శివరాత్రి శివరాత్రికీ ఇంట్లో సాయంత్రం వరకూ ఉపవాసం, రాత్రి జాగారం ఉంటారు బామ్మా, చిట్టి బామ్మగారూనూ. అమ్మా పిన్నీ అమీను తాతయ్యగారు ఉపవాసం ఉండరు. జాగారం మాత్రం చేస్తారు. మేం పిల్లలం తాతయ్యగారిలా జాగారం మాత్రమే ఉంటాం. వాళ్ళు పడుకోమన్నా పడుకోం.
చాగంటి తులసి
- సొంత ఊరు
- విజయనగరం
- ప్రస్తుత నివాసం
- విజయనగరం
జీవిత విశేషాలు
ప్రముఖ కథా రచయిత్రి చాగంటి తులసి, చాగంటి సోమయాజులు (చాసో) కుమార్తె. తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి, చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తనదయిన దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి.