నాకు ఆకలేసినప్పుడు
కేకలేసే ఓపిక్కూడా లేక
సొమ్మసిల్లినప్పుడు
ప్రణాలికలన్నారు
సస్యశ్యామలమన్నారు
సర్వోదయమన్నారు
మావోదయమన్నారు
ప్రజాస్వామ్యమన్నారు
సామ్యవాదమన్నారు
రక్తపాతమన్నారు
ఓట్లన్నారు
వల్లకాడనలేదు
ఎన్నో అన్నవాళ్ళేకానీ
పట్టెడన్నం పెట్టిన వాళ్ళు లేరు