హృచ్ఛితి

క్షితిజరేఖ వేడి
వేడిగానే ఉంది
నిరంతర చిత్తకార్తి కుక్కలు
కుక్కల్లాగే తిరుగుతున్నాయి
నాటి నుంచి ఆవరించిన అనుబంధపుటూదర
వెచ్చగా కమ్ముకుంటూనే ఉంది
ఐనా
ఈ హృదయం
ఫ్రీజర్ లోంచి తీసిన శవం కన్నా చల్లని
మాంసపు మంచుముద్ద
అది కరగటానికీ స్పందించటానికీ కావాల్సిన
నిజాయితీ మంచుమంటకి
ఈ లోకం భగ్గుమని తగలడిపోతుందిట
అందుకే
ఈ హృది ఎన్నటికీ రగలని చితి