ఊరెడుతున్నాను

ఈ రైలు ఆ ఊరెడుతోంది
రైల్లో కూచునున్న నేనూ
ఆ ఊరే వెడుతున్నానా
ఈ రైలుపెట్టెలో అటునుంచిటుకి
పాకే ఆ చీమ ఎటెడుతున్నట్లు
ఈ భూగోళం ఒదిలి ఎక్కణ్ణుంచో చూస్తే
రైలు గతీ అంతే
కిటికీ అంచు మీద గడ్డంకొస ఆనించి
రైలు కదలటం లేదు నేనూ కదలటం లేదు
ప్రక్కన చెట్లూ అవీ ఎదురుగా పరిగెడుతున్నాయి
వాటితోపాటు ఈ మనసు
ఆ కళ్ళలోని అనురాగపు చిర్నవ్వు నా నుదిట మీదింకా
ఆ చల్లని వెచ్చని మనసు నా హృదయంలో ఇంకా
ఒక్క లిప్తపాటు కూడా నేనెక్కడికీ వెళ్ళందే