నిద్రపోతు జాతి

తిండిమెక్కుతూ నిద్రపోతున్నారు
ఈర్ష్యపడుతూ నిద్రపోతున్నారు
పళ్ళికిలిస్తూ నిద్రపోతున్నారు
నిప్పులుకక్కుతూ నిద్రపోతున్నారు
సంపాదిస్తూ నిద్రపోతున్నారు
సంభోగిస్తూ నిద్రపోతున్నారు
హత్యలు చేస్తూ నిద్రపోతున్నారు
పరిత్యజిస్తూ నిద్రపోతున్నారు
చదువుతూ నిద్రపోతున్నారు
ఆత్మతార్చుతూ నిద్రపోతున్నారు
మరి నిద్రపోనివాడెవడిక్కడ
నిద్రపోనివాణ్ణి నిద్రపోనందుకు
మనకంటే ఒక శతాబ్దం పొడవుగా ముందుగా
మేలుకున్నందుకు చూస్తున్నందుకు
విన్నందుకు అన్నందుకు నడుస్తున్నందుకు
సమాధిచేసి నిద్రపోతున్నారు
నిద్రపోతూనేవున్నారు