దాసి యొక్కతె నీపొందు కాసచెంది
వాచియున్నది విషయింప లేచిరమ్ము
సలుపు గొల్పెడి పుండ్ల బూచులకు మందు
రాచికొన నీలనృప వేగ లేచిరమ్ము
అని మరియును
కదలడు పలుకడు ధాతువు
పద కరముల నుండ చూచి బ్రతుకునొ లేదో
బెదరక చెప్పు మదెట్లు
న్నదొ యీతని కో ముడుంబినరసాచార్యా
అనిన ఆతండు దగ్గర కరిగి ధాతు
గతి పరీక్షించి యితనికి కామరోగ
మంకురించిన దిక మీరు జంకుమాని
సరగ శిశిరోపచారముల్ సలుప లేచు
అని చెప్పిన వారందరు
జనితామోదంబుతోడ చల్లని పను లే
పున చేయగ సమకట్టిరి
మనుజాధిపు చెంతచేరి మక్కువమీరన్
పసుపును నూనెయు కరపద
బిసరుహముల రాచి విసము పిండి శిరమునం
దిసుమంత గొరిగి వడినిడి
వెస చెవి వెల్లుల్లి ఊద వేగమె తెలిసెన్
తెలిసి ఉస్సురనుచు నలుదిక్కులను చూచి
సైగసేయ వారు చల్లగంజి
వంటకంబు పిసికి వడిపోయ మెల్లన
గుటుకుగుటుకురనుచు గ్రోలి సోలి
తెప్పిరి కూర్చుండి అతం
డప్పుడు తన చందమెల్ల ఆప్తులతోడన్
గుప్పున ఏకాంతంబున
చెప్పిన విని లంజె యెంత చేసెనటంచున్
బొకనాసి, గడ్డ, సెగయును
అకటా యీ నీలవిభుని కంటించిన యిం
టికి నొంటికి హాని కదా
ప్రకటంబుగ పురుగు లురలిపడి చచ్చుగదా
పట్టుడు కట్టుడు కొట్టుడు
గట్టిగ తల బోడిచేసి గాడిదమీదన్
పెట్టుడు పురి వెడలంగా
కొట్టు డనిరి అందరొకట కోపముమీరన్
అప్పుడు నీలాద్రి భూమిపుండు
దాని పట్టబూను తజిబీజు కనుగొను
సాని నిట్లుసేయ చనదు నాకు
కూర్మిమీర మీరు కుస్తరిం చిటు తోడి
తెచ్చి కూర్పవలయు నిశ్చయముగ
తల గొరిగించుట కంటెన్
మొల గొరిగించుటయె మేలు ముగ్ధయగుట బల్
సలుపున కోర్వక యుంచిన
దిల విటులకు ఇంతభాగ్య మేదీ జగతిన్
సమమై రోమరహితమై
అమితమృదుత్వంబు కలిగి అశ్వత్థదళో
పమమై స్నిగ్ధంబై వెళు
పమరెడు భగమిచ్చు భాగ్యమందురు శాస్త్రుల్
ఇన్ని లక్షణంబులెన్న దాని త్రికోణ
పాళి నుండుననుచు హాళి నాదు
నంతరాత్మ తోచె నయ్యది సౌభాగ్య
వతియె సుమ్ము పెక్కువాక్కులేల
దాని యోని తీరు దాని చన్నుల చెన్ను
దాని మోము గోము దాని మోవి
కావి ఠీవి చెప్పగా మాకుశక్యమే
రోమములు వడంకు భీమరాజ
సిద్ధాంతివి పండితుడవు
సద్ధర్ముండవును నాకు సఖుడ వెపుడు నే
నుద్ధతి దాని రమించెద
శుద్ధగతిం జెప్పు శొంఠిసుబ్బయ మాకున్
అని పలుకునప్పుడు పండితుండును నిష్టాగరిష్ఠుండును సుజ్ఞాననిపుణుండును హితుండును బ్రాహ్మణాగ్రగణ్యుండును శాంతుండును సకలజన సమ్మతుండును చతురుండును ప్రయాగవంశోత్తంసుండును అగు బాపన్న ఆపన్నుండై ఆ పగిది వాపోవుచు కన్నులు తేలవైచుచున్న ఆ నీలాద్రి మన్నురేనిం కనుంగొని వినయ విసంభ్ర గాంభీర్యంబులు గుంభింప గంభీర భాషంబుల మెల్లమెల్లన యిట్లనియె
పరనారీ సోదరుడవు
పరతత్వ విశారదుడవు బహురాజ సభాం
తర నుత కీర్తివి వేశ్యా
తరుణీమైథునము సేయ తలపం తగునే
చెరవు చేసితివిగా చెలగి బాడవ క్రింద
సద్రాజు లెన్న సముద్రముగను
వనము నిల్పితివిగా వర్ణింపరాకుండ
వీక నరట్ల కుప్పాక నడుమ
మాన్య మిచ్చితివిగా మహిషి మూలంబున
శొంఠిసుబ్బయ్యకు క్షుద్రభూమి
నా కిచ్చితివి కదా నాలుగైదు వరాలు
పేశలగతిని వర్షాశనముగ
వివిధ సంగ్రామ జయరామ విజయరామ
రాజ కరుణాకటాక్ష నిర్వ్యాజ లబ్ధ
సకలసామ్రాజ్య ఖనివి నీ వకట యొక్క
పుప్పి బోగపులంజెకై పొగులదగునె
ఇల్లును ఒళ్ళును గుల్లగు
పెల్లలరెడు రాజ్యలక్ష్మిపెంపు హరించున్
గుల్లాపు సానిదానిన్
మళ్ళని తమి కోరితీవు మరి రతి సలుపన్