పాటపాడు మటన్న పాడక యెలుగెత్తి
పదరి రోదనము చేసెదవు సుమ్ము
కాళ్ళొత్తుమని వేడ కడువడి నొత్తక
ఎదురొత్తమని పలికెదవు సుమ్ము
తములమందిమ్మన్న తమి నీక క్రమ్మర
నాకిమ్మటంచు పెనగెదువు సుమ్ము
రతికిరమ్మని పిల్వ రాగిల్లి డాయక
అదనున కడకు పోయెదవు సుమ్ము
తురకదండి కాడు దూదేకులియు కాడు
పసులవాడు కాడు బట్టు కాడు
మనలనేలునట్టి మనుజనాథుడితండు
సెప్పినట్లు నీవు సేయు చంద్రి
నావుడు నతం డిట్లనియె
పుత్తడి కీలుబొమ్మ యనబోలెడు బోలెడుయోని చందిరిన్
హత్తగ తోడితెచ్చి విరహార్తి హరింపగ చేసినావు నీ
కుత్తమ భూషణాంబర సముత్కర మిచ్చెద వేగనందుమో
యత్త వలగ్న నిర్జిత వియత్తల వేంకటసాని జానుగన్
అన నవ్వుచు వారిద్దరు
చని రంతట నీలవిభుడు చంద్రిని కని నూ
తన మదనకేళి తేలెద
నని లోపల మోహమొదవి హస్తము పట్టన్
తలవంచి పట్టెకంకటి
గల దండము వట్టి వదలగానొల్లక తా
వెలవెల బోవుచు సిగ్గుం
గల బాలికవోలె పెనగగా నాతండున్
ముంగటి కుచ్చుపట్టుకొని మోహమునన్ తన శయ్య చేర్చి వా
రాంగనవింత సిగ్గువడ నర్హమె యెందర చక్కబెట్టితో
దొంగతనంపు టీ వగలుద్రోచి హసన్ముఖివయ్యు కౌగిటన్
లొంగగబట్టి నన్ను రతిలోలుని చేయుము నీకు మ్రొక్కెదన్
చంద్రుడు మింటనంటి సరసంబుగ నగ్నికరాళ విస్ఫుర
చ్చంద్రిక కాయజొచ్చె సుమచాపుడు బాణములేయజొచ్చెనో
చంద్రి విలాస విభ్రమ విశాల కళారసలీల మీరగా
సాంద్ర కృపా కటాక్షమున చక్కగ కన్గొని కోర్కెతీర్పుమా
సకలభాగ్యములిత్తు చక్కరకెమ్మోవి
చవులు చూపింపవే చంద్రరేఖ
శంబరాంతకు చేతి శరముల కోర్వను
చక్క కౌగిటడాచు చంద్రరేఖ
చలమేల పూనెదు వలపు నిల్పగజాల
చన్ను లంటగ నిమ్ము చంద్రరేఖ
తాళజాలను నీదు కాలికిమ్రొక్కెద
స్మరమందిరము చూపు చంద్రరేఖ
కడకు పోవక నెమ్మోము ముడుచుకొనక
సిగ్గు విడనాడి నను కటాక్షించి నీదు
కన్నెప్రాయంపు రతికేళి కలయనిమ్ము
జాగుసేయక కటకపు చంద్రరేఖ
నీకున్ దాస్యము చేసెద
నాకున్ గల ధనమొసంగి నానాగతులన్
పైకొని రతి నన్నేలుము
ప్రాకటముగ చంద్రసాని పల్లవపాణీ
సిగ విడిజార మోముపయి చెమ్మటబిందువులూర గబ్బి చ
న్మొగడలు నిక్కుదేర తెగి ముత్తెపుపేరులు శయ్యచేరగా
భగ మతి సారమూర జలపంక కళంకిత జీలువారగా
వగ పురుషాయితంబున అవశ్యము నేలుము చంద్రరేఖరో
నా విని శరావసన్నిభ
కేవల సుస్నిగ్ధ మదనగృహము చెమర్పం
గా వాలు బెళుకుచూపుల
తా వలనుగ నతనిమోము తప్పకచూచెన్
ఇటువలె చూచిన నాతడు
తటుకున ఇదె సమయమనుచు తమితీరగ కౌ
గిటనొత్తి మోవిమధువటు
గుటుకుగుటుకురనుచు కడుపుకొలదిన్ గ్రోలెన్
బుడ్డికుండలవంటి బుగ్గలు చుంబించి
గొర్రెబొజ్జునుగేరు కురులు నిమిరి
కప్పచిప్పలవంటి కన్నులు ముద్దాడి
ఊదబొడ్డున కరం బూది నిలిపి
కొలిమితిత్తులబోలు కుచములు పీడించి
మరగాళ్ళ తెగడెడు కరములంటి
కొంగకంఠమువంటి కుతుక గోరులనించి
పులిబోనుబోలెడు పూకు చమిరి
వెడద కుంచములో వ్రేలువెట్టినట్లు
యోనిలో కామదండము నొత్తి దూర్చి
వెనుకకును ముంగలికి నూగుకొనుచు నీల
ధారుణీశుండు వడివడి తాక నదియు
మును నల్లమందు మాజుము
తినియున్నది గాన మేను తిమ్మిరిగొని యా
తని తాకులకు చలింపక
తన నేరుపుకోపు చూపదలచి కడంకన్
భగము వికసింపజేయుచు
బిగబట్టుచు లోనచొర నభేద్యంబుగ త
ప్పగ త్రోయుచు బెణకించుచు
బిగితొడలం చుట్టిపట్టి బిట్టలరించెన్