దేహాత్మ

వాళ్ళు
సర్వం సన్యసించిన వాళ్ళు
మూల ప్రకృతైన శరీరాన్నొదిలి
నేల విడిచి సాములా
తీరా వాళ్ళు స్వర్గాని కెళ్ళగానే
పో పొండి
శరీరాల్లేని వాళ్ళకిక్కడ చోటుండదు
పొమ్మంటారు

వీళ్ళు
సర్వం వ్యసనించిన వీళ్ళు
ప్రాణ ప్రకృతైన ఆత్మనొదిలి
ద్వివిధ అమరత్వ జీవనాధారాన్నొదిలి
సాము లేకుండా నేలని పాకుతూ
తీరా వీళ్ళు నరకాని కెళ్ళగానే
పో పొండి
ఆత్మల్లేని వాళ్ళకిక్కడ చోటుండదు
పొమ్మంటారు

రెంటికీ చెడి చవిటిపర్రై
స్వర్గనరకాల మధ్య
ఆడామగా కాని బ్రతుకులాగైపోతారు

ఆత్మలేని శరీరమే కాదు
శరీరంలేని ఆత్మ కూడా ఉండదు
అని రసయోగ సిద్ధాంతం
స్వర్గనరకాలంటే రెండు వైరుధ్య ప్రకృతుల ఆవరణలు