దాదాపు ముప్పైయేళ్ళ క్రితం గుంటూరు జిల్లాలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ పలుప్రాంతాల్లో విద్యాభ్యసించి, దేశం కొన్ని ప్రాంతాల్లో నివాసించి, జె.పి.సార్త్ర్ పై పరిశోధించి; డాక్టరేట్ ముగియకుండా, పోస్ట్ డాక్టరేట్ మొదలవకుండా, అటూ యిటూ యెటూ కాకుండా, యెక్కడో నివసిస్తూ, మరెక్కడో వసిస్తూ, తనలో కసిస్తూ —
“యెట్టాగో వున్నాది వో లమ్మి” నుంచి త్యాగరాజు “నను పాలింప” వరకు తనకిష్టం. చలికాలం వుదయం నీటి బిందువుల్లో నీలం గడ్డిపూల నుంచి పగిలిన మొహంజొదారొ పాలరాతి స్నానంతొట్ల వరకు తనకిష్టం. “నవలారాణి” కలాక్షేపం నుంచి “పొడుంనాధ” వైభవక్షేపం వరకు తన కిష్టం.
యివన్నీ తనకిష్టం. కానీ, “నా యిష్టం నా యిష్టమే. నిన్ను నువ్వు తెలుసుకో — అన్నారు వుపనిషత్తుల నుంచి రమణ మహర్షి వరకు. ముందుగా నన్ను నేను పొందాలిగా నన్ను నేను తెలుసుకోటానికి!” అని సార్త్రిస్తూ —
తనని తను పొందే అన్వేషణ యత్నంలో, (జనవరి 19, 1981) పౌష్య రౌద్రి పౌర్నిమ రాత్రి, యీ లోకపుటంచులు దాటి విశ్రాంతిగా పవళించి వెళ్ళిపోయింది — అజ్ఞాత శాక్తానంతంలోకి.
[ఈ పుస్తకాన్ని డిజిటైజ్ చేసిన కొడవళ్ళ హనుమంత రావుగారికి, ఈ పుస్తకాన్ని ఈమాటలో ఉంచడానికి అనుమతి ఇచ్చిన శ్రీ. డీ.రఘురామి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. –సంపాదకులు]
- విన్యాసం
- శిలాలోలిత
- దిగులు
- మూగవోయిన గొంతు
- హృచ్ఛితి
- నిష్క్రమణ
- దారి
- నాగరిక జాడ్యం
- రుచించని మాట
- స్త్రీ
- చిట్లని నీటిబుడగ
- ఈ రాత్రి
- తుపాకి కాల్పులు
- దేవుడూ
- ఓటమిలోని గెలుపు
- ఆశాగ్ని రేణువు
- ఉన్మాద ప్రకృతి
- సినీ చైతన్యం
- ఆకలి నిజాయితీ
- నటించగల ప్రాణి
- పాపం ఈ లోకం
- డబ్బు పంజరం
- ఆవాహన
- మహల్లాలస
- దూరం
- దేహాత్మ
- తన అక్షరాలు
- నిద్రపోతు జాతి
- వల్లకాడనలేదు
- నిర్విరామం
- అనాచరణ
- జననం
- ఊరెడుతున్నాను
- ఉక్కు శిశువు
- అనురాగ దగ్ధ సమాధి
- మలిపలుకు