీ తనే! ఫిల్టర్ కనుక అతనికి ఇష్టమయి ఉంటే, బహుశా ఓ ఉత్తమమైన కాఫీ బోయ్ అయ్యుండేవాడు.

శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు వ్రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే వారి మొదటి సంపుటం లోని కథలకు ఒక సంక్షిప్త పరిచయం.

“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.

కాని ఆ రాత్రి ఫైరింగ్ ఆగనే లేదు. రాత్రంతా ఎదురుకాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. మధ్య మధ్యలో రెండు వైపుల నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఆ రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. చెవులు పగిలిపోతాయా అనిపించేంత చప్పుళ్ళు. మేము, కుల్జీత్ మామ కుటుంబం రాత్రంతా ఆ కందకంలోనే దాక్కుని ఉన్నాం.

జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగి లేదా కనీసం నెమ్మదిగా నడిపి పాదచారులను రోడ్డు దాటనివ్వాలనేది డ్రైవర్లు పాటించాల్సిన కనీస మర్యాద! కానీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. లెఖ్ఖ లేకుండా దూసుకు పోతున్నారు. వారికి అవసరం ఏముంది? అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులూ లేరు.

నాకు బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నాకెప్పుడు ఒంట్లో బాలేకపోయినా, అమ్మ ఇలాగే చేసేది. ఎన్నోసార్లు నా రోగాలు అమ్మ చేతి స్పర్శ తగలగానే మంత్రం వేసినట్లు మాయమయ్యేవి. అమ్మ అరచేతుల స్పర్శ స్నేహితంగా ఎంతో ఆనందంగా ఉండేది, గంగ, యమున నదుల నీళ్ళలా చల్లగా హాయిగా ఉండేది.

కాస్త ధైర్యం కలిగింది, అమ్మయ్య అంటూ నిట్టూర్చాడు. అప్పుడు తన చాక్లెట్ డ్రింక్ కప్పుని అందుకుని హాల్లోకి నడిచాడు. టి.వి ఆన్ చేయగానే, సినిమాలో మొదటి సీన్ – గాంధీ గారి హత్య సన్నివేశం వస్తోంది.

సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం వాచ్‌మాన్‌ చూసాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక క్షమించమని బ్రతిమాలాలా?

పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.

ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. …”