పారదోపమ వీర్యధారాతత భగంబు
స్తన చర్మ భస్త్రికా తాడవంబు
కక్షప్రదేశ నిర్గత ఘర్మసలిలంబు
చక్రక్రమ చపేట చాలనంబు
భూరితరాపాన మారుతోద్ధూతంబు
ఘన దేహదుర్గంధ గంధిలంబు
శునకబంధవిశేష వినమిత మేఢ్రంబు
క్రీడారచిత పాదతాడనంబు
గార్దభస్వర నిస్సరద్ గ్రామ్యవచన
మమిత రోదనజల పూరితాననంబు
చంద్రరేఖాభిధాన వేశ్యానలాస్య
ప్రథమసురతంబు నీలభూపతి కరంచె
ఇవ్విధంబున సమరతి గావించి నప్పు డప్పడుపుంబోటిమిన్న మున్నెరికంబున నన్నీలాద్రిరాజపుంగవుపై లంఘించి హుంకరించి జంకించుకయులేక సంకోచంబు మాని ఇంక నాచేతం జిక్కితి వెక్కడికి బోయెదవు నిలునిలు నా యుపరతి చమత్కారంబు తోరంబుగా జూపెద పరాకు కాకు రాకొమరా మారాడక నాకేమి మెప్పు లిప్పు డిచ్చెదవో మది నెంచుకొమ్ము అని చెక్కిలినొక్కి యక్కునం గ్రక్కునం తన లంబమాన పీన స్తనంబులు గదియించి నునుదొడల కుదియించి వదలని మదంబున ముదంబునం తన మదనసదనంబున నతని మేహనంబును నమోఘంబుగా తగిలించుకొని ముమ్మరమ్ముగా దొమ్మరికొమ్మ గడకదసి ఆడు చందంబున సంభ్రమించుచు లాగివైచు చందంబున నొత్తుచు మేను మేన హత్తింపుచు తత్తరింపక కొంచెపడక దిట్టతనంబు తెచ్చుకొని విచ్చలవిడి ముచ్చటలెల్లం దీర చనుమిట్టల గట్టిగ బిగబట్టి యిట్టట్టు బెసగక తడంబడక గుట్టుచెడక చేతులు పట్టువిడక ఎదురుదట్టింపుమని చేయి మార్పుమని అడుగుతప్పెనని మించబలుకుచు కులుకుచు కోడెప్రాయంపు నాడెంపు సాలెవాడు ఘళుకుఘళుకుమన పలక చులుకగ దాటించు వాటంబున నోటువడక నీటుజూపుచు పరిభ్రమణవేగంబునం కర పాద భూషణ విశేషంబులు ఘల్లుఘల్లుమని భీషణంబుగ ఘోషింప న వ్వారయోషాలలామంబు పెదవిపెదవిం గదియ తన నిడుద వాడి మొనపంటింబట్టి పీల్చుచు చిర్రికుర్రవెండ్రుకలు తొర్రకొప్పువీడి యక్కటిప్రదేశంబున నటియింప కుండలంబులు గండతలంబునం తాండవింప గోరిదకొంప సొంపునం పెంపారు కంపుమేనుల సమానంబుగా క్రమ్ము ముమ్మరంపు చెమ్మటసోన లతని దుర్భరతర సంవృథమాన దేహశాల్మలీద్రుమంబునందు దిగజార వీరులసివంబెత్తిన లాగున నూగులాడుచుండం గని యాప్రజాపతి సేదదీర్చుకొని క్రమ్మర నమ్మరుదురంబున కెదిరించి వదలని చలమ్ము హెచ్చం బెచ్చు పెరుగు మచ్చరంబున సమదమ్ముగ నదుముకొనిన నదియు వదలక పదరుచు గుదికొన్న తమకమ్మునం దలంకక నెదురుదాక ధాక నిద్దరుం తద్దయు సంభ్రమంబును చలంబును జయకాంక్షయు మనంబునం బెనంగొన నగ్గలంబుగ నిగ్గుచు వెనుకకుం దగ్గుచు మొగ్గరించుచు పగ్గెలు సెప్పుకొనుచు చెండుచెండుగ బండబండగ తాకులాడు నెడ నచ్చంద్రరేఖ బహువిటజన సంయోగ జనిత చాతుర్య కళాధుర్య కావున మొగ్గవేసి యోటువడం జేయ సమకట్టిన నా దిట్టమట్టిరేడును బహుగణికావిలాసినీ దాసికా సంభోగ సంభృత నైపుణీ గుణగణ గణ్యుడు కావున వెనుదీయక నునుతొడలం దానినడుము బిగించి మారొడ్డుచు తెబుకుతెబుకుమను చప్పుడు లుప్పతిల్ల బిట్టట్టుసేతల నెట్టుకొని గుట్టు వదలక పట్టువట్టి సూటితప్పకుండ గండుమీరి మూర్కొన్న మహిషంబుల డంబున చిత్తకుక్కల విధంబున చీంబోతుల భాతి మాలమాసటీండ్లం బోలె మార్జాలంబుల కైవడి మసకంపు పెనుబాముల చందంబున మదించిన కోడిపుంజుల మాడ్కి లకుముకుల లాగున గొర్రెపొట్టేళ్ళ భాతి గుంటుకతోలు లీల కొర్తవేసిన కైవడి చిట్టాముదముల గ్రుమ్ము నేర్పున గొంకుజంకు లేక సమరతి యుపరతి బంధంబులం దేల జిలజిల మరుజలంబులు జాలుకొని తదీయ శయ్యాతలంబునంబడి వెల్లివిరిసి సెలయేరులైపార మహామైథున సంకల్ప సంభోగ క్రీడావినోదంబులు సూపి అలసి సొలసి తొడలతొడలును బాహువులబాహువులును మోవినిమోవియు మొగంబునమొగంబును పదంబులపదంబులును నురంబుననురంబును భగంబునలింగంబును గదియ కౌగిలించుకొని దీర్ఘనిద్రా సమాయుక్త నేత్రులై పడియుండి రనంతరంబున
తమ్ముల చక్రమ్ముల నధి
కమ్ముగ బాధించు రాజు కాంతిదొరగి వే
గమ్మున క్రుంకెన్ తద్గతి
గ్రుమ్మరు నీలాద్రిరాజు క్రుంకకయున్నే
అల నీలాద్రి మహీపుం
డెలమిని చంద్రిని రమించి యెంతయు తేజో
బలహీనుడగుట తెలుపన్
తెలుపువొడమినట్లు తూర్పు తెలతెలవారెన్
ఇనవంశసంభవుండై
ఘనసన్మార్గంబు దొరగి కాముకుడౌ నీ
లనృపతి కాదన కినుకన్
చనుదెంచెననంగ నపుడు సవితృడు తోచెన్
అంత చింతలపాటి నీలాద్రిరాజు
మొగము వెలవెలబోవంగ నిగుడిలేచె
చంద్రరేఖయు ముఖకాంతి సడలి కనుల
నుసుముకొంచును మేల్కాంచి మసలుచుండె
అత్తరి నా రాజోత్తముండు దానిం గూర్చి యిట్లనియె
నావంటిరసికు డెందము
కేవలముగ కరగజేసి కేరుచు మిగులన్
భావభవకేళి దాసుని
కావించితి నీకు సాటి కా రేసానుల్
నీమొగము నీత్రికోణము
నీ మెరుగుంగన్నుదోయి నీ నునుదొడలున్
నీమోవి నీకుచంబులు
నామదినిక మరవజాల నమ్ముము బాలా
సొమ్ములు చీరలును వరాల్
సమ్మతమున నీకునిత్తు సత్యంబిక నా
సొమ్మయియుండుము విట సం
ఘమ్ములతో చెలిమిమాని కలికీ ఎపుడున్
సానిదాననంచు పూని లోలో వెచ్చ
కాండ్రకూడ నేను కాంచినపుడె
చన్ను ముక్కు యోనినున్న గొల్లియు జిర్రి
కొప్పుకోసి వెళ్ళగొట్టువాడ
రాయవరంబున నీ క
త్యాయత గేహంబు కట్టి యందుంచెద నీ
వేయెడకుపోక యుండుము
నీయండనె యుండువాడ నేనచ్చోటన్
నావుడు నదిట్టులనియెను దేవ నాకు
నీవు దయ దండ చిక్కుట కేవలముగ
సకల సామ్రాజ్యమిచ్చుటె సంశయంబు
లేదు నీదాననై యుందు మోదమునను
నీకంటె లోనిచుట్టము
నాకిచ్చెడువాడు కలడె నానాగతులన్
చేకొని కాపాడుము సుగు
ణాకర యెవ్వరినిజేర నరుగక యుందున్
అంత నంతకుమున్నె గోతియొద్ద నక్క చందంబున ద్వారబంధమ్ము కడ కాచుకొనియున్నవాడు కావున వేంకటసోమయాజి యిదంతయు నాలకించి తటుక్కున లోనికిం బ్రవేశించి యిట్లనియె
ఇషువినుము చంద్రరేఖా
భషకమువలె నిన్ను చేరబట్టి యెవరినిన్
విషయింపనీయ గట్టిగ
మృష కాదని పలికె మిగుల ప్రేమదలిర్పన్