రుచించని మాట

మగవాళ్ళకి చాటుగానూ
ఆడవాళ్ళకి పబ్లిగ్గానూ
రుచించని మాట చెప్పనా

మగకీ ఆడకీ
శీలాన్నీ ఆస్తినీ
సమంగా వర్తింపించండి
కాగితాల మీదా వేదికల మీదా కాదు
నిజంగా సమంగా వర్తింపించండి