చంద్రరేఖావిలాపము

ప్రథమాశ్వాసము

శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రుడ
స్తోకాటోప బలప్రతాప పురరక్షో దక్ష సంశిక్షణుం డా
కాశోజ్వ్జల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
వీకం జింతలపాటి నీలనృపతిన్‌ వీక్షించు నేత్రత్రయిన్‌

అక్షయ బాహుగర్వ మహిషాసుర దుర్ముఖ చక్షురోల్లస
ద్రాక్షస దక్షులన్‌ సమరరంగములోన త్రిశూలధారచే
శిక్షయొనర్చి శోణిత మశేషము గ్రోలిన దుర్గ దుర్గుణా
ధ్యక్షుని నీలభూవిభుని తద్దయు నిర్ధను జేయు గావుతన్‌

స్తబ్ధ శబ్ద గ్రహద్వయుడు సంవేష్టితో
త్తాలవాలుండు కరాళవజ్ర
కర్కశ దంష్ట్రా క్రకచ భయంకర మహా
విస్తృత వక్త్రుండు విపుల దీర్ఘ
పటుతర కహకహ స్ఫుట చటు వికటాట్ట
హాస నిర్దళిత వేదాండభాండు
డాలోక కాలానలాభీల విస్ఫుర
న్నేత్రుండు ఖడ్గసన్నిభ నిశాత

నఖరుడు హిరణ్యకశిపు వినాశకుండు
సింహగిరివర్తి యగు నరసింహమూర్తి
యడరు చింతలపాటి నీలాద్రినృపుని
సిరియు గర్వం బడంగంగ జేయు గాత

నీరదనీలవర్ణుడు శునీవరవాహుడు విద్యుదాభ వి
స్ఫార జటాభరుండు బహుశష్పసమన్విత దీర్ఘమేడ్రు డం
భోరుహగర్భ మస్తక విభూషిత హస్తసరోజు డా మహా
భైరవు డిచ్చుగాత నశుభంబులు నీలనృపాలమౌళికిన్‌

అనుపమ విక్రమ క్రమ సహస్రభుజార్గళ భాసమాన సా
ధనజిత సిద్ధసాధ్యసురదానవ దక్షుడు దక్షశీర్ష ఖం
డను డగు వీరభద్రుడు కడంకను చింతలపాటి నీలభూ
జనపతిపుంగవు న్విభవసారవిహీనునిగా నొనర్చుతన్‌

నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగదాల్చి కన్నులన్‌
జలజల బాష్పబిందువులు జాలుకొనంగ చెలంగుచుండు న
క్కలుములచేడెయక్క కలకాలము నీలనృపాలు నింటిలో
కలిపురుషానుషంగ యయి గాఢరతిన్నటియించుగావుతన్‌

అనుదిన వక్రమార్గరతులై చరియించుచు వైరివర్గముల్‌
తనర పరస్పరాత్మతను దాలిచి మంగళుడు న్గురుండునున్‌
శనియును రాహువు న్మిగుల సమ్మతి ద్వాదశజన్మరాశులన్‌
గొనకొనినిల్చి నీలనృపకుంజరుని న్గడతేర్తు రెంతయున్‌

భీమకవి రామలింగని
స్త్రీమన్మథుడై చెలంగు శ్రీనాథకవిన్‌
రామకవి ముఖ్యులను ప్రో
ద్దామగతిం జిత్తవీధి తలచి కడంగన్‌

ఇట్లు సకలదేవతా ప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును కావించి యేనొక్క హాస్యరసప్రధానమగు ప్రబంధంబు సుకవినికర మనోనురాగ సంధాయకంబుగా రచియింప నుద్యోగించి యున్న సమయంబున

తన యపకీర్తి మాద్యత్‌ కృష్ణకాకికి
గురుతరాజాండంబు గూడు కాగ
తన లోభగుణ వినూతన దురాలభ లత
కష్టదిశల్‌ మ్రాకులై చెలంగ
తన పందతనమను ఘనతమోవితతికి
బహుగృహంబులు శైలగుహలు కాగ
తనదు జారత్వచోరునకు సంకరశర్మ
నాటకం బర్థాంజనంబు కాగ

అవని దీపించు చంద్రరేఖాభిధాన
వారనారీత్రికోణ సంవర్ధమాన
రసపరిప్లుత సుఖగదా వ్రణకిణాంక
భూషణుండైన నీలాద్రి భూమిపుండు

వెండియు నఖండ భూమండల మండవాయమాన మానవాధినాథ సాధుయూధ నిర్నిరోధావరోధ సభాభవనాభ్యంతర నితాంత వర్ణనీయ కాలకూట కాక కజ్జల ఖంజరీట కంబళేంగాల కాలమార్జాల గండోపల ఘనాఘన గంధేభ బంభర కదంబ సంభాసమా నానూనాంత దిగంతాక్రాం తాపయశోమండలుండను, సుభగుండును, మైరావణ రావణ కుంభకర్ణ కుంభనికుంభ శుంభనిశుంభ జంభ హిడింబ ప్రలంబ పౌలోమ బక వత్సక బాణ చాణూర ఘటోత్కచ కాలనేమి ఖర దూషణ త్రిశిర మారీచ మాలి సుమాలి మకరాక్ష ధూమ్రాక్ష శోణితాక్ష ప్రముఖ రక్షోదక్ష సదృక్షా క్షుద్ర నిర్నిద్ర ద్రాఘిష్ట దుర్దను దుర్గుణాధ్యక్షుండును, సర్వావలక్షణుండును, కిరాతగుణ గరిష్టుండును, దుర్మార్గప్రవీణాస్పదుండును, బ్రాహ్మణద్రవ్యభక్షణదక్షితుండును, బాలరండాసమాకర్ష్ణ కుతూహలుండును, నిరంతానంత దుర్దాంతప్రాంత కాంతారాంతరాళ కరాళమార్గానర్గళ సంచరద్గవయ గోమాయు గోపుచ్ఛ కురంగ శశ మర్కటో లూక గ్రామసూకర ప్రముఖ ప్రకట మృగయావిహార విశారదుండును, మహోన్మాదుండును, సుకవినికురంబ విద్వత్కదంబ వందిసందోహ వైణికశ్రేణికా మనోరధార్థ వ్యర్థీకరణా సంహారణాకారణా నిర్దయస్వాంతుండును, విగతశాంతుండును, బహువారనారీ జనాలింగన దుర్గంధ బంధుర భగ చుంబన తాడన పీడన దంతక్షత నఖక్షత మహిష మార్జాల మర్కట కుక్కుట కృకుర ప్రముఖ బంధనైపుణీ గుణగరిష్టుండును, దుర్జనశ్రేష్టుండును, శ్రీమచ్చింతలపాటివంశ పారావార ఘోరజాజ్వల్యమానానూన శిఖాసందోహ సందీప్త బడబానలుండును, చలచిత్తుండును, సంగరాంగణభీరుండును, విషయశూరుండును, నీచపాచకాధారుండును, పరమ దుర్బల దుర్భర శరీరుండును, ఆత్మీయ దాసవిలాసినీజన మనోధన పశ్యతోహరుండును, పతయాళుండును, అగు నీలాద్రి రాజన్యపుంగవుం డొక్కనాడు

వేటవేపులు పదివేలు మచ్చికమీఱ
మూతినాకుచు దండ మొఱుగుచుండ
ఱొమ్ముతప్పెట లూని క్రమ్మి రసాలాలు
జోహారనుచు వేటసొంపు తెలుప
తురకనేస్తలు సురాపరిమళం బెసగంగ
చెవిచెంత మనవుల చెప్పుచుండ
రసపొక్కు లడర వారస్త్రీలు ముంగల
తాథై యటంచు నృత్యంబు సలుప

వినయమెసకంగ కుంటెనపనులు సేయు
సేవకులు దాసికలు డాసి క్రేవనిలువ
అలరు కొప్పాక గ్రామసింహాసనమున
కడక తళుకొత్త పేరోలగమున నుండి

సరసాగ్రేసరు కూచిమంచికుల భాస్వద్వార్థి రాకావిధున్‌
చిరకీర్తిన్‌ బహుళాంధ్రలక్షణవిదున్‌ శ్రీమజ్జగన్నాథ సు
స్థిర కారుణ్యకటాక్షలబ్ధ కవితాధీయుక్తునిన్‌ జగ్గరా
డ్వరనామాంకితు నన్ను చూచి పలికెన్‌ వాల్లభ్యలీలాగతిన్‌

రచియించితివి మున్ను రసికులౌనని మెచ్చ
సురుచిర జానకీపరిణయంబు
వచియించితివి కవివ్రాతము ల్పొగడంగ
ద్విపద రాధాకృష్ణ దివ్యచరిత
ముచ్చరించితివి విద్వచ్చయంబు నుతింప
చాటుప్రబంధముల్‌ శతకములును
వడి ఘటించితివి ఇరువదిరెండు వర్ణనల్‌
రాణింపగా సుభద్రావివాహ

మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు
భూరిరాజన్య సంపత్‌ ప్రపూజితుడవు
భళిర నీ భాగ్యమహిమ చెప్పంగ తరమె
జగ్గరాజ కవీంద్ర వాచాఫణీంద్ర

అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్‌
పూర్ణుడవీవు సత్కవిత; బూతులరీతుల గోరు కొండగా
వర్ణనసేయ నేరుతువు వాతెము జుల్కగ పల్కు మూర్ఖులన్‌
తూర్ణమె తిట్టి చంపుదువు ధూర్తవు, పౌరుషశాలివెంతయున్‌

నిర్ణయ మిత్తెరంగెరిగి నేర్పున నిన్ను బహూకరించినన్‌
స్వర్ణవిభూషణాంబర గజ ధ్వజ చామర గోధనాశ్వ దు
ర్వర్ణ విచిత్ర పాత్ర బహురాజ్య రమారమణీయపుత్ర సం
కీర్ణ సమస్తవస్తు వర గేహ సమంచిత భోగభాగ్యముల్‌

కర్ణసమానదానము నఖండపరాక్రమశక్తి, నిత్య దృ
క్కర్ణ కులీన వాగ్విభవగౌరవ మాశ్రితబంధురక్షణో
దీర్ణ కృపారసంబును నతిస్థిరబుద్ధి, చిరాయువున్‌, సుధా
వర్ణయశంబునున్‌ కలిగి వర్ధిలజేతువు జగ్గసత్కవీ

అని యనేకప్రకారంబులం గొనియాడి యీడులేని వేడుకం చంద్రరేఖాభిధాన వార వారణరాజయాన యూరుప్రదేశంబున శిరంబు మోపి పరుండి క్రిందు చూచుచు నా రాజాత్మజుండిట్లనియె

వేంకటశాస్త్రులు మాకు న
లంకారగ్రంథమొకటి లలి సురభాషన్‌
బంకించె ఆంధ్రకావ్యం
బంకిత మొనరింపు మీవు నట్లనె మాకున్‌

అని మున్ను సత్ప్రబంధం
బొనరింపుమటంచు చెప్పియుంటిమి వెస న
ట్లనె రసముగ చెప్పితి వది
గొన నిపుడు ధనంబు లేదు కొదువ లభించెన్‌

విను మదియెట్లన మనుజులు నామీద
బిట్టుగ చలమూని విజయరామ
ధరణీశుతో చెప్ప దండుగ పన్నెండు
వేలరూపాయలు వేగగొనియె
నిచ్ఛాపురంబులో నేనొక్క లంజతో
భోగించి నిద్దుర బోవ చోరు
లెలమి డేరా చొచ్చి బలువైన గుఱ్ఱంబు
వెండిపల్లము పదివేలవరాల

సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి
సాటిదేశంబు రాయభూషణుడు ద్రొబ్బె
తప్పె భాగ్యంబు నిర్భాగ్యదశ లభించె
తవిలి సత్కృతి గొన పదార్థంబు లేదు

అదియునుం గాక

సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాగ
నంది రవియెల్ల జగతి నందంద యణగె
ఘనత జగదేకవిఖ్యాతి కలుగదయ్యె
వ్యర్థమయ్యె పదార్థంబు వారిదెల్ల

అపకీర్తియు కీర్తియు భువి
నెపుడుం పోకుండు; కీర్తి కియ్యగవలయున్‌
విపులముగ ధనము; మాకిపు
డుపకారము గాగ చెప్పు మొకకృతి సరగన్‌

చెప్పిడుము హాస్యరసముగ
గుప్పున ముందెవరు చెప్పుకొననిదిగా
ఇప్పుడు నాకును నొప్పుల
కుప్పకు ఈ చంద్రరేఖకును ముదమొదవన్‌

గంగి సుమీ మును పేరున
భృంగి సుమీ నాట్యకలన పేర్కొన మరు సా
రంగి సుమీ దీనమ్మను
దెంగి సుమీ కామరతుల దిట్టడనైతిన్‌

వారకన్యక యని నీవు కేరవలదు
దీనితో నాకు నేస్తంబు పూన జేసి
కడకమై నాడిమళ్ళ వేంకటమనీషి
దీనితల్లిని విషయించు దృష్టికలన

బోగమువారందరు న
చ్చో గుంభనమెసగ వచ్చిచూడగ నతడా
యాగాయతనము లో సం
యోగము గావింపజేసె నొగి నిర్వురకున్‌

ఆతనికి కూతురగుటన్‌
చాతుర్యమెలర్ప నేర్పె చౌశీతిగతుల్‌
ఖ్యాతిగ నిది నా మదికిన్‌
చేతస్సంజాత సుమవిశిఖమై నాటెన్‌

దీని మొగంబు డంబు మరి దీని విలంబకుచంబు లందమున్‌
దీని ఘనోరుకాండయుగ దీర్ఘవికీర్ణసుకేశపాశమున్‌
దీని మధుప్లతాధరము దీని మహోన్నత రోమరాజియున్‌
దీని సుబాహుమూలరుచి తెల్లమ నాకెదబాయ వెప్పుడున్‌

సానుల గూడనో మునుపు చక్కని చిక్కని నిక్కు ముక్కు పె
న్యోనుల చూడనో కడు సముజ్వల పంకజపత్త్ర విభ్రమా
నూన విలాసపేశల మనోహర యోనికి సాటిసేయగా
కానగరాదు వస్తువది కన్నుల కట్టిన యట్ల తోచెడిన్‌

చంద్రబింబస్ఫూర్తి చౌకసేయగ చాలు
ముద్దుగారెడి నవ్వుమోము తోడ
కలువరేకులడాలు కడకొత్తగా చాలు
తోరంపు నిడుదకందోయి తోడ
కరటికుంభంబుల పరిభవింపగ చాలు
కర్కశకుచయుగ్మకంబు తోడ
బంధుజీవముల తోడ ప్రతిఘటింపగ చాలు
రాగసంయోగాధరంబు తోడ

సొగసు కులుకంగ నుపరతి చొక్కజేసి
కొసరి నా మానసంబెల్ల కొల్లలాడి
నన్ను దాసునిగానేలె నన్నిగతుల
దీని వర్ణింపుమా రసోదీర్ణముగను

ఎన్ని విధంబుల దెంగిన
తన్నదు తిట్టదు వరాలు ధాన్యము సొమ్ముల్‌
సన్నపు కోకలు తెమ్మని
నన్నడుగదు యిట్టి వారనారులు కలరే

భగము బిగి మొగము జిగియును
చిగురాకన్మోవికావి చెప్పగతరమా
తగ నన్నును దీనిని కడు
సొగసుగ వర్ణింపవలయు సుకవివతంసా

అని యత్యంత ప్రేమాతిరేకంబున వేడిన నే నిట్లంటి

ఆది పురోహితులైన తేజోమూర్తు
లను గతాయులకడ కనిపినావు
సాధు జయంతి మహాదేవు మాన్యంబు
లెలమి కాసాలంజ కిచ్చినావు
రాయవరంబు మిరాశిదారుల వెళ్ళ
గొట్టి కొంపల పసుల్‌ కట్టినావు
ధర్మాత్ముడును తాతతమ్ముడు నగు రాయ
విభు నిరుద్యోగి కావించినావు

బోయగొల్లాములో కాసు పోకయుండ
వేంకటమనీషి చేత నిరంకుశగతి
క్రతువు సేయించితివి నీకు కృతియొనర్ప
నర్హమగునట్లు చేతు నీలాద్రిరాజ

అనినం ప్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును పరమానందకందళిత మానసారవిందుండనై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం చెప్పం బూనితి

నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్‌
ప్రాచుర్యవికారునకున్‌
రాచినృపకులాబ్ధి గరళరససారునకున్‌

క్రూరునకు సాధుబాధా
చారునకు న్యోనిపానసర శీలునకున్‌
జారునకు విప్రతతిధన
చోరునకున్‌ బుద్ధిహీన శుభరహితునకున్‌

పరనారీ భగచుంబన
పరతంత్రున కఖిల దుష్టపాపాత్మునకున్‌
నిరుపమ దుర్గుణశీలికి
ధరలో నీలాద్రిరాజ దౌర్భాగ్యునకున్‌

అతిమూఢశీలునకు సం
తత మృగయాఖేలునకున్‌ దాసీవనితా
వితత రతిలోలునకు ఘన
పతిత కుజన పాలునకును పతయాళునకున్‌

దుర్భరతనునకు రండా
గర్భాపాతన విధాన కౌశల కలనా
విర్భూతాపయశునకున్‌
నిర్భర కలుషాత్మునకును నిర్లజ్జునకున్‌

ఆవిష్కృత చంద్రీభగ
దేవీపూజావిధాన ధీసారునకున్‌
కేవల రణభీరునకున్‌
భూవలయోద్ధరణ ఘోర భూధారునకున్‌

వారవధూ సార మధూ
ద్గారి వదన చుంబన క్రకచభవ దురువ
క్త్రారూఢ రదనునకు కాం
తారాంతర సదనునకు వితత నిధనునకున్‌

చింతలపాట్యాన్వయతత
కాంతార కుఠారునకును ఘనతర చింతా
క్రాంతునకు నీలధరణీ
కాంతునకున్‌ వీత సుగుణగణ శాంతునకున్‌

అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన చంద్రరేఖావిలాపంబను సత్ప్రబంధరాజంబునకు కథాక్రమం బెట్టిదనిన

మున్ను శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండగు వీరభద్ర భట్టారకేంద్రునకు శ్రీమద్వైఘానస వంశోత్తంసంబగు నంబి నరసింహాచార్యవర్యుం డిట్లని చెప్పం దొడంగె

బహుళ నానావిధ పశుకళేబర చర్మ
కంకాళ వాల ఖురాంకితంబు
మస్తిష్క వల్లూర మాంసఖాదన మోద
కంక వాయస కృధ్ర సంకులంబు
సాంద్రక్షతజ బిందుసందోహ పరిమిళ
న్మక్షికా క్రిమికీటకాక్షయంబు
పలలాశనానందభరిత పరస్పర
కలహకృత్కౌలేయ గవయశివము

మధురతర మదిరాపాన మదభరాతి
ఖేల బాలిశ చండాలజాల తాడ్య
మాన తూర్యనినాద సమన్వితము దు
రాపవనపల్లి బోయగొల్లావు పల్లి

బోయలును గొల్లలును నందు పొందు గూడి
యుండుటను బోయగొల్లమై యూరు వెలసె
మరియు తద్గ్రామమున నొక మాలపెద్ద
చెరువు త్రవ్వించె జనుల కచ్చెరువు కాగ

అంత కొంతకాలంబునకు

అప్పారావున కొక కృతి
చెప్ప నతండడగ నందు చేరెను వినయం
బొప్పన్‌ వేంకటశాస్త్రులు
గుప్పున నతడాడిమళ్ళ కులు డెన్నంగన్‌

వాని ప్రార్థింప నొక పెనుపాక చూప
వాసముగ నందు వసియించి వలనుమీర
కొడుకులును తాను వాడిచ్చు కోలు తినుచు
ఇడుములకు నోర్చి కాలంబు గడుపుచుండి

నీలాద్రివిభున కా కృతి
వాలాయము నిచ్చి సిరులు వడయగ వలెనం
చాలోల చిత్తమున తా
నాలోచన సేయుచుండె నాత్మజ తోడన్‌

అంత

కటకపు వేంకటసానికి
విటుడగుటను నూజవీడు విడిచి యచటికిన్‌
తటుకున కూతుం దోడ్కొని
మటుమాయలు పన్నుకొనుచు మచ్చిక చేరెన్‌

చేరిన దాని నతడు గని
కూరిమితో కౌగిలించుకొని మక్కువ నా
హారాదికంబు లిడుచును
మారక్రీడల చెలంగి మన్నన నునిచెన్‌

అది యెట్టిదనిన

పుట్టకాల్‌ సొట్టకేల్‌ వట్టివ్రేలుం జెవుల్‌
పట్టు లేకట్టిట్టు బిట్టు కదలు
మిట్టపండ్లును పెనులొట్ట కన్గవయును
బిట్టులై చుట్టలై నిట్టనిగిడి
దట్టమై బలు కొంగపిట్ట చట్టువలను
కొట్టంగ సమకట్టినట్టి తెలుపు
రెట్టింప నౌదలబుట్టి చెంపలమీద
నట్టాడు ఈకలకట్ట చుట్ట

తొట్టిపెదవులు తుంపరలుట్టిపడెడు
చట్టికెనయగు నోరును గట్టిలేక
కొట్టుమిట్టాడు బలు జనులుట్టిపడెడు
యోనిగలయది వేంకటసాని మరియు

కల్లు పెల్లుగద్రావి కారుకూతలు కూయు
మాలని నైనను మరులుగొల్పు
కాసువీసంబులు వాసిగా లంకించి
జుడిగి నెల్లాళ్ళలో జోగి చేసి
యిలు వెళ్ళగా కొట్టు నెక్కువతక్కువ
మాటలాడును వట్టిబూటకములు
వేంకటశాస్త్రుల వేశ్య నెవ్వరితోడ
నవ్వదంచును జనుల్‌ నమ్మ తిరుగు

కూతునకు ఎవ్వనిం దెచ్చి కొమరుకన్నె
ప్రాయ మిప్పించి ఏరీతి ప్రబలునట్లు
చేసెదవొ యంచు చెవిలోన చెప్పుచుండు
శాస్త్రిగారికి వేంకటసాని యెపుడు

ఈసరణి తెలుప నాతం
డా సానిం జూచి పలికె నలివేణి! మదిన్‌
వేసరక తాళియుండుము
నీ సుతకున్‌ కూర్మి కూర్తు నీలాద్రినృపున్‌

నా కృతికన్యకకును కన
దాకృతి యీ కన్యకకును నతనిం బతిగా
నీకొన జేసిన మనకున్‌
చేకురు భాగ్యంబటంచు చెప్పి రయమునన్‌

యాగము పేరుచెప్పికొని అర్థము భూప్రజ వేడి తెచ్చినన్‌
భోగము సేయవచ్చు నిజపుత్త్ర సహోదర దార బంధు సం
యోగము గాగ నంచు మది నూహ యొనర్చి యతం డఖండ మా
యాగుణ దూషితాత్ముడయి యచ్చొటు వెల్వడి యెల్ల భూములన్‌

నీచత్వమునకు రోయక
చూచిన నరులెల్ల వేడి సుడివడక కడున్‌
యాచన చేసి పదార్థ మ
గోచరముగ సంగ్రహించుకొని వచ్చి వెసన్‌

మాలవాని చెరువు మరువున పందిళ్ళు
సాలలును ఘటించి సంభ్రమమున
యాజకులును పెద్దలైన విప్రుల కూర్చి
దీక్ష బూని నిజసతియును తాను

కడక దక్షిణాగ్ని గార్హపత్యాహవ
నీయ వహ్నులందు నిలిపి మంచి
మేకపోతుగముల మెదలకుండ వధించి
వెరవు మీర నందు వేల్చుచుండి

మఖము చూడ వచ్చు మనుజుల కిష్టిష్టి
కాగ అన్నమిడడు, గదుముడనుచు
కొడుకుతోడ తనదు కూతుమగనితోడ
చెప్ప వారు లోభచిత్తులగుచు

కొందర కొకింత కూడిడి
కొందరకుం కూరలొసగి కొందరకిడకే
దండన సేయుచు గెంటుచు
కొందర తిట్టుచును వెళ్ళగొట్టుచు కడకన్‌

పుడమిరేండ్లంపిన గుడ దధి హైయంగ
వీనముల్‌ లోనిండ్లలోన దాచి
కరణంబు లంపిన కంద పెండలములు
పదిలంబుగా నేల పాతివైచి
బ్రాహ్మణుల్దెచ్చిన బహువిధఫలములు
లోలోన తనదు చుట్టాలకిచ్చి
కోమట్లు తెచ్చిన గురుతర వస్తువుల్‌
మెల్లమెల్లన తారె మ్రింగివైచి

పప్పులో నుప్పు మిక్కిలి పారజల్లి
నేతిలో ఆముదమ్మును నిండ నింపి
పులుసులో గంజి మిక్కిలి కలయబోసి
భక్ష్యములలోన మిరియంపు పదడు కలిపి

మంచి బూరెలు పొణకల మాటువెట్టి
పిండిబూరె లొక్కొక్కముక్క పెద్దవారి
విస్తరులలోన పారంగ విసరివైచి
కసరికొట్టిన విప్రు లాకటను లేచి

శపియించుచు ఎండలచే
తపియించుచు నేటికేమి తాళుడటంచున్‌
చపలస్వాంతుం డీతడు
కపటపు యజ్ఞంబు సేయ కడగె నటంచున్‌

చప్పట్లు చరచుకొంచును
ముప్పున నితడేల క్రతువు మొనసి యొనర్చెన్‌
మొప్పెతనంబున, అర్థము
గుప్పున ఇక్కపటవృత్తి కూర్చె నటంచున్‌

జవ్వనంబున వేంకటసాని యధర
మధువు గ్రోలిన రోతవో మదితలంచి
వృద్ధదశ సోమపాన మివ్విధి నొనర్చె
కాని స్వర్గాపవర్గేచ్ఛ కాదు సుండు

అనుచు జనులెల్ల నిబ్భంగి నాడుచుండి
రంత వేంకటశాస్త్రి ఆగాయతనము
ప్రకటముగ చూడ చింతలపాటి నీల
నరవరగ్రామణి మనంబునం దలంచి

బోగము మిడిమేళంబులు
భాగవతులు వేటకాండ్రు భషకచయంబుల్‌
మూగి తనవెంట కొలువగ
వేగంబున తరలి యట ప్రవేశంబయ్యెన్‌

ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగరలొసంగి శాలాసమీపంబునం పటకుటీరాభ్యంతరంబున నిలిచి తదీయ క్రతుమంత్రతంత్ర ప్రయోగ ప్రధాన విధానంబు లాలోకించి హాళిం గనుచుండె; నయ్యవసరంబున

విష్ణలోపలి పుచ్చవిత్తుల గతి కప్పు
గల గొగ్గిపండ్ల సింగారమడర
విప్పు కల్గిన పేడకుప్పలో పురువుల
చొప్పున కొప్పున సుమము లమర
కప్పచిప్పల పొల్సుకండ లూడెడి రీతి
చీకుకన్నుల పుసు లేపుమీర
నూతిచెంగట వ్రేలు నునుతంబ కాయల
సరణి పొక్కిలిదండ చన్నులొప్ప

గడ్డిబొద్దు వలెను మేను కానిపింప
బారకర్రల తెరగున బాహులలర
జనకయాగంబు చూడవచ్చెను త్రికోణ
సాంద్రతర రోమరేఖ ఆ చంద్రరేఖ

ఇటువలె నచటికి వచ్చెడు
విటకంటకి చూచి చిత్తవిభ్రమ మొదవన్‌
తటుకున నీలనృపతి హృ
త్పుటమున సోలుచును దాని పొగడదొడంగెన్‌

జడకుచ్చును మెడహెచ్చును
నడగచ్చును బొచ్చుపెరిగి నలువగు మేనున్‌
నిడుదగు తొడల బెడంగున్‌
కడు వలమగు నడుము కలుగు కలికిది భళిరా

నిక్కు పొగపిడుత కదరా
ముక్కు; మొగంబెన్న కోతిముఖమున కెనయౌ
పొక్కిలి మొలలో తగు భళి
అక్కజపుం నూనెసిద్దెలౌర కుచంబుల్‌

మోవి పీయూషమూరును కేవలముగ
గవ్వదళసరి పండ్లహా! కలికిమేని
మృదువు కోరింతకంపల గదుమజాలు
చెక్కులలరారు లోహపునక్కు లౌర

చూపు కాకిచూపు నేపారుకన్నులు
పిల్లికనుల గదుమ నుల్లసిల్లు
స్వరము గార్దభమును పరిహసింపగ జాలు
మదనసదనమెల్ల మంగలంబు

ఈనీటు సాని నెచ్చట
కానముగద మున్ను; నేడు గట్టిగ దీనిన్‌
పోనీక రతి గలంపక
యే నేక్రియ తాళువాడ నిక నిచ్చోటన్‌

భషక కపి చటక గార్దభ
వృషభాదిక బంధగతుల వేమరు దీనిన్‌
విషయింపక ఏలాగున
విషమశరు కరాళి బాధవీడునె నాకున్‌

బాలరండల పదివేల మరుల్గొల్పి
కోర్కె దీరగ మున్ను కూడినాడ
మగవాండ్ర పెక్కండ్ర మచ్చికలగావించి
కొంచక రతుల చొక్కించినాడ
దాసికాజనులకు కాసువీసంబీక
వెస గొల్లవంపులు వెట్టినాడ
సానిబోగమువాండ్ర చనవుబల్మిని బట్టి
పలుమారు రతికేళి కలసినాడ

కాని యీసోయగమును ఈ కలికిమీది
ప్రేమమును పెరచోట లభింపలేదు
మరుని మాయావికారమో మగువ మచ్చు
మందు చల్లెనో నామది మందగించె

ఈ మాపీ యింతిని నా
కామాతురతమెల్ల తీర గాఢతరమహా
స్తోమాయత ఖరబంధో
ద్దామత మెరయంగ దెంగెదను వలపారన్‌

పుణ్యంబేదిన నేదనీ, జనులు గుంపుల్గూడి కాదంచు కా
ర్పణ్యప్రక్రియ తెల్పినం తెలుపనీ, రాజుల్‌ మహాదుర్గుణా
గణ్యుండంచును పల్కినం పలుకనీ, కౌతూహలంబొప్ప నీ
పణ్యస్త్రీ మధురాధరోదిత సుధాపానంబు కావించెదన్‌

చెక్కిలినొక్కి ముద్దుగొని చిక్కని చక్కని గుబ్బచన్నులం
దొక్కట గోరులుంచి జిగియూరువు లంటుచు కోర్కెతీరగా
కుక్కుటబంధవైఖరుల కూడినగాక మనోజుధాటిచే
ఇక్కడ నిల్వగా తరమె యించుకయున్‌ పెరమాట లేటికిన్‌

అని యనివారితమోహము
మనమున పెనగొనగ నతడు మరిమరి చూడన్‌
వనితయు నాతని తప్పక
కనుగొని యనురాగమొదవ కడక నుతించెన్‌

పరువంపు ప్రాయంపు తురకబిడ్డని రీతి
మట్టుమీరగ పాగ చుట్టినాడు
కులుకుజవ్వనపు బల్‌ గుజరాతి పాపని
వీలుగా ప్రోగులు వెట్టినాడు
ఆడుభాగవతుని జాడ గడ్దము మూతి
నున్నగా గొరిగించుకొన్న వాడు
డుబుడక్క కొమరుడు డుంక నిజారును
పుడమిజీరెడి నగల్‌ తొడిగినాడు

మడుగులోబడ్డ మహిషంబు మాడ్కి మేన
నందముగ మంచిగంద మలందినాడు
భళిర యీ నీలనృపతితో కలయ కలుగు
బాలికామణిదే కదా భాగ్యమరయ

ఖర ఘృష్ణి సదృశ తేజుడు
పరమాత్మజ తుల్య రూపశాలి సుభగ భా
సురవదనుడు హరిసన్నిభ
గురుతరగుణు డిట్టి రాచకొమరుడు కలడే

గుహ్యకేశ తుల్య గురువైభవుండు పీ
నోరుశాలి సమరభీరు డుర్వి
జనుల నమలుబుద్ధి చనువాడితని తేరి
వాసుదేవు డెట్లు చేసెనొక్కె

ఆ వాలుకన్ను లందము
పీవర భుజదండములును పృథుగండములున్‌
కేవల శోభాతనుడీ
భూవరు డర్మిలిని నాకు బొజుగగు నొక్కో

బూరుగు పెనుమ్రాను పొడవు, గానుగరోటి
వలయదేహము, దాకవంటి నోరు
పెనురసపుం బొల్లిపెదవులు, అలమైన
బుర్రముక్కును, క్రొత్త బోడిగడ్డ
మల జ్యేష్టకిరవగు వెళుపుమొగంబును,
పొడకంత తలకాయ, కుడితి గూన
బోలెడు బొజ్జయు, పొలసుకన్నులు, లావు
నడుము, రాపాడెడు అడుగు లౌర

పెద్ద యేనుగుకాలంత కద్దు శిశ్న
మిట్టి సౌందర్యనిధి భువి పుట్ట జేసి
నట్టి తామరపట్టి నేర్పరయ తరమె
చాల చదివిన వేంకటశాస్త్రికైన

నా పూర్వపుణ్యఫలమున
ఈ పురుషునితోడ నేస్తమెనసిన కూర్మిన్‌
రేపిచ్చెద మాపిచ్చెద
కాపట్యములేని నిండు కౌగిలితనికిన్‌

జడ కటిసీమ తూల, నిడుజన్నులు రొమ్మున వ్రేల, కొప్పు వె
న్నడరుచు చిందులాడ, పురుషాయితబంధ కళాప్రవీణతన్‌
చెడుగుడులాడి వీని ఘనశిశ్నపటుత్వ మహత్వ మెన్నుచున్‌
విడువక వీని కూడి మది వెర్రితగుల్కొన చేయుటెన్నడో

కూతుబుడమ, మర్లమాతంగి ఆకును
మూత్రంబుతో నూరి ముద్దచేసి
పచ్చిపనస తోడ బాగుగా మర్దించి
నూనెతోడను కూర్చి మేన నలుగు
పెట్టిన నుమ్మెత్తవిత్తులు గుండెత
ల్లడపాకు పసరు నుల్లాసమునను
కాల్మడి కలిపి పోకలు దానిలోపల
నానించి యెండించి లోనికిముడ

వీడియముతోడ పెట్టిన విడువకితడు
బంటు తెరగున నా వెనువెంట తిరుగు
నట్లు సేయగ అత డెన్న డబ్బునొక్కొ
మెల్లమెల్లన కలధనంబెల్ల దొబ్బ

కొందరు మలయుక్తముగా
మందిడుదురు మరులుకొనగ మా వారసతుల్‌
మందత చెందును విటుడటు
నింద గదా యటుల సేయ నృపవర్యునకున్‌

ఏలాగు మాటలాడుదు
ఏలాగున మరులు కొలిపి యెలయింతును నే
నేలాగు లోలుజేయుదు
నేలాగున కలుగువిత్త మెల్ల హరింతున్‌

అని చాల జాలినొందుచు
చనుగుబ్బల పైటజార్చి చక్కగనొత్తున్‌
మొనవాడిచూపు చూచును
పెనుకొప్పటు జారజేసి బిరబిర ముడుచున్‌

ఆవ ద్రావిన పసరమ ట్లది మెలంగ
చూచి నీలాద్రిభూపతి సొమ్మసిల్లి
మెల్లమెల్లన తెలివొంది కల్లుద్రావి
పరవశత నొందు చండాలు పగిది తోచి

వలబడ్డ మీను కైవడి, నిప్పుద్రొక్కిన
కోతి భాతిని, వెర్రిగొన్న కుక్క
పద్ధతి, కుడితిలో పడిన మూషికమట్లు,
శ్లేష్మంబులో ఈగ లీల, సన్ని
పాతి చందమున, వాతంపుగొడ్డు వి
ధంబున, లాహిరీదళము మిగుల
తినిన పాశ్చాత్యుని తీరున, ఉరివడ్డ
పక్షి కైవడి, పెనుపాము పగిది,

భూతమూనిన మనుజుని పోల్కి, బెట్టు
మందు మెసవిన మాన్యు మాడ్కి, దేహ
మెరుగ కెంతయు కళవళంబెసగ దాని
పై తలంపిడి కన్ను మోడ్పక యతండు

తలనొప్పియు తాపజ్వర
మలసటయును మిగుల పొడమ నసురసు రనుచున్‌
నిలువంగ బలము చాలక
తలిమముపై వ్రాలి దాని తలచుచు నుండెన్‌

అని నంబి నారసింహుం
డనువొప్పగ నిట్లు చెప్ప నా తంబళి వీ
రన యావలికథ లెస్సగ
వినయంబున చెప్పుమనుచు వెస వేడుటయున్‌

నీచచరిత్ర వారరమణీభగ రుక్తతగాత్ర నిత్య దు
ర్యాచకమిత్ర సజ్జనపదార్థ పరిగ్రహణైకసూత్ర దు
ష్కాచ పిశంగనేత్ర నృపకర్మ మహాలతికా లవిత్ర శ్రీ
రాచి నృపాల గోత్ర వనరాశి కనద్‌ బడబాగ్నిహోత్రమా

దురాలాప దుర్దోష దుర్మార్గ వర్తీ
ధరామండలఖ్యాత ధౌర్య్తాపకీర్తీ
పరస్త్రీ రతాసక్త భావప్రపూర్తీ
స్థిరాయుస్స్థిరాజాత దీర్ఘోగ్రమూర్తీ

ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్షణానుక్షణ సంలబ్ధ సరసకవితావిచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశ భాషావిశేష భూషితాశేష కవితావిలాస భాసురాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్రరామాయణ ప్రముఖ బహుళ ప్రబంధ నిబంధన బంధురవిధాన నవీనశబ్దశాశన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపం బను హాస్యరస ప్రబంధరాజంబునం బ్రథమాశ్వాసంబు సంపూర్ణము.

ద్వితీయాశ్వాసము

శ్రీరహితగేహ! చంద్రీ
వారవధూ మదనసదన వర్ధిత సుఖరో
గారూఢిత మృదుదేహ! వ
నీరంగ విహారసాంద్ర! నీలనరేంద్రా!

ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా దొల్లి శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండైన వీరభద్రభట్టారునకు శ్రీమద్వైఖానస వంశోత్తముండగు నంబి నరసింహాచార్యుం డవ్వలికథ యిట్లని చెప్పందొడంగె

అక్కమలేక్షణ యది గని
చిక్కెంబో వీడు నాదు చేతికటంచున్‌
నిక్కుచు తల్లికడకు చని
మక్కువ నక్కథ యెరుంగ మరువున తెలుపన్‌

ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె

నీ తండ్రి క్రతువు కనుగొన
నాతతగతి నీలనృపతి యరుదెంచి నినున్‌
రాతిరి గని మోహించుట
లాతులలో తేనెపుట్టినట్లయ్యె కదే

ఏమేమి, నీలభూపతి
నీమీదం కన్నువైచి నిష్టురజవవ
త్కామ శరజాల నిర్దళి
తామేయ స్వాంతుడయ్యెనా మేలుభళీ

కూతుర, యాతుర పడి నీ
వాతని చేరంగబోకు, మటుతాళుము, వా
డేతెంచు సంచులను ధన
మాతతగతి నించుకొంచు వ్యామోహమునన్‌

వలపెంత నీకు కలిగిన
కులధర్మము తప్పరాదు కుమ్మరపురువుం
బలె తిరిగి పొట్టపెంపగ
వలె జుమ్మా ముద్దుగుమ్మ వగ నాయమ్మా

అని యనేకప్రకారంబుల లాలించి మేలెంచి తనకాలంబునాటి నాటకంబులు బూటకంబులు బోటిదనంబులు నీటులు కూటంబులమాటలు చాటుమాటులేక తేటతెల్లంబుగా నబ్బోటితో చాటందొడంగె

వేంకటశాస్త్రులవంటి ని
రంకుశులను మరులు కొల్పి యర్థము చాలన్‌
లంకించి నాకు నమ్మిన
కింకరులుగ చేసికొంటి కిమ్మనకుండన్‌

మున్నెంతవాడు వేడిన
కన్నెరికంబీక మీదుగట్టితి నీకై
మన్నన గైకొమ్మని విటు
లన్నిత్యము మాయచేసి లంకింతు వరాల్‌

ఒకడు కానకుండ నొక్కని రావించి
ఒకనిచెంత కేగుచుండి నడిమి
దారి నొకని కూడి తబ్బిబ్బు గావించి
ధనము కొల్లగొందు తవిలి ముందు

మందుల మంత్రంబులచే
విందులచే పూతచేత వీడెంబులచే
తందనపదముల ఆటల
మందులకావించి విటుల మానక దోతున్‌

అందలముల్‌ శతాంగములు అశ్వచయంబులు పాలకీలునున్‌
మందరశైలరాజనిభ మత్తగజంబులు వెంటనంటి రా
ముందర పొందుగా ధనముమూటలు మేటులు కాన్కలంపి నా
మందిరసీమ గాతు రసమాన నృపాలకుమారు లెప్పుడున్‌

నీకేమి చెప్పవలయును
లోకులెరుంగుదురు నాటిలో మదనుడహా
నాకనుసన్నల మెలగును
కాకుండిన నింతసొమ్ము గడియింతునటే

అప్పారాయని సభలో
మెప్పొందితి సాటి సానిమేళంబులలో
చెప్పిన పగ్గెగ నీమది
కిప్పుడు తోచును, మరెవ్వరిచ్చట సాక్షుల్‌

చెలమకు పిట్టలు చేరెడు
పొలుపున నా యింటిచుట్టు భోగాభిరతిన్‌
పలుగు గులాములు తురకలు
వలగొని కానుకలు కొనుచు వత్తురు సుమ్మీ

కట్టినకోకలు కట్టక
పెట్టిన మణిభూషణములు పెట్టక సిరులం
దొట్టి విటకోటి కొలువగ
దిట్టతనంబునను కొలువుదీర్తు కడంకన్‌

జూదంబుల పటువీణా
నాదంబుల దండలాస్యనటనముల మతుల్‌
భేదించి విటజనంబుల
చే దండుగ కొందు ధనము చెప్పగ నేలా

వలిప చెంగావి పావడ కటిస్థలి తాల్చి
జిలుగైన సరిగంచుచీర కట్టి
కులుకుగుబ్బల మీద మలయజాతము పూసి
కట్టువాపని కంచుకంబు తొడిగి
లీలగా సిగవేసి పూలదండలు చుట్టి
ముత్యాలతాటంకములు ధరించి
కడియాలు కుంటేళ్ళు గంట లొడ్డాణంబు
బవిరలు బావిలీల్‌ బన్నసరులు

ఉంగరంబులు కెంపులు ముంగరయును
మొదలుగల సొమ్ములను దాల్చి మురిపెమమర
తిరుగుచును విటకోటుల ధృతి కలంచి
హొన్నులు గడింతు మరునాన చిన్నదాన

నా వగ నా యొసపరినడ
నా వాలుంజూపుకోపు నా మాటలతీ
రావంతయు నీ వెరుగ వ
హా వన్నెలకానికూతురా యిది మేరా

చండ్లు పడె పండ్లు కదలెను
కండ్లకు చత్వార మొదవె కాయము ముదిసెన్‌
గోండ్లును భగమును బిగిచెడి
దిండ్ల తిరుగు నేర్పు తప్పె ధృతి మరపూనెన్‌

వృద్ధత్వ మివ్విధంబున
సిద్ధించెను కాని యిపుడు చిల్లరవిటులన్‌
బద్ధానురాగులుగ అని
రుద్ధజనకు కేళి తేల్చి రో వెల కొననే

కాన నీవును నావలె కాముకులను
వంచనము చేసి విత్తమార్జించవలయు
కాక యాతనిపై మోహకాంక్ష పూన
జనునె వాడెంత సౌందర్యశాలి యైన

అసదృక్కాముకుడౌటచే తను తదీయాంగంబు నందెంతయున్‌
రసపొక్కు ల్బలుబిళ్ళలు న్బహుళ ఘోర స్ఫార జాగ్రత్ప్ర మే
హసుఖవ్యాధులు మానకుండును సదా హా వాని పొందూనినన్‌
వెస నంటుంగద నీ భగస్థితి భయావిర్భూత భావంబునన్‌

అది చెడుట నీవు చెడుటయె
కద యెవ్వరు నిన్ను తేరి కనుగొనకయె న
వ్వుదు రొక కాసు నొసంగరు
తుది నీ బ్రతుకేమి యగునొ తోచదు నాకున్‌

అనుచు బోధసేయునట్టి మాయలమల్లి
బేసబెల్లి వగలవేసవెల్లి
ఉలికితెగులు బొల్లి నుల్లసిల్లెడు తల్లి
చూచి యా బొజుంగుజోటి పల్కె

అమ్మా నా మానస మిపు
డమ్మానిసిరేని మీద అంటి వదల దిం
కిమ్మాడ్కి చెప్ప నేటికి
బొమ్మా మరుచేతికీలుబొమ్మా సరగన్‌

ధనమేమి ప్రాతి నా కది
ఘనమే ఘనమేచక ప్రకట కచ వాడే
పెనుమేటి పెనిమిటి కదా
వినుమే నిక్కంబు విన్నవించెద తల్లీ

పెల్లు కల్లలల్లి బొల్లిమాటల చల్లి
మెల్లమెల్ల ఇల్లు గుల్లసేయు
తల్లికలుగు లంజె నుల్లోలమతి చేరు
పల్లవులకు సౌఖ్య మిల్ల జగతి

రమ్మంచును నమ్మించును
పొమ్మంచుం కోక లాకు పోకల్‌ రూకల్‌
క్రొమ్మించు సొమ్ము లెమ్మిం
తెమ్మంచును లాగు లంజె తెగి విటవరులన్‌

లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక
సరసపదార్థముల్‌ సంగ్రహించి
వృత్తభంగమునకు వెరపింతయును లేక
గణనిర్ణయనిరూఢి ఘనత కనక
అపశబ్దములకు రోయక సంధివిగ్రహ
ప్రాణహాని విచారపరత దక్కి
భావం బెరుంగక పండితోత్తములతో
కలయ నొల్లక మహాకపటమూని

యతుల పోనాడి మూర్ఖసంగతి వహించి
తిరుగు వెలబోటి జీవనస్థితి గణింప
కుకవి కృత కావ్య రూపానుగుణత పూని
అరసి చూచిన నిస్సారమగును పిదప

లంజెయును బీరకాయయు
ముంజెయు బాల్యమున చాల మోహము గొలుపున్‌
రంజనచెడి ముదిసిన వెను
కం చూడరు ముట్టబోరుగద నరులెందున్‌

పలువలు చెంతజేరి యొక పాతిక నేబులు చేతికిచ్చి ఛీ
మొలగల బట్టవిప్పి తగ ముందుగ పాన్పున నుండి వార లే
పలుగుదనంపు గూటముల బాధలు వెట్టిన నోర్చి పూనికన్‌
కులుకుచునుండు అప్పడుపుకూటి వెలంది కొలంబుపెద్దయే

పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు
వ్యర్థమాయా వచోవ్యసన రసన
శఠవిటోచ్ఛిష్టాది సదనంబు వదనంబు
పలు బొజుంగుల చొంగబావి మోవి
పల్లవభయద కృపాణులు పాణులు
కుటిలాఘవితతుల కోపు చూపు
కృత్రిమగుణగణ గేహంబు దేహంబు
షిద్గసంఘంబుల సెజ్జ బొజ్జ

పంచసాయక రోగ ప్రపంచ ఘోర
యాతనా దూయమాన ప్రయాత విటప
మదసలిల యుక్తమగు దోని మలపుయోని
కనుగొనగ వేశ్య హేయభాజనము కాదె

ఇట్టి వేశ్యాకులంబున దిట్టవైన
నీకు జనియించి యిన్నా ళ్ళనేక విటుల
పలుతెరంగుల బాధించి బహుధనంబు
గూర్చితిక నిప్పడుపుగూడు కుడువ నొల్ల

పట్టినని నన్ను దయ చే
పట్టి యతని తెచ్చి కూర్చి బహుభాగ్యంబుల్‌
గట్టిగ కొన నొల్లవయో
కట్టడివి కదమ్మ లేచి కడ కటు పొమ్మా

మాతా జామాత పయిన్‌
బూతులపాతరలు తీసిపోయుదు రటవే
ఖ్యాతా సద్గుణగణ సం
ఘాతా పూతా విలాస కలనోపేతా

చతురున్‌ పుణ్యజనున్‌ సదాగుణయుతున్‌ సౌందర్య శోభా సమ
న్వితునిన్‌ చింతలపాటి వంశ భవునిన్‌ నీలాద్రినామ ప్రజా
పతి నిట్లూరక నిందసేసెదవు నాపట్టూనలే కయ్యయో
మతితప్పంగద నేడు నీకు జననీ మాయామయోద్యోగినీ

ఏలాగున నైనను నే
నీలాద్రినృపాలు చేరి నెయ్యమెలర్పన్‌
లీలాలోలత నుండుదు
చాలును నీలంజెజాతి సంబంధ మికన్‌

అని తల్లిమీద కనలుచు
కనుగొనలను బాష్పవారి కడు వడి జారన్‌
చని నిజ శయ్యాతలమున
తను వొయ్యన చేర్చి యతని తలచుచు నుండెన్‌

అత్తరి చంద్రిని చిత్తజు
డత్తి మహోన్మత్త సాయకావళి క్రోధా
యత్తమతి నింప పెంపరి
పత్తచిరిగి సిండవిరిగి పడి మూర్ఛిల్లెన్‌

ఆర్చి పేర్చి మారు డారీతి నేచంగ
కూర్చి కూర్చి సాడు కార్చుకొనుచు
మూర్ఛ తెలిసి తనదు ముంజేయి యోనిలో
దూర్చి యతనిగూర్చి దుఃఖపడుచు

హా అతిసార సుందర తరాంచిత విగ్రహ! నిన్ను చూచి నే
నాయత మోహపాశ వశనైతిని సన్నకసన్న నిప్పుడే
డాయగ వచ్చి నా భగ తట స్ఫుట ఘట్టిత పంచసాయకా
మేయ శిలీముఖచ్ఛటల మీటి రమింపుము నీలభూవరా

వారస్త్రీలకు మెచ్చగు
మారుండ వటంచు జనులు మరిమరి యెన్నం
గా రూఢిగ వినియుందు ను
దార విరహతాప మార్చతగదే నీకున్‌

చూచినయప్పుడె పైబడ
చూచి మరులుకొంటి వారసుందరినగుటన్‌
నీ చతుర కార్యపద్ధతు
లేచొప్పున నొప్పు ననుచు ఎంతయు ప్రేమన్‌

వాచె మొగంబు భగంబును
నీ చరణము లాన యింక నీవిట నాకున్‌
గోచరుడవు కమ్ము వెసన్‌
రాచినృప కుమార వారరమణీ మారా

వలరాజు చేత యాతన
బలువయ్యెను తాళజాల ప్రత్యక్షుడవై
చెలిమిని రమింపు మిందున్‌
కులుకుచు నీలాద్రిభూప కోమలరూపా

చలమేటికి రాకొమరులు
బలువుగ చూడంగ నాదు పజ్జను వేగన్‌
కులుకొప్ప వచ్చి భగము ప
గల దెంగుము చండ్లుపట్టి కసి తీరంగన్‌

సొమ్ములు కోకలు రూకలు
తెమ్మని నిను చిక్కుసేయ; దీకొని ఖరబం
ధమ్మున దెంగుము వడిగా
నమ్ముము పెక్కేల వారనారీ లోలా

చలమేటికి రమ్మిక కో
మలరూప పిశంగనేత్ర మన్మథబాధల్‌
తలగంగ మనసు తీరగ
బలువుగ దెంగంగ నాదు పజ్జకు వేగన్‌

అని మహోన్మాదావస్థచే దేహస్వాస్య్థంబు లేక చీకాకు పడుచు దుర్గంధబంధురంబై గొర్రెముక్కు వలె అనవరతంబు ద్రవించు తన యుపస్థం జూచి యుపస్థతో నిట్లనియె

పమ్మినవేడ్క వ్రాతపని పావడ పైకెగదీసివైచి చొ
క్కమ్ముగ గుద్దక్రింద నొక కమ్ములదుప్పటి నెత్తు వెట్టి మే
ఢ్రమ్ము నిగుడ్చి లోనికి దడాలున అంచులుమోయ దూర్చి నీ
తిమ్మిరితీర వాడెపుడు తీకొని తాకునొ యో త్రికోణమా

ఎందరు పొందుగూడి విషయించిన నిర్ద్రవమై నితాంతమున్‌
కెందలిరాకు డాల్‌హొయలు కీల్కొన పొంగుచు దెంగుమంచు లో
కందక తీటతీరక వికాసతనొందెడు నీకు తృప్తిగా
మందుడు నీలరాజెపుడు మగ్గమువెట్టునో యో త్రికోణమా

ఆకా? పోకా? రూకా?
కోకా? మేకా? మరేమి కొనియిచ్చెను తా
నీకాతనితో నేపని
పూకా! యీకరణి నేల పొరలెద వయయో!

తురకల మొడ్డలు దూదేకు మొడ్డలు
గుల్లాపు మొడ్డలు గొల్ల మొడ్డ
లా బోయ మొడ్డలు అల కాపు మొడ్డలు
చాకలి మొడ్డలు సాలె మొడ్డ
లబిసీల మొడ్డలు పబువుల మొడ్డలు
బాపన మొడ్డలు భట్ల మొడ్డ
లింగిలీజుల మొడ్డ లీడిగ మొడ్డలు
పీంజారి మొడ్డలు బేస్త మొడ్డ

లెన్ని దూరించి దెంగిన నించుకైన
జడియకుండెడి దాన వాశ్చర్యమిపుడు
నీలనరపతి చచ్చుమొడ్డేల నీకు
కాంక్ష గైకోకుమో దోసకారి పూక!

త్రుళ్ళిపడియెదేల చిల్లిలోపల వాని
చుల్లవెట్టి నిన్ను గిల్లికొనుచు
అల్లిబిల్లి దెంగ నుల్లసిల్లెదవు నీ
రుల్లిపాయ చాయ గొల్లికాయ

అని మరియు మనోజాత నిశాత చూతసాయకవ్రాత ఘాత యాతనాధూత చేతోరవిందయై, కంది కుందుచు, కొందలంబందుచు, వైవర్య్ణంబు చెందుచు, పాన్పుపయి పడుచు, పొరలుచు, లేచుచు, వంగుండుచు, తొంగుండుచు, దెంగుండు దెంగుండనుచు, వ్రాలుచు, సోలుచు, ఉపస్థం జరచుకొనుచు, వ్రేలిడుకొనుచు, వెక్కివెక్కియేడ్చుచు, వెడవెడం గన్నులు తేలవేయుచు, విహ్వలించుచు, విసువుచు, విన్నంబోవుచు, వీణం బాణుల ముట్టక, బట్టకట్టక, బోనంబు మెసవక, సురాపానంబు సేయక, ప్రాతబొజుంగులం బలుకరింపక, సుడివడుచు, స్రుక్కుచు, అసురుసురనుచు, నడునెత్తి మొత్తుకొనుచు, ఆయాసంబు పొందుచు, ఆరాటంబునం గుందుచు, చింతించుచు, చేతులు పిసికికొనుచు, చిన్నబోవుచు, సీత్కారంబు సేయుచు, చిడిముడి వడుచు, చీకాకు నొందుచు, చెమ్మటలం దోగుచు, పలవరించుచు, పండ్లు కొరుకుచు, బైలు కౌగిలించుచు, పరవశం బగుచు, బెంగ కొనుచు, బిసరుహాంబకుం దిట్టుచు, బిరబిర శరీరం బెరుంగక మరుమందిరంబునం గిరికొని గాఢంబులై వంకరలై వరలు నిడుదసోగ హొరంగు మెరుంగు వెండ్రుకలు తెగలాగి పారవైచుచు, నలుదిక్కులు కలయం జూచుచు, నవ్వుచు “హా! నీలాద్రి నరపాలపుంగవా! వచ్చితే!” యని లేచి “నాకురువు పయిం గూర్చుండు” మనుచు, పరిపరివిధంబుల మతిదప్పి, వెర్రిగొనిన వేపి తెరంగున, ఆలి సాలెపురువు చందంబున, మగ్గంబులో నాడెడి నాడె కైవడి, మధుపానంబు చేసిన వానరంబు పోలిక, మావి కరుచు నక్క టెక్కున, పిడుగు మొత్తిన జనుని చందంబున, మూగ లాగున, ముల్లెపోయి పొరలు ముండ విధంబున, ముక్కుచు, మూల్గుచు, మురికిపిత్తులు పిత్తుచు, మూకుడువంటి మూత్రద్వారంబు మొగివిప్పుచు, ముడుచుచు, మొగంబు దిగవైచుచు, మూర్ఛిల్లుచు, తెలియుచు, మోహ దాహాతితాపంబునం దల్లడిల్లుచుండె; నయ్యవసరంబున

వేంకటసాని కిదంతయు
కింకరు లెరిగింప, దుఃఖకీలితమతియై
కొంకుచు కూతురి నును ప
ర్యంకము చేరంగబోయి హా హా యనుచున్‌

బిడ్దరో నీకు మునుపుండు అడ్డగరలు
పెక్కుమారులు తగిలిన స్రుక్కకీవె
మాన్పుకొంటివి యిటువంటి మమత నాడు
కలుగదయ్యెను వట్టి దుష్కర్మమొదవె

ఆరయ నీలనృపాలుని
పేరును పెంపేమి? అతని పెద్దలు మున్నే
తీరున నుండిరి? యీ సిరి
వీరాగ్రణి విజయరామవిభు డొసగె గదా!

ఇంతెకాని, జమీందారుడే యతండు?
పరమమూర్ఖుండు బహులోభి పాపచిత్తు
డాత్మదాసీ రతుడు వాని కాస చెంద
ఇహపరసుఖంబు లేదు నీదేటి వలపు

ఎదురువెట్టి వేడ్క చదరంగమాడెడు
పగిది నీకుగల్గు పడుపుగూటి
సొమ్మొసంగి చేరరమ్మన్న గైకొను
నట్టివాడు ముద్దుపట్టి వినుము

పండ్లు తోమడు గుదప్రక్షాళనము సేయ
డమవస నాడైన హరిదినంబు
నందైన కడు నూరపంది మాంసము లేక
కూడు భుజింపడు గురుముఖంబు
కాడు తమ్ముల చేరనీడు సత్కవులకు
వైశ్యుల పెండ్లిండ్ల వలన వచ్చు
కట్నముల్‌ తా దురాగ్రహమున లంకించి
లంజెల కిచ్చును లజ్జమాలి

వినయమున తండ్రి తద్దినమునను విప్రు
పిలిచి ఒక కాసు తవ్వెడు బియ్య మీడు
పతితుడును లోభి చింతలపాటి నీల
రాజు, ఛీ ఛీ అతనిమీద మోజదేల?

పూచిన శాల్మలీద్రుమము పోలిన లోహిత దీర్ఘ దేహమున్‌
కాచసమాన పీత రచి గ్రాలెడు కొంచెపు కన్నుదోయి జ్యే
ష్టా చపలాక్షి వ్రేలుడు విశాలతరాస్యము కల్గు వాని సం
కోచములేక చూచి వలగొంటివె వారవధూశిరోమణీ

సానులకు గబ్బిబెబ్బులి
పూని కనుంగొనిన వాడు పోనీడు గదే
హాని యొనరించు హా! రతి
కూన! సరగ పారిపొమ్ము కొట్టామునకున్‌

నల్లమందును గంజాయి కల్లు పోతు
పిచ్చుకల మెక్కి నిను వాడు పిత్త దెంగు
పత్త చినిగిన విడువడే పాపి వాని
దుడ్డువలెనుండు మొడ్డపై దుంగలెత్త!

కుత్తయు పత్తయు చినగగ
మొత్తును మత్తిల్లి నీదు మొడ్డకు దండం
బొత్తకుమని వేడిన విన
డత్తులువబొజుంగు వాని కాసింతురటే?

పాపి విను వట్టియాసలు
చూపియ్యడు డబ్బు లంజెసొమ్ము భుజించున్‌
పాపాత్ముడు పశుకర్ముడు
మాపని రేపని భ్రమించి మగ్గము వెట్టున్‌

పిచ్చలు వడివడి రాయగ
కుచ్చులు మెయ్యంగ వాడు గొనకొని తాకున్‌
గచ్చంత పగిలి సలుపుచు
చచ్చేవే చంద్రరేఖ సాంద్రసురేఖా

పెద్దల నెరుగడు మాటల
పద్దులు పచరించు గర్వి భామ కురతిలో
ఎద్దు వలె మెలగు నీకా
బుద్ధి వలదు మానుమమ్మ పుత్తడిబొమ్మా

ఖలుడైన నీలనృపు డీ
యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే నరసాంబా
గళ కలిత కనకమయ మం
గళసూత్రోత్కృష్ట మహిమ గాక కుమారీ

రొక్కమిచ్చెడు విటు జూచి దక్కినట్లు
తక్కుచును బొల్లిమాటల తనుపు; కాని
నిక్కముగ మానసంబీయ నిశ్చయించి
వారకన్యక యీరీతి వలచు నటవె?

ఎక్కడి నీలాద్రినృపుం
డెక్కడి యడియాస వలపు లివి కూడ వికం
గ్రుక్కినపేను తెరంగున
కిక్కురుమనకుండ చనుము గేహంబునకున్‌

అని వినయ విస్రంభ గంభీర సంరంభంబులు గుంభింప పలుక, నచ్చిలుకలకొలికి కంతకంతకు వింతవింతలుగ దురంత నితాంత విప్రలంభ వేదనాభరంబు భరింపరాకుండ కరంబు దళంబుగా పరవశత్వంబు నొంది మారుమాటాడ నోడి, ఓడిన కోడి చందంబున తల వ్రేలవైచుకొని, కదల మెదల నేరక కన్నులు మూసికొని, ఊరక శరీరంబు నీరు విడువ శయ్య నొయ్యన వ్రాలి తూలం కనుంగొని బెంగను లొంగి దుఃఖాంభోధి మధ్యంబున మునింగి కన్నీరు లేరులై పారి వెల్లివిరియ డిల్లపడి తల్లడంబున నుల్లంబవియ మెల్లమెల్లన నప్పల్లవ మనోభూతంబున కాతతగతి చల్లనిపనులు సేయందలంచి తన దాసికాజనంబులుం దానును దాని నిజశయ్యాతలంబునం జేరి

భగమధ్యమున మంచిచిగు రుప్పు కూరించి
పై కొండనల్లేరు ప్రస్తరించి
లంబ స్తన ప్రదేశంబున రేవడి
దూలగొండి చిగుళ్ళు గీలుకొలిపి
కన్నులలోన నర్కక్షీరములు నించి
ముక్కుగూండ్లను ఆవముద్దలుంచి
వీనులలోపల వేడినూనియ పోసి
నాలుక జెముడుపాల్‌ చాల పొడిచి

మేన రాసున్న మెంతయు మెత్తి, నెత్తి
గొరిగి, నిమ్మపులుసు గంట్ల గ్రుమ్మి, లోని
కిముడ నేపాళము లొసంగి యిట్లు శిశిర
కృత్యములు సేయ, అప్పు డక్కితవ వనిత

బడబడ పిత్తులు పిత్తుచు
బడిబడి బహుభంగి మీర పారుచు మరి తా
నొడలెరుగక పెనుమూర్ఛం
కడు సోలగ తల్లి కాంచి కటకటపడుచున్‌

వేంకటసోమయాజి కిది వేగమెరుంగగ చెప్పకుండినన్‌
కింకవహించి దుఃఖపడు కేవల మాతడె దీని కన్నవా
డింకిట నుండనేల యని యేడ్చుచు నాతని చేరి యంతయున్‌
జంకక చెప్ప నాతడును సంభ్రమ దుఃఖ భయార్ద్ర చిత్తుడై

వెర్రిలంజెవు, కాకున్న విషమబుద్ధి
శిశిరకృత్యము లీరీతి చేతు వటవె?
చల్లయును అన్నమును బెట్టి నల్లమందు
లోనికిప్పించి చేయింపు తానమిపుడె

ఈచందంబున చేసిన
ఈ చిన్నది బ్రతుకు నిపుడు నిక్కము దానిం
చూచెదనన క్రతు వూనితి
ఈ చోటుం దరలిరాగ నిది చెడునుకదా

చన్నుల చందనం బలది జానులనంటి చిగుళ్ళు కప్పి వా
ల్గన్నుల కప్పురంపు కలికంబిడి బాహువులందు పొందుగా
తిన్నని తూండ్లు చుట్టి నునుదేనియ మోవిని చిల్క వేగమే
చిన్నది తెల్వినొందు నిక చిత్తములో వగబూన నేటికిన్‌

అది లెస్సగ నున్నంతట
ముదమున నీలాద్రిరాజు మోహంబున నీ
సదనమున కరుగుదెంచును
పదపడి మన కిరువురకును భాగ్యము లిచ్చున్‌

వస్తాడు నీలభూపతి
తెస్తాడు ధనంబు నీ కతిప్రమదముగా
నిస్తాడు విరహవేదన
చస్తాడా? నమ్ము మదిని సందియ మేలా?

అనుచు తెలియజెప్ప నామోదహృదయయై
సరగ నరిగి యట్లు సలుప చంద్ర
రేఖ రేగుబువ్వు వైఖరి తెల్విచే
వలపు గులకరింప నలరుచుండె

నీలాద్రి నృపుండచ్చో
సోలుచు విరహానలార్తి స్రుక్కి వగచుచున్‌
జాలింబొందుచు నేడ్చుచు
వాలారుచు నింక నేటి వలపనుకొంచున్‌

దాని జానగు యోనిలో నటింపని మహో
ద్దండ దర్పిత కామదండమేల?
దాని కోమల సుధాధరము గ్రోలని మధు
రసరుచి వ్యాలోల రసనయేల?
దాని లంబస్తన తాడనం బబ్బని
వర కవాటోపమ వక్షమేల?
దాని జానుయుగ మర్దనము సేయని దీర్ఘ
దర్వీసమాన హస్తంబులేల?

దాని నిర్భర మధు మదాహీన దేహ
గాఢ పరిరంభ సంభోగ కలన లేని
భూరి విస్తార శాల్మలీభూజ తుల్య
పుష్టియుత ఘన మద్దేహ యష్టి యేల?

దానిని మక్కువ తొడపై
పూని కనుంగొనని రాజబోగం బేలా?
యీ నెరవయసేలా? యని
మానని చింతాభరమున మరుగుచు మరియున్‌

చందురుకావి పావడయు సైకపుబంగరువ్రాత చీరయున్‌
ముందల కుచ్చుగచ్చు తెలిమొగ్గల కంచెలమించు చేమపూ
గుందనపుం గడేలు వగగుల్కెడి క్రొమ్ముడి పట్టుబొందు సొం
పందెడు దాని మేని సొబగద్దిర నామది కొల్లలాడెడిన్‌

అని దురంత చింతాక్రాంత స్వాంతుండై

గ్రుడ్లు త్రిప్పును పండ్లు కొరుకును మూల్గును
నీల్గును మిగుల కన్నీరు నించు
అసురుసురను పింగుపిసికికొనును నోరు
మోదుకొనున్‌ లంజెముండ యిచటి
కేల వచ్చెను దాని నేలచూచి విరాళి
చెందితి ననుకొను చెడితి పడితి
నెవ్వరి పంపుదు నేరీతినదివచ్చు
యేమి సేయుదు దైవమిట్లు వెతల

పాలుగా జేసె సాటి నృపాలకోటి
లోన నగుబాటులయ్యె కాలూనరాని
విరహ పరితాప భరమున వేగ తరమె
అంచు పలవించు తలవంచు నార్తిగాంచు

తములంబు తినడు బోగమువారి నాడింప
డన్నంబు కుడువడు సన్నవన్నె
కోకలు కట్టడు కొలువు కూర్చుండడు
జలకమాడడు గందమలదుకొనడు
వేపులతో తాను వేటకు పోవడు
నడుపుకత్తెల కూడి నవ్వుకొనడు
వేంకటమఖి యజ్ఞవిధి కనుంగొనడు భా
గవతుల వేషవైఖరులు కనడు

కటకటా చంద్రరేఖా వికట కటాక్ష
వీక్షణాక్షీణ వాతూల విజిత దేహ
బాలభూరుహు డగుచున్న నీలనృపుడు
పరవశత లేచి వన లతా తరుల చూచి

కమ్మవిలుకాని తూపన
అమ్మఖశాలాంగణమున అగపడి చనె నో
యుమ్మెత్తకొమ్మ! నీవా
క్రొమ్మెత్తనిమేని సానికొమ్మం గనవే

వింటివొ లేదో శునకపు
దంటెము వలె బిర్రబిగిసి తలగని వలపుం
గొంటిని కనినది మొదలుగ
తంటెపుమోకా! యిదేమి తబ్బిబ్బో కా?

కప్పువిప్పు కలుగు గొప్ప కొప్పలరారు
అప్పొలంతి చొప్పు త్రిప్పు కిప్పు
డొప్పుమీర మీరు చెప్పరే గుప్పున
మెప్పులిత్తు నుప్పితిప్పలార!

మీరింద రొకటియై పొలు
పారం దిటమూన పల్కి యతిరయమున నో
కోరింద డొంకలారా
సారేందుముఖీలలామ జాడ తెలుపరే

మారార్తి నెంత వేడిన
మా రాకడ తెలియజెప్పి మారాడక యో
జోరీగలార మీరా
నారీరత్నమును తెచ్చి నాకొసగరుగా

చింతలనాటి కులీనుడ
చింతాసంతాప చలితచిత్తుడ నిను నే
చింతామణిగా నెన్నెద
చింతా! అక్కాంత తెరువు చెప్పుము నాకున్‌

వ్రణకిణాంకిత యోని గణికాలలామ నా
లోకింపరే తుమ్మ మ్రాకులార
తుంబీఫలసమాన లంబమానోరోజ
పొడగానరే పట్టకడుములార
యింగాళకంబళ శృంగారతర కేశ
పాశ నీక్షింపరే పాశలార
క్రకచదంష్ట్రాంకురాగ్ర మృదుత్వ సంయుక్త
దేహ కానరె తిప్పతీగలార

ఉష్ట్ర రదన చ్ఛదోపమానోష్టబింబ
నీడ చూడరె మీరు జిల్లేడులార
మర్దళసమాన విపరీతమధ్య చంద్రి
కాంచరే నిక్కముగ నేడు కారలార

పోడులమ్రోడులార కడు పూచిన పీతిరితుమ్మలార బల్‌
బాడిదచెట్టులార ఫలభాగ్‌ విషముష్టికుజంబులార ఆ
వేడుకకత్తె చిత్తమున వేడుకమీరగ వేగిరంబు మీ
నీడకు నీడకొక్కసరణిం పరతెంచదుగా వచింపరే

బెండా మూర్కొండా యా
దొండా మీ అండకిపుడు తోరముమీరన్‌
తాండవమాడుచు మేలిప
సిండందెలచంద్రి రాదె చెచ్చెర చెపుడా

నాకెదలోపల విరహము
చీకాగుగ చేయజొచ్చె చెచ్చెర నిపుడో
కాకీ ఘూకీ కేకీ
పూ కీదగుమేనిసాని పొడ చూపరుగా

కృకవాకులార మాద్య
త్కృకలాపములార గవయ కిశ శశ శునీ
వృకజాతులార బోగపు
సకియ లతల మిన్న చంద్రిసానిం కనరే

ఉరు తాప కరణ కారణ
వర తామరసాశుగములు వైచి మరుడు వి
స్ఫురితాంగి చూపుమిపు డో
యురుతా మామాట సేయనొప్పిన కొరతా

పందీ నీ గాత్ర సదృక్‌
సౌందర్య కళావిలాస చంచన్మురజి
న్నందన మందిర యగు ఆ
ఇందీవరపత్రనేత్రి నిటు చూపగదే

నీతీరు కలుగు రూపము
చేతన్‌ విటకోటి నవయజేయుచు కడకన్‌
పాతరలాడెడి పడుపుం
గోతిని వీక్షించినావె కోతీ ప్రీతిన్‌

కల్లు కడు త్రావి ప్రేలుచు
హల్లీసకమాడుకొనుచు అది ఇచ్చటి కు
ద్యల్లీల రాదె బల్లీ
పిల్లీ కడుముద్దుజిలుకు పిల్లలతల్లీ

నీలాద్రిరాజ నాముడ
వాలెంబున దానిజూచి వలచితి నేడా
స్థూలోపస్థాన్విత గణి
కా లలనన్‌ చంద్రరేఖ గంటివె ఖరమా

అని మరియును

మనసిజమాయలం దగిలి మ్రాకుల తుప్పల పక్షిజాతులన్‌
వన మృగకోటులం దలచి వారక యీగతి వేడి వేడినీ
రు నయనపాళి జాలుకొన రోదనమెంతయు చేసికొంచు పూ
చిన విషముష్టి భూరుహము చెంగట నీలశిలా తలంబునన్‌

చేరి కళేబర మచ్చో
చేరిచి హా చంద్రి నాకు చెప్పక పరవం
కారణమేమి మరెవ్వని
కోరిక తీర్పంగ తలచుకొంటివొ చెపుమా

కోకలు రూకలు ఆకులు
పోకలు మేకలును పట్టుబొందులు సొమ్ముల్‌
నాకంటె మిక్కిలీగల
రాకొమరుడు కలడె ఈ ధరావలయమునన్‌

చక్కనివాడ రభసమున
కుక్కుట మార్జాల శునక కూర్మ రతులచే
చొక్కింపంగల వాడను
చిక్కులువెట్టంగ నీకు చెల్లునె చంద్రీ

రమ్మా నా యభిమత మిపు
డిమ్మా యిమ్మాడ్కి నేచనేటికి హొన్నుల్‌
కొమ్మా సమ్మతినిచ్చెద
కొమ్మా వెలముద్దుగుమ్మ గుబ్బలగుమ్మా

జాలముచేసి మారశరజాలము పాలుగజేయ నాయమా
తాళగజాల నీవిరహతాపభరంబు కరంబు హెచ్చె నీ
తాళఫలోపమాన సముదగ్ర కుచద్వయ మక్కుజేర్చి లీ
లా లలితోపగూహన కళాకలనన్‌ సుఖియింపజేయుమా

శోషించెన్‌ మదనోపతాపమున అక్షుద్రోన్నత స్థూల ని
ర్దోషోద్యత్‌ తనుయష్టి పుష్టిగను మందుల్‌ చేసినన్‌ కాదహో
రోషంబూనక నే డపారకరుణా రూఢాత్మ పంకేజవై
యోషిద్రత్నమ చంద్రి నీ అధరపీయూషంబు నాకీయవే

పెక్కుతెరంగుల నీకున్‌
మ్రొక్కెద చలమేల నాదుమోహము తీరన్‌
చక్కెరవిల్తుని కూటమి
మిక్కుటముగ తేల్చి ఏలుమీ దాసునిగాన్‌

మేలెంచెద సామ్రాజ్యం
బేలించెద తొంటిసతుల యెల్లరకంటెన్‌
లాలించెద పాలించెద
తేలింపుము రతుల నన్ను తేకువ మీరన్‌

చక్కెరవిల్తుని బారిన్‌
చిక్కితి నీ పాదయుగ కుశేశయములకున్‌
మ్రొక్కితి దక్కితినిక నీ
తక్కులు దిగద్రొక్కి నన్ను దయచూడగదే

గంధ మత్తరు జవ్వాది కస్తురియును
దొడ్డయొడ్డాణమును కమ్మదోయి క్రొత్త
పట్టుచీరలు కుచ్చులు బావిలీలు
రొక్కమిదె కొమ్ము నీ లంజెటక్కు మాని

తాళజాలను నీవింత జాలమేల
చేసెదవు నన్ను మిక్కిలిచెలిమి రతుల
నేలుమీ వేగ మాటాడి ఫాలలసిత
సరస నవచంద్రరేఖ ఓ చంద్రరేఖ

తియ్యని మొద్దుమాటలును తేనియగారెడు బొల్లిమోవియున్‌
పయ్యెదకొంగులో పొదలు బల్‌చనుగుబ్బలు మంగలంబుతో
కయ్యముసేయు మోము నులికన్నులు తోరపుకౌను నాకు చూ
పియ్యడ మారుకేళి కడు నేలుము జాలముసేయ కింతయున్‌

అమలంబై తరుణారుణ ద్యుతిసమేతాశ్వత్థపత్రాభమై
రమణీయ స్ఫుట దీర్ఘ లింగయుతమై రంగద్ద్రవోపేతమై
సమమై రోమవిహీనమై వెడదయై జానొప్పు నీ మారగే
హము నా కర్మిలి చూపి ప్రౌఢరతి నోల్లాడించు చంద్రీ దయన్‌

అని మరియును

హా యను చంచరీక నిచయాంచిత కుంచిత రోమ కామగే
హా యను దాన మానిత మహాద్విప మోహన మోహనైక బా
హా యను కంక కాక మహిషాశిత దుర్భర నిర్భరాతి దే
హా యను చంద్రి తాళనహహా యను భీతశిరోరుహా యనున్‌

డా యగరాకు నన్ను మరుడా యను ఏచగనేల రిక్కరే
డా యను వద్దువద్దు చనుడా యను సోకకపొమ్ము గాలిపీ
డా యను చంద్రితల్లి వరడా యను వేంకటశాస్త్రి నేడు రా
డా యను కూతు కూర్ప తగడా యను ఏగతి దేవుడా యనున్‌

ఆకరణి నుడివి డేరా
మేకువలెన్‌ బిర్రబిగిసి మిట్టిపడు నిజా
స్తోక సుమకామదండము
చేకొని చీకుచును బుద్ధి చెప్ప దొడంగెన్‌

చాపలమోపు చంద్రి నిను చక్కగ చక్కెరవింటిదంట పెన్‌
కాపురపింటిలోపలికి గ్రక్కున దూరి సుఖింపకుండ సం
తాపమొనర్చి యేగెనటు తాళుమటన్నను తాళకేల యు
ద్యాపనశక్తి చూపెదవు దండము నీకు మనోజదండమా

గచ్చులు మచ్చు లచ్చెరువుగా కడలన్‌ వెదజల్లు చంద్రి బల్‌
పచ్చని రెక్కదోయిగల పక్కిహుమాయివజీరునింటిలో
చొచ్చుచు వచ్చుచున్‌ మిగుల చొక్కుచు క్రీడ యొనర్చుచుండగా
నిచ్చలు తృప్తిచేసెదను నిల్వవె కొంచెముసేపు దండమా

పెక్కుతెరంగులం కరనిపీడన మే నొనరించి వంచినన్‌
స్రుక్కక మిట్టిమిట్టి తలజూపుచు సన్ననిపంచె చించుచున్‌
మొక్కలపాటు చూపెదవు మున్ను త్రికోణము లెన్ని చూపితిన్‌
మ్రొక్కెద నిక్కుమాను మతిమూర్ఖ మనోభవదీర్ఘదండమా

కాయలుకాచె నీదు తలకాయ యహా సుకుమార వార క
న్యాయత కచ్ఛపోపమ భగాంతర నిత్యగతాగత క్రమో
ఛ్రేయ సమగ్ర ఘట్టన విశేషతరాపద నైన నింక నో
కాయజదండమా విసువుగైకొని యూరకనుండ లేవుగా

పంకములంటె నాకు బహుభంగుల నీకతనన్‌ విలాసవత్‌
పంకజపత్రనేత్రలను బల్మిని పట్టగ తద్విశాల మీ
నాంకగృహాంతరాళ భరితాత్మజల ప్లుత పాంశు సమ్మిళత్‌
పంకము నీకు నంటె గద పాపపుమేఢ్రమ యిట్లుసేతురే

ఎందరి వేడుకొంటి మరియెందరి పాదములంటుకొంటి ము
దెందరినాశ్రయించితి నికెందరికిన్‌ ప్రణమిల్లజేసెదో
కొందలమందెడిన్‌ మనసు గొబ్బున నా మనవాలకించి యా
బందెలమారి చంద్రి భగభాగ్యము కోరకు మారదండమా

కమలపత్రస్ఫూర్తి కనుపట్టు భగములు
మించుటద్దమ్ముల మించు భగము
లశ్వత్థ పాండుదళాకార భగములు
పనసతొనల పోలు ఘనభగములు
దింటెనపూవులవంటి భగంబులు
ఈతగింజలరీతి నెసగు భగము
లల పందిముట్టెలవలె నుండు భగములు
కాకిపిల్లలనోళ్ళగతి భగములు

పెక్కుజూపితి నీవును నిక్కుకొనుచు
అన్ని లొడవెట్టి వెడలితివకట యిపుడు
చంద్రిభగమేమి భాగ్యమా సైపుమా ము
డుంగులింగమా చాలపొడుంగు మాని

తులువలు వడివడి తాకగ
లలి చినిగిన పూకు దెంగులకు వెరచునె నీ
తల బ్రద్దలగును దానిం
తలచి నిగుడబోకు మదనదండమ యింకన్‌

కొంకేది బానిసగుడిసెలు దూరుట
పరికించి చూడ నీకొరకు కాదె
బత్తిని దొమ్మరితొత్తుల నిల్పుట
గొనకొనియున్న నీకొరకు కాదె
గోడిగలను గొనిగూడుల కట్టుట
కొంచకెంచంగ నీకొరకు కాదె
బాలవిధవలకు నోలి మాన్యములిచ్చు
టరసి చూడంగ నీకొరకు కాదె

వారకన్యకలకు నే నవారితముగ
కోకలును రూకలిడుట నీకొరకు కాదె
కూళతనమూనుటెల్ల నీకొరకు కాదె
ఓ మకారోత్వమా శాంతమూనుకొనుమ

తేనియకంపు పెంపు గల తేజము ఝల్లున పెల్లువారగా
గోనెలలీల తేరు చనుగొండలు సిండయు తాండవింపగా
గానుగరోలు పోలు మెయి కంపిల పైకొని మేఢ్రదండమా
దాని పకారగొమ్ము వెడ తాకగ వ్రక్కలుసేయు టెన్నడో

కుక్కుట చూళికా భగనగొల్లి నఖంబులగిల్లి మెల్లనే
చొక్కపు మన్మథాలయము చుంబనమెంతయు చేసి దానిలో
గ్రక్కున మోవి దూర్చి వగ గైకొని పీల్చిన చంద్రి మిక్కిలిం
జొక్కి రమింపనిచ్చు గద సొంపుగ నో లవడా తడాలునన్‌

ఆ భూతాకృతి చంద్రి సాంద్రతర రోమాంచత్రికోణంబులో
ఆభోగ స్ఫుట చండ తాండవ మహావ్యాపార కేళీకలా
లాభంబందెద నంచు నిక్కి ననునేలా సారె గారించెదో
శేభస్తంభమ దాని పొందెటువలెన్‌ సిద్ధించు నీకిత్తరిన్‌

గొల్లెనకంభమంత నిడుగొల్లి చొకారపు నల్లతీగెల
ట్లల్లికగొన్న రోమములు అద్రిగుహోపమమౌ బిలంబునన్‌
తెల్లని కొర్రగంజి పస మించు ద్రవంబును కల్గు చంద్రి మా
రిల్లెపుడీవు సొచ్చెదవొ హెచ్చరికన్‌ బహుదీర్ఘశిశ్నమా

నీచతకోర్చి బంధుజననిందకు రోయక తొల్లి గార్దభిన్‌
చూచియు నీవు మిట్టిపడజొచ్చిన నీ చపలంబు తీర్పగా
లోచితవృత్తి గైకొనియు ఒద్దికమీరగ దాని యోని దూ
రించినవాడ కాదె నిను రిత్తగజేయక నాదు మేఢ్రమా

వినువిను వద్దువద్దు అవివేకము పూనకు చంద్రిపూకుపై
మనసిడకంచు చెప్పినను మానక మిట్టిపడేవు చొచ్చినన్‌
ఘనమగు పుండ్లునున్‌ సెగయు గడ్డలు నంటి చెడేవు మానుమీ
అనుపమరూపనిర్జిత మహాగజదండమ మారదండమా

ఇట్లనేక ప్రకారంబుల మనోవికారంబుచేతం చేతనాచేతన జ్ఞాన విహీనుండై యా నీలాద్రిరాజన్యశతమన్యుం డుద్దండంబుగ దండనుండి గండుకొనివచ్చు కుసుమాయుధవిధు మలయాచలసమాగతవాత పోత మధువ్రత పరభృత కీర శారికావారంబుల గురించి దూషింపం దొడంగె

మదనా మదనాశుగచయ
మదనా చెలరేగి యేయ నాతత శశభృ
ద్వదనా మృదులోపస్థా
సదనా యెద నాటెనిపుడు శంబరమథనా

సకలపూరుష హృదయార్తి సంఘటించు
సాని నీ చంద్రరేఖాభిధానమూని
కేరుచున్నది దానిపై కినుకమాని
తద్విరహి నన్ను నేచంగదగునె చంద్ర

ఫణిరోమరేఖ యగు న
గ్గణికాంగన మీద పోవగావెరచి సమీ
రణమా మము నేచగ కా
రణమేమి తలంగు సత్వరత సద్బుద్ధిన్‌

మిమ్ము జయించు మించుగల మేలి నునుం బెనుగొప్పుచేత నే
మమ్ము మనోభవ ప్రకట మార్గణజాలము పాలుచేసి తా
కిమ్మనకేగె దానిదరి గేరరు చంపకగంధి యంచునో
తుమ్మెదలార మీరిచట త్రుళ్ళెదరక్కట శౌర్యహీనులై

ఆ వెలపొలంతి కని నే
కేవల విరహార్తిచేత కృశియించెడిచో
నీవు చెవుల్‌ చిందరగొన
కోవెల కూయకుము నిన్ను కొరుతన్‌ వేయన్‌

పరపురుషార్థం బంతయు
హరియించును నేచు చంద్రి అంచితబింబా
ధరమాని సుఖింపక త
త్పరవశు నను నేచనేమి ఫలమగు చిలుకా

అని అనివార్యమాన మదనాపదచే సకలప్రపంచమున్‌
తనువును పేరునున్‌ మరచి తన్మహనీయ వియోగవార్ధిలో
మునుగుచు తేలుచున్‌ పరమమూర్ఖతచే పలవించుకొంచు అ
జ్జనవరపుంగవుండు కడు సత్వ్తము పెంపుదొరంగి మూర్ఛిలెన్‌

అనుచు శ్రీ నంబి నారసింహార్యవర్యు
డానతిచ్చిన శివభూసురాగ్రగణ్యు
డైన వీరన విని అద్భుతాత్ముడగుచు
పిదప కథ చెప్పు డతులిత ప్రీతి ననుడు

మారాకారా కారా
గారాంతర విహరణోగ్రకర్మఠ పారా
వారావృత ధరణీతల
వారవధూజాల నిత్యవర్ణితశీలా

హరిగుణగణఖేలా అంగజవ్యాధిలోలా
పరిచితవిటజాలా బాలరండానుకూలా
నిరత రచితజాలా నీచదాసేయపాలా
దురితచయవిశాలా దుర్గుణౌఘాలవాలా

ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్ష ణానుక్షణ సంలబ్ధ సరసకవితా విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశభాషా విశేష భూషితాశేషకవితా విలాసభాసు రాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ బహుళప్రబంధ నిబంధనబంధురవిధాన నవీనశబ్దశాసన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపంబను హాస్యరసప్రబంధరాజంబునం ద్వితీయాశ్వాసంబు సంపూర్ణము.

తృతీయాశ్వాసము

శ్రీరతిసతీ మనోహర
చారుతర గృహాయమాన శష్పావృత వి
స్తారభగాన్విత చంద్రీ
నీరంధ్రాశేవ్యలోల నీలనృపాలా

ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండైన వీరభద్ర భట్టారకేంద్రునకు శ్రీమద్వైఖానస వంశోత్తంసంబగు నరసింహాచార్యవర్యుం డవ్వలికథ యిట్లని చెప్పందొడంగె

అంతట పటఘటిత గృహా
భ్యంతర మహిషానుపుష్ప బంధుర బలవ
ద్దంతయుత శయ్య నమ్మహి
కాంతుడు లేకున్న దాసికలు డాసి కడున్‌

కళవళమందుచు మనమిట
గొలగొలమనుకొంచు చుట్టుకొని యుండగ కో
మలగతి నేడకు చనెనో
తెలియదహా దైవమాయ తీరెట్లగునో

పిక్క లూరులు కాళ్ళు పిల్లసేవకులచే
గ్రుద్దించుకొనుచుండె కొంతసేపు
పాటకుల్‌ పరతేర పాడించుకొంచును
కొల్వుదీరిచియుండె కొంతసేపు
హితవుమీరగ భాగవతుల మేల్వేసాల
వింత కన్గొనుచుండె కొంతసేపు
మద్దెలమ్రోయంగ గుద్దతిప్పుచునాడు
ఇంతి కన్గొనుచుండె కొంతసేపు

మంచమెక్కి యొక్కతెతోడ మదనకదన
మెంతయును చేయుచుండెను కొంతసేపు
తమలము మెసంగి పొగచుట్ట త్రాగె కొంత
సే పతం డంత నెందేగె చెప్పరమ్మ

ఏలంజె యింటికేగెనొ
ఏ లీలావతిని బలిమి నెనయించెనొ తా
నేలాగు మాయమయ్యెను
నీలాద్రినృపుండు కామినీలోలుడహా

వేంకటశాస్త్రుల యజ్ఞము
పొంకము చూడంగ లేచిపోయెనొ లే దా
వంక పులి మ్రింగిపోయెనొ
జంకయ్యెడి చెప్పరమ్మ జవ్వనులారా

ఇందు తా వెల్వడి యెందు వేంచేసెనో
మాసామి చూపరే మ్రాకులార
సన్నకసన్న నే సకి గూడియుండెనో
మా రేని చూపరే మద్దులార
వేపుల పట్టుక వేటకు పోయెనో
మా దొర చూపరే మడుగులార
ఇందర భ్రమియించి యేటికి పోయెనో
మా రాజు చూపరే జారులార

మమ్ము నేలిన నీలాద్రిమనుజవిభుడు
పూలపాన్పున పెనునిద్ర పోయిపోయి
లేచి ఒక్కరుడును మాకగోచరముగ
ఎచ్చట నడంగె చెప్పరే పచ్చులార

ఎల్లీ మల్లీ పల్లీ
పుల్లీ మా రాజుకూసుపోవక మీమీ
గొల్లెనకై రాడుకదా
కల్లలు వలదింక చెప్పగదరే వేగన్‌

నేలరేడులార మంచినేస్తులార విక్రమా
భీల శూరులార పిన్నపెద్దలార గుప్పునన్‌
పూలపాన్పుడిగ్గి యేడ బోయినాడొ చూడరే
నీల కాశ్యపీవరుండు నిన్నరేయి ఒక్కడున్‌

అని గగ్గోలుగ వారు రోదనము సేయన్‌ నాయకుల్‌ గాయకుల్‌
చనవర్లున్‌ గణికాజనంబు లనుజుల్‌ సామంతులున్‌ మంత్రులున్‌
విని శోకాకులచిత్తులై కదిసి తద్వృత్తాంతమాలించి ఆ
యన నన్వేషము సేయబోయిరి సమీపారణ్యమధ్యంబునన్‌

గట్టుల దరి పుట్టల కడ
చెట్టుల చెంగటను చెరువు చెంతల బలు పె
న్గుట్టల సందుల గొందుల
పట్టుగ ప్రవహించు ఏటిపల్లములందున్‌

రోయుచు హో యని కూకలు
వేయుచు హా నీలభూప విస్మయముగ నీ
వేయెడ కేగితొ వెస రా
వే యనుచును మోదుకొనుచు విహ్వలులగుచున్‌

మూగి అరయంగ ఆతని
తో కూడంజనిన వేట తోరపుకుక్కల్‌
సైగలు సేయుచు సాగగ
ఆ గతి కని చనిరి వారలందరు వెంటన్‌

చని కనిరి చంద్రరేఖా
తనురూపవిలాస వహ్ని దగ్ధశరీరున్‌
ఘన చింతాభారున్‌ నూ
తన జనిత దశావికారు తన్నృపమారున్‌

ఇట్లు కనుంగొని సకలపరివారంబు లతనిం జుట్టుకొని యాక్రందనంబు సేయుచు నాశ్చర్య ధుర్య మానసంబుతో నిట్లనిరి

వాతము పట్టెనొ వని పెను
భూతము కొట్టెనొ మరెట్టి పొడ కుట్టెనొ హా
హా తెలియ దేమి మాయయొ
ఈతడు పడియున్న చంద మెంచి కనంగన్‌

బహుళ ద్విజద్రవ్య భక్షణోద్భవ మహా
పాతకంబున నోరుపడియె నొక్కొ
కవిమాన్యహరణ దుష్కర్మ ప్రభూతాతి
కలుషంబుచే జిహ్వ పలుకదొక్కొ
పరసతీవ్రత భంగకరణప్రభవ పంక
గతి దుర్బలాంగంబు కదలదొక్కొ
సుజనుల చెడజూచు చూడ్కి చుట్టిన కొల
గడు కనుంగవ మూతవడియె నొక్కొ

నిరత నిజదాసికాజన నికరములను
బలిమిమై పట్టపగ లింట పట్టి మిగుల
సమరతుల తేల పొడము దోసమున నొక్కొ
నీలనరనాథు డిట్లొంటి కూలినాడు

అని మహాదుఃఖావేశంబున అందరు నిట్లనిరి

కొలువు తీర్పవదేమి గురుతర తరుసార
భాసుర లక్ష్మీవిలాసమునను
కూర్చుండవదియేమి ఘుమ ఘుమామోద గుం
భిత సుచందన కాష్ఠపీఠమునను
తేరిచూడవదేమి దృఢతర లావణ్య
గణ్య పణ్యస్త్రీ నికాయములను
పలుకరింపవదేమి బహువేష భాషాతి
బంధురాశ్రిత బాలభాగవతుల

నకట నీలాద్రిరాజ భోగానురక్తి
మాని ఈ ఘోర కాంతారమహిని పండ
కారణంబేమి ఏరిపై కాకపూని
తెగి యిటకు వచ్చి యిట్లు నిద్రించెదిపుడు

కేళీభవనాంతర పరి
కీలిత మల్లీ లతాంత కేవల శయ్యా
లోలుడవై యుండక ఈ
నేలపయిం పండనేల నీలనృపాలా

విజయరామ క్షమావిభుడు పిల్వగ పంచె
రాచిరాజ కుమార లేచిరమ్ము
ఎరుకువాడిదె పందినేసి మాంసము తెచ్చి
కాచుకయున్నాడు లేచిరమ్ము
వేటకుక్కల కాన్కవెట్టి పంపిరి దొరల్‌
చూచివత్తువుగాని లేచిరమ్ము
కొత్త పారావారు కొలువంగవచ్చిరి
రాచయేనుగుగున్న లేచిరమ్ము

దాసి యొక్కతె నీపొందు కాసచెంది
వాచియున్నది విషయింప లేచిరమ్ము
సలుపు గొల్పెడి పుండ్ల బూచులకు మందు
రాచికొన నీలనృప వేగ లేచిరమ్ము

అని మరియును

కదలడు పలుకడు ధాతువు
పద కరముల నుండ చూచి బ్రతుకునొ లేదో
బెదరక చెప్పు మదెట్లు
న్నదొ యీతని కో ముడుంబినరసాచార్యా

అనిన ఆతండు దగ్గర కరిగి ధాతు
గతి పరీక్షించి యితనికి కామరోగ
మంకురించిన దిక మీరు జంకుమాని
సరగ శిశిరోపచారముల్‌ సలుప లేచు

అని చెప్పిన వారందరు
జనితామోదంబుతోడ చల్లని పను లే
పున చేయగ సమకట్టిరి
మనుజాధిపు చెంతచేరి మక్కువమీరన్‌

పసుపును నూనెయు కరపద
బిసరుహముల రాచి విసము పిండి శిరమునం
దిసుమంత గొరిగి వడినిడి
వెస చెవి వెల్లుల్లి ఊద వేగమె తెలిసెన్‌

తెలిసి ఉస్సురనుచు నలుదిక్కులను చూచి
సైగసేయ వారు చల్లగంజి
వంటకంబు పిసికి వడిపోయ మెల్లన
గుటుకుగుటుకురనుచు గ్రోలి సోలి

తెప్పిరి కూర్చుండి అతం
డప్పుడు తన చందమెల్ల ఆప్తులతోడన్‌
గుప్పున ఏకాంతంబున
చెప్పిన విని లంజె యెంత చేసెనటంచున్‌

బొకనాసి, గడ్డ, సెగయును
అకటా యీ నీలవిభుని కంటించిన యిం
టికి నొంటికి హాని కదా
ప్రకటంబుగ పురుగు లురలిపడి చచ్చుగదా

పట్టుడు కట్టుడు కొట్టుడు
గట్టిగ తల బోడిచేసి గాడిదమీదన్‌
పెట్టుడు పురి వెడలంగా
కొట్టు డనిరి అందరొకట కోపముమీరన్‌

అప్పుడు నీలాద్రి భూమిపుండు

దాని పట్టబూను తజిబీజు కనుగొను
సాని నిట్లుసేయ చనదు నాకు
కూర్మిమీర మీరు కుస్తరిం చిటు తోడి
తెచ్చి కూర్పవలయు నిశ్చయముగ

తల గొరిగించుట కంటెన్‌
మొల గొరిగించుటయె మేలు ముగ్ధయగుట బల్‌
సలుపున కోర్వక యుంచిన
దిల విటులకు ఇంతభాగ్య మేదీ జగతిన్‌

సమమై రోమరహితమై
అమితమృదుత్వంబు కలిగి అశ్వత్థదళో
పమమై స్నిగ్ధంబై వెళు
పమరెడు భగమిచ్చు భాగ్యమందురు శాస్త్రుల్‌

ఇన్ని లక్షణంబులెన్న దాని త్రికోణ
పాళి నుండుననుచు హాళి నాదు
నంతరాత్మ తోచె నయ్యది సౌభాగ్య
వతియె సుమ్ము పెక్కువాక్కులేల

దాని యోని తీరు దాని చన్నుల చెన్ను
దాని మోము గోము దాని మోవి
కావి ఠీవి చెప్పగా మాకుశక్యమే
రోమములు వడంకు భీమరాజ

సిద్ధాంతివి పండితుడవు
సద్ధర్ముండవును నాకు సఖుడ వెపుడు నే
నుద్ధతి దాని రమించెద
శుద్ధగతిం జెప్పు శొంఠిసుబ్బయ మాకున్‌

అని పలుకునప్పుడు పండితుండును నిష్టాగరిష్ఠుండును సుజ్ఞాననిపుణుండును హితుండును బ్రాహ్మణాగ్రగణ్యుండును శాంతుండును సకలజన సమ్మతుండును చతురుండును ప్రయాగవంశోత్తంసుండును అగు బాపన్న ఆపన్నుండై ఆ పగిది వాపోవుచు కన్నులు తేలవైచుచున్న ఆ నీలాద్రి మన్నురేనిం కనుంగొని వినయ విసంభ్ర గాంభీర్యంబులు గుంభింప గంభీర భాషంబుల మెల్లమెల్లన యిట్లనియె

పరనారీ సోదరుడవు
పరతత్వ విశారదుడవు బహురాజ సభాం
తర నుత కీర్తివి వేశ్యా
తరుణీమైథునము సేయ తలపం తగునే

చెరవు చేసితివిగా చెలగి బాడవ క్రింద
సద్రాజు లెన్న సముద్రముగను
వనము నిల్పితివిగా వర్ణింపరాకుండ
వీక నరట్ల కుప్పాక నడుమ
మాన్య మిచ్చితివిగా మహిషి మూలంబున
శొంఠిసుబ్బయ్యకు క్షుద్రభూమి
నా కిచ్చితివి కదా నాలుగైదు వరాలు
పేశలగతిని వర్షాశనముగ

వివిధ సంగ్రామ జయరామ విజయరామ
రాజ కరుణాకటాక్ష నిర్వ్యాజ లబ్ధ
సకలసామ్రాజ్య ఖనివి నీ వకట యొక్క
పుప్పి బోగపులంజెకై పొగులదగునె

ఇల్లును ఒళ్ళును గుల్లగు
పెల్లలరెడు రాజ్యలక్ష్మిపెంపు హరించున్‌
గుల్లాపు సానిదానిన్‌
మళ్ళని తమి కోరితీవు మరి రతి సలుపన్‌

వద్దు సుమీ యిది కూడని
పద్దు సుమీ నాదు మాట పాలించితివా
ముద్దు సుమీ ఆ సానిది
మొద్దు సుమీ దానిదెంగు మోహంబేలా

జగ్గ కవిరాజు చేతం
పగ్గెయు సిరి వోవ తిట్లువడితివి చంద్రిన్‌
మగ్గము వెట్టిన మొదలే
నెగ్గవయో నీలభూప నృపసుమచాపా

అప్పు డప్పలుకులు విని కటకటంబడి కటమదర పండ్లు పెటపెటం గొరికి చటుల క్రోధ కుటిలారుణలోచనుండై తదీయ ప్రధాన ప్రధానుండగు ఆదుర్తి భీమ నామ మంత్రి అతని కిట్లనియె

ప్రభుచిత్త మెవ్విధంబున
ప్రభవించునొ అట్లె నీవు పలుకక వడి ని
ట్లు భయము మాని పలికెదవు
సభలో వారెల్ల కడు నసహ్యత పడగన్‌

ఓంభూలు చేసికొంచును
జంభంబులు కొట్టుకొనుచు జడమతి నశుభా
రంభము లరయుచు తిరిగెడి
దంభపు విప్రునకు నీకు తగదిది చనుమా

పప్పుదప్పళంబులొప్ప తప్పొప్పులు
సెప్పుకొంచు తడక విప్పుకొంచు
చదువుకొంచు తిరుగ ఛాందసుల్‌ మీరలు
రాచకార్యములకు రాగ తగునె

కైశ్యంబేలా విధవకు
వైశ్యునకున్‌ సమర విజయవాంఛ లవేలా
వశ్య యయి కులికి పైబడు
వేశ్యారతిసుఖము వేదవేద్యున కేలా

అనిన నమ్మంత్రిజన పుంగవున కాత డిట్లనియె

నిష్ఠవిహీనుండవు ఘన
నిష్ఠుర మాయాప్రలాపనిపుణుడ వీవే
జేష్ఠ వితనిని నియోగి
జ్యేష్ఠుల లోపలను చేర్చి చెప్పగనేలా

తిరుమణియు తులసిపేరులు
తిరువారాధనయు పెద్ద తిరుగూడ వెసన్‌
ధరియించి ముష్టికిప్పుడె
తరలుము మంత్రాంగముడిగి దాసరివగుచున్‌

బంధుడును పండితుడు కూరపాటి రాయ
మంత్రివర్యుం డతని తోలు మడతవెట్టి
కొట్టి సన్యాసి జేసితి విట్టివాడ
వితని కులశేఖరుని చేయుటెంత నీకు

ఇయ్యనీయవుగదా ఎంత సత్కవి వచ్చి
ప్రస్తుతించిన పూటబత్తెమైన
ఉండనీయవుగదా చండపండిత రాజ
మండలంబును సభామంటపమున
నిల్వనీయవుగదా నిమిషమాత్రంబైన
ఆశీర్వదించు ధరామరులను
చూడనీయవుగదా వేడుకతోపాడు
గానవిద్యా ప్రౌఢగాయకులను

కూసుమత మార్గరతుడవై కులము విడిచి
తిరిగి నీవిందుజేరి మంత్రిత్వమూని
త్రిప్ప నీలాద్రిరాజిట్లు మొప్పెయయ్యె
భీకరవ్యాజ ఆదుర్తి భీమరాజ

సామంబేమియు లేదు సాంత్వనవచస్సందర్భమున్‌ నాస్తి దు
ర్గ్రామణ్యం బధికంబు కాముకతయున్‌ కాపట్యమున్‌ హెచ్చుగా
భీమామాత్యుడవంచు పల్కుదురు నిన్‌ పృధ్విన్‌ యదార్ధం బహో
నీ మంత్రాంగముచేత నేడు చెడియెన్‌ నీలాద్రిరాజెంతయున్‌

గణికశ్రేష్టుడ వయ్యో
గణకాంగణపొందు రాజుగారికి తగదం
చణుమాత్రము చెప్పవు నీ
గుణము తెలిసివచ్చె బుద్ధికుశలుడవు భళీ

అని వారిరువు నిటువలె
ఘన ఘనరవ సదృశ నాద గద్గదగళులై
కినుక వివాదింపంగా
విని చింతలపాటి నీలవిభు డిట్లనియెన్‌

మీరేటికి వాదించెద
రూరక యుండుండు చెలిమి యొప్పారంగా
గౌరవమున నామదిగల
ఆరాటము తీర్ప బాప డసమర్ధుడుగా

రతిచింత చేత నిప్పుడు
మతివోయిన రీతినుండు మాకున్‌ సుద్దుల్‌
హితమతి చెప్పెదు పోపో
పతిచిత్త మెరుంగలేవు బాపడవయ్యున్‌

అని యతనిమీద రోషసంఘటిత చిత్తుండగుట గనుంగొని తత్సన్నిధిగలవార లేగుమనిన నతండరిగె నంత భీమరాజుం జూచి యేకాంతంబున నిట్లనియె

బాపడని నేస్తుడనియును
నోపిక చేసితిని గాని యొడుతును జుమ్మీ
పాపమున కోడ కిమ్మెయి
బాపన్నను భీమరాజ పటుకోపమునన్‌

అనిన భీమరాజతని కిట్లనియె

అదనైన పంది పొడవవొ
ఎదురించిన పులిని పొడవొ ఏన్గు పొడవవో
కదనమున శత్రు పొడవవొ
వదరుచు నెదురాడు నట్టి పారు పొడవవో

అని భీమరాజు పలికిన
విని మనమున సంతసించి వేడుకతో ని
ట్లనియెను చంద్రిని వేగం
బనుకూలము సేయకున్న హా యెట్లోర్తున్‌

కోకిల కీర శారికల కూకలకున్‌ కలహంస కేకినీ
భీకర నిర్భరార్భటికి పెగ్గిలితిన్‌ మరి చెప్పనోప నెం
దాక సహించువాడ వెస దానిత్రికోణము తెచ్చిచూపుమా
నా కెదలోని మన్మథ కనద్‌ ఘన పావకతాప మారగన్‌

మరి విచారింపనది ఆడిమళ్ళ వేంక
టాభిధాన త్రజాపతి అంశ పుట్టె
సకల రతిబంధ చాతుర్యసరణి కనియె
పూని వర్ణింప దాని కేసాని సవతు?

కావున వేంకటశాస్త్రికి
నా వలపెరుగంగ చెప్పినను నాతడు తా
నావలిపని సమకూర్చును
వేవేగమె భీమరాజ విచ్చేయవయా

అని చెప్పి

పనిచిన నాతడేగి కనె భంజిత నీలతరాజకాయ సం
జనిత కరోటికూటము వసాస ఘృత ప్లుత సత్పలాశ మాం
స నికర వర్ధమాన విలసత్‌ పటు వహ్నిశిఖాప్రభాట మ
త్యనుపమ మంత్రతంత్రకర యాజక ఝాటము యజ్ఞవాటమున్‌

కనుగొని తచ్ఛాలాంతర
మున దక్షుడుబోలె దజ్ఞ ముగ్రంబున తా
నొనరించు వేంకటమఖిన్‌
చనవున కని రాజకార్యసంగతి తెలిపెన్‌

తెలిపిన మఖి అత్యంతము
పులుపువొడమ భీమమంత్రి పుంగవ వెస తా
తలచిన పని సమకూర్తును
చెలిమి వెలయ నీ మఖంబు చెల్లిన పిదపన్‌

దాతయు దైవము నేతయు
ఏతీరున కన్న నతడె యెప్పుడు కానన్‌
నీతోడు భీమరాజా
ఆతని పనిసేయు టుచితమగు గద మాకున్‌

అని రాజుగారి కంతయు
వినయంబున తెలుపుమనుచు వేడిన నతడున్‌
చని యట్ల చెప్ప నీలా
వనివిభుడు గుడారమునను వనరుచునుండెన్‌

అనంతరంబున నయ్యారామద్రావిడ బాడబాగ్రగణ్యుండగు వేంకటసోమపీథి నిరతపర్యుషి తాన్నదానవిధాన సంక్రుద్ధ సుప్రసిద్ధ వృద్ధ భూమీసుర వారా నివారిత భూరితర దారుణ భాషావిశేష దూషితంబును ప్రచండతర చండాలసరోవర పరిసర పరికల్పితానల్ప విశాల శాలాతట తటుల కుటిలాచ్ఛ మత్స్యపుచ్ఛాచ్ఛాదిత కృపీట సంపాద్యమా నాహీన పురోడాశప్రము ఖాయోగ్యవస్తు యాగభాగాను రాగారహిత విహిత మహిత బృందారకబృందంబును యథావిధివన్నిర్ధారిత దక్షిణాక్షీణ పదార్ధ వంచనాగుణ నిరస్తోత్సాహ సాహస ధావన్మహాసోమయాజి విరాజితంబును జామాత్య మూర్ఖ మహాకఠినవాక్య తర్జన భర్జన పలాయిత సకలదేశ సమాగత వివిధ విప్రప్రకరంబును పరమ పరిహాసక పరికల్పిత స్వచ్ఛచ్ఛాగ నాదామోదిత వేదితలాంతర పరివర్తిత ధూర్త పండిత పామరజన సమూహంబును బ్రాహ్మణార్ధ సంపాదిత బహుళ సత్ఫల శాక పాక భక్ష్య భోజ్య దధి ఘృత గుడాదిక వస్తుస్తోమ చౌర్యక్రియాకౌశల యాతాయాతాతతాయి శ్రేష్ఠ కుమారనారాయణశాస్త్రి విశ్రుతంబును సంభావనా సంభ్రమాలోకనార్ధ సమాగత వితత వారాంగనా భుజంగపుంగవ శృంగార కేళీగృహాయమాన శాలా సమీప ప్రదీప్త విశాల కాయమాన నికాయంబును విపులా పూపశరావోపమానూన పీనోపస్థాస్థల వికీర్ణాస్తోకానేక దీర్ఘతర శ్యామల కోమల రోమస్థోమోద్ఘాటన పాటవ ప్రోల్లసద్బాలవిధవా విరాజితాంతర్గేహంబును విదార్యమాణ పశు విసర కళేబర సంజనిత ఘనతర క్షరిత క్షతజ ప్రవాహా బిందుసందోహ గ్రసన వ్యసన సంభ్రమ భ్రమద దభ్ర శుభ్ర గృధ్ర కాక ఘూక కంక కౌలేయక గనయ గోమాయ ప్రముఖ వన్య ఖగ మృగజాల కోలాహల బధిరీకృత జనసమూహంబును పరమ నిర్భర నిర్భాగ్య దామోదర దురోదర మృగయావినోదామోదౌఖ నీలాద్రినృపాల బాలిశ దుష్కర కరాగ్ర సమర్పిత యాగఫల దానధారాపూరంబునుంగా క్రతువు సమాప్తంబు గావించి జన్నంబు బన్నంబు లేకుండ కడతేరె మదీయపుత్త్రియు నిజముఖ కళావిలాస తిరస్కృత చంద్రరేఖయగు చంద్రరేఖను కోమలాలంకారభవ్య యగు నా కావ్యకన్యకకును నుత్తముండగు నీలాద్రినృపుండు వరుండయ్యెడు సమయంబునయ్యె మామకీన భాగ్యమహిమంబు చెప్పతరంబె యని సంతుష్టాంతరంగుండై చని చని

పూతిగంధాధార పుంఖిత డిండీర
భరిత మైరేయ కుంభవ్రజంబు
గ్రామసూకర మాంసఖండ తోరణ వార
కంక వాయస గృధ్రసంకులంబు
మేదుర ఖాదనామోద సంపాదిత
తామ్రచూడాసహ్య తటతలంబు
రతిరాజ సంగరోత్థిత షిద్గజన శుక్ల
మూత్రార్థ గేహళీచిత్రితంబు

విటవిటీజన సంధాన విహితవచన
నిచయ రచనా నిపుణ కుట్టనీసహాయ
కరణ కారణ కౌలేయకంబు వేంక
టాభిధానాతినీచ వేశ్యాలయంబు

ఇటునటు కనుగొని లోనికి
లొటలొట చని మంచమెక్కి లోలత నది త
త్తటమున కూర్చుండిన న
క్కుటిలాత్ముడు కౌగలించుకొని యిట్లనియెన్‌

ఎంతభాగ్యంబు చేసితి మిరువురమును
కాసువిడకుండ యజ్ఞంబు కలిగె చంద్ర
రేఖను తలచి నీలాద్రిరేడు మిగుల
మోహితుండయ్యె భాగ్య మామోదమొదవె

నీలాద్రి రాజు మిక్కిలి
తాళక కృశియించె విరహదహనముచే నీ
వేళం జచ్చును వేగం
బాలోలత చంద్రినంపు మాతనికడకున్‌

పూలమ్రాకులు నీవు నీపుత్త్రికయును
చూచువల్ల యెరింగి బొజుగుల వలపు
వెల్లి గొలుపుచు బలువుగ విత్తమెల్ల
లాగుదురు ధాత్రి మీవంటి లంజెలేరి

నేడు నీకల్లుడాయెను నీలనృపుడు
కూతురును నీవు నేనును కొదవలేని
సిరుల పొదలెదమింక ఈ చిన్నదాని
కడక కైసేయుమని చంద్రి కాంచి పలికె

బాలరో నీవు మిగుల సౌభాగ్యవతివి
ఒక బొజుగువోవ మరియొక్క డుత్తముండు
దొరకె నీలాద్రిరాజు సచ్చరితుడిపుడు
నిన్నుగోరి పిలువనంపె నేడు నీవు

ఏలాగున నలయించెదొ
ఏలాగున నీలవిభుని వలయించెదొ మ
మ్మేలాగున రక్షించెదొ
బోలె తెగడు నీదు భగము పుణ్యముచేతన్‌

అనిన చంద్రరేఖ యిట్లనియె

చూపుకోపులచేత చుంబనంబులచేత
దంతక్షత నఖక్షతములచేత
తాడనంబులచేత పీడనంబులచేత
గాఢ పరీరంభకలనచేత
ఉపరతిగతులచే కపటవాక్యములచే
తాంబూలదాన విధంబుచేత
కలపంబుపూతచే గారవింపులచేత
గాన నాట్య ప్రసంగములచేత

మందు మంత్రంబులను నీలమనుజవరుని
లోలు గావించి కలధనం బోలి లాగి
పిదప జోగిగ గావించి మదముడించి
తెత్తు మీసన్నిధి నా ప్రతిజ్ఞ వినుడు

దొడ్డదొడ్డ తురకబిడ్డల నా తొడ
లందు నిరకబట్టి అడుగునెత్తి
పెట్టి లోలుజేసి వెట్టివానిగజేతు
నీలనృపుడు నాకు చాలగలడె

అనిన నీవంత నేర్పరివగుదు వమ్మ
లెమ్మ ముస్తీబు కమ్మ శీఘ్రమ్ముగాను
పొమ్మ ఆతనితమి తీర్ప కమ్మవిల్తు
చేతి బంగరుబొమ్మ ఓ చిన్నికొమ్మ

నావు డల చంద్రి యప్పుడు
భావంబలరార లేచి పరిపరిగతులన్‌
వేవేగ చేయదొడగెన్‌
కేవల శృంగార మొడల గీలుకొనంగన్‌

నీలాద్రిరాజు మోమున
గ్రాలెడు గడ్డంబురీతి కనుపట్టి మహా
స్థూలోపస్థా భాసా
భీలత నూరుహము లన్ని బిరబిర పెరికెన్‌

ఆతని పెను బాలీసుల
భాతిన్‌ కడుపొడవులగుచు ప్రబలు కుచములం
దాతత మలయాచల సం
జాత సుగంధంబు మిగుల జానుగ నలదెన్‌

భుగభుగ సుగంధ బంధుర
మగుచుండెడు ధూపమిడియె ఆనందమునన్‌
నిగనిగలీనెడు తన ఘన
భగదేవత కాత్మవాంఛ ఫలియించుటకున్‌

గొర్రెబొచ్చు కంటె ఎర్రనై చిర్రలౌ
కుర్రవెండ్రుకలను కూడదువ్వి
తొర్రకొప్పువెట్టె నర్రుమీదను చాల
విర్రవీగుకొంచు బిర్రబిగియ

హరిమొగము తెగడు మొగమున
హరిదళమును దళముగాగ నలది మహా సిం
ధురతర నేత్రయుగంబున
కర మరుదారంగ మందు కాటుక వెట్టెన్‌

సత్తికి సిింగారించిన
ఇత్తడిసొమ్ములను బోలి ఎసగగ మేనన్‌
పుత్తడిసొమ్ములు తన కా
పత్తారణ కారణముగ బాగుగ తాల్చెన్‌

కంచెలలోపల కట్టి బి
గించెన్‌ చనుకట్టుదోయి గిరినాగుల నా
డించక హితుండికుడు వడి
వంచనతో పెట్టినట్టి వైకరి తోపన్‌

ఈలీల నలంకృతయై
యాలోల వెలింగి నప్పు డాశ్చర్యముగా
నీలాద్రిరాజు పట్టం
బో లోలత మెరయు పెద్ద భూతమొ యనగన్‌

అప్పుడు సోమయాజులు తదాకృతి వేంకటసాని యుక్తుడై
రెప్పలు మోడ్ప కర్మిలి నెరిం కని కూతుర నీకు తుల్యయౌ
ఒప్పులకుప్ప ఇప్పుడమి నొక్కెడ చూడము లోలవయ్యు బా
గొప్పెడు బాలలీల కడు నూనితి మేల్‌ బళి యంచు మెచ్చగన్‌

నీలాద్రిరాజు వార
స్త్రీలోలుండయ్యె నింక చెడి వైతరిణిన్‌
కూలు నిటులనుచు తెల్పెడి
పోలిక నంభోధి క్రుంకె ప్రొద్దు రయమునన్‌

అపకారి నీలభూపతి
అపయశ మల విష్టపముల నలమె ననంగా
విపులమగు కటికచీకటి
విపులాస్థలి నంబరమున విప్పుగ కప్పెన్‌

అంతన్‌ తారలు తోచె నంబరమునం దా నీలభూపాధముం
డెంతే చంద్రిని కూడ తత్తనువునం దింతైన సందీయ క
త్యంతంబున్‌ రసపొక్కు లిట్లు వొడమున్‌ తథ్యం బటంచున్‌ నభః
కాంతారత్నము తెల్పెనో యన మహా గాఢాతి ధౌతచ్ఛలిన్‌

తాను చంద్రరేఖనా నెసంగుదు నంచు
సాని పిప్పితొత్తు లోన నుబ్బు
దాని నేతు నంచు తా కోపమున వచ్చె
నో యనంగ చంద్రు డుదితుడయ్యె

అయ్యవసరంబున

వేంకటసోమయాజియును వేంకటసానియు శ్రద్ధులై కడున్‌
పొంకపు మాటలున్‌ వగలు బుద్ధులు తద్దయు చెప్పుకొంచు లో
గొంకక నీలభూవిభుని గొల్లెన లోనికి దాని దూర్చి పూ
కంకటి చెంగట న్నిలుప కన్గొని ఆ నరపుండు వేడుకన్‌

దిగ్గునలేచి దండమిడి ధీవర యజ్ఞము చేసినావు మున్‌
పగ్గెగ మేము మన్మథవిపద్దశ నుండి తొలంగ నిప్పుడీ
సిగ్గరికన్నె తార్చితివి చెప్పగ శక్యమె నీప్రభావ మీ
వగ్గివి గాక బాపడవె ఆరయ వేంకటసోమపీథిరో

యెద్దుమానసుడవు యేదాంతుగుడవు సో
మాదుగుడువు నీవు మామవైతి
మాకు పున్నె మెలమి చేకూరె నౌ చంద్ర
రేఖ మీరు చంద్రరేఖ వలన

నావుడు నత డిట్లనియెను
దేవా తావక కటాక్షదృష్టి వలన నే
కావించితి క్రతువిపు డిది
నీ వన్నియ చూచి వలచె నీలనృపాలా

కైశ్యంబు కందంబు ఘన గోధి చంద్రమః
ఖండంబు భ్రూ ద్వంద్వకము ధనుస్సు
చక్షుస్సులు చకోరపక్షు లోష్ఠంబు పీ
యూషసరస్సు పయోధరములు
మాతంగకుంభముల్‌ మలినరోమాళి పి
పీలికాశ్రేణి గంభీరనాభి
విషనిధి కటి మహావిపుల సువేది ప
త్తామరసంబు మదనసదనము

పాండు రాశ్వత్థభూరుహ పత్ర మిట్టి
సరస సౌందర్యవతియగు చంద్రరేఖ
నీకు దొరకెను సంభోగ నిహితలీల
దక్క నేలుము నీలాద్రి ధరణిపాల

దీనితల్లి యీమె నా నేస్తురాలు మే
మిరువురమును నీకు హితుల మెట్లు
సాకెదవొ యటంచు చంద్రి హస్తము తెచ్చి
అతనిచేత నుంచి అప్పగించి

ముప్పదియారేండ్లది ముం
దెప్పుడు నొక్కరుని పొందదేలాగున నీ
విప్పుడు దిద్దుకొనియెదో
మొప్పెతనము మాన్పవలయు ముందర పనిలో

అని మరియును

కం పేపారెడు మంచిగంధమును బుక్కా క్రొత్తపన్నీరు క
ప్రంపున్‌ వక్కలు నాకులున్‌ దబుకుతో పర్యంకమం దుంచి తా
దంపత్యో శ్చరకాల భోగ్యమను వృత్తంబుల్‌ మహాపస్వరం
బింపారన్‌ పఠియించి వేంకట మనీషీంద్రుండు మోదంబునన్‌

తారామార్గము చూచి మంగళముహూర్తం బిప్పు డేతెంచెగా
ఓ రాజాగ్రణి పుస్తెకట్టుమిక జాగూనంగ నేలా ధ్రువం
తే రాజా వరుణో యటంచు నుడువన్‌ తేజంబు దీపింప త
న్నారీకంఠమునన్‌ ఘటించెను సువర్ణప్రస్ఫురత్‌ సూత్రమున్‌

తలబ్రాలువోయ నవి జిల
జిల జాల్కొని మదనసదన స్నిగ్ధస్థలిపై
పొలిచెను భావి సురత సం
కలితేంద్రియ మిట్లు పైని కప్పునను గతిన్‌

అనంతరంబున వేంకటశాస్త్రి యిట్లనియె

యభస్వ పుష్పిణీం చంద్రరే ఖామల మఖీమిమాం
చంద్రరేఖాం భగవతీం త్వం నీలాద్రి ప్రజాపతే

త్వన్మందిరే బహుళ కాంచన సిద్ధిరస్తు
వంశాభివృద్ధి రధికాస్తు శివారవోస్తు
బాలార్కకోటిరచిరస్తు మలేతరాస్య
నీలాద్రి పుణ్యజనవర్య హరిప్రసాదాత్‌

అని యాశీర్వదించి యిట్లనియె

స్మరమంది రాంగణంబున
కర దంత క్షతములుంచి గాఢరతుల భీ
కరభంగి చేయ కిప్పుడు
తురతుర న వ్వెనుక మెల్ల త్రోయగ వలయున్‌

ఆకు పోక వెట్టి లోకువగా బట్టి
పూకు మెల్ల నిమిరి నూకవలయు
డాక చేసి వేగ తాకంగపోవద్దు
నీకు దక్కె చంద్రి నీలభూప

అప్పుడు వేంకటసాని యిట్లనియె

బాల సుమీ గోల సుమీ
బేల సుమీ గాఢరతుల పెంపేద కడున్‌
సోలింపక తూలింపక
పాలింపుము చంద్రి నీదు పాలయ్యె నికన్‌

డాసిండు విడెము మరుచే
గాసిం డగ్గరక మున్నుగా మచ్చికగా
చేసిండు సొమ్ము పిదపన్‌
నీసేతలకెల్ల నోర్చు నీలనృపాలా

అని చంద్రరేఖం జూచి యిట్లనియె

సచ్చోడా పబువీతడు
యెచ్చమునకు పచ్చమునకు యిచ్చలయిడిగా
యిచ్చును హెచ్చుగ కొలువుము
సచ్చు యిటుల సేరబోక సందర లేకా

దేవేరి కేరెదవు స
ద్వావంబున నితడు చేతబట్టిన నీ వో
పూవుంబోడిరొ విట సం
భావనపై తలపువిడిచి బత్తి కొలువుమా

పాటపాడు మటన్న పాడక యెలుగెత్తి
పదరి రోదనము చేసెదవు సుమ్ము
కాళ్ళొత్తుమని వేడ కడువడి నొత్తక
ఎదురొత్తమని పలికెదవు సుమ్ము
తములమందిమ్మన్న తమి నీక క్రమ్మర
నాకిమ్మటంచు పెనగెదువు సుమ్ము
రతికిరమ్మని పిల్వ రాగిల్లి డాయక
అదనున కడకు పోయెదవు సుమ్ము

తురకదండి కాడు దూదేకులియు కాడు
పసులవాడు కాడు బట్టు కాడు
మనలనేలునట్టి మనుజనాథుడితండు
సెప్పినట్లు నీవు సేయు చంద్రి

నావుడు నతం డిట్లనియె

పుత్తడి కీలుబొమ్మ యనబోలెడు బోలెడుయోని చందిరిన్‌
హత్తగ తోడితెచ్చి విరహార్తి హరింపగ చేసినావు నీ
కుత్తమ భూషణాంబర సముత్కర మిచ్చెద వేగనందుమో
యత్త వలగ్న నిర్జిత వియత్తల వేంకటసాని జానుగన్‌

అన నవ్వుచు వారిద్దరు
చని రంతట నీలవిభుడు చంద్రిని కని నూ
తన మదనకేళి తేలెద
నని లోపల మోహమొదవి హస్తము పట్టన్‌

తలవంచి పట్టెకంకటి
గల దండము వట్టి వదలగానొల్లక తా
వెలవెల బోవుచు సిగ్గుం
గల బాలికవోలె పెనగగా నాతండున్‌

ముంగటి కుచ్చుపట్టుకొని మోహమునన్‌ తన శయ్య చేర్చి వా
రాంగనవింత సిగ్గువడ నర్హమె యెందర చక్కబెట్టితో
దొంగతనంపు టీ వగలుద్రోచి హసన్ముఖివయ్యు కౌగిటన్‌
లొంగగబట్టి నన్ను రతిలోలుని చేయుము నీకు మ్రొక్కెదన్‌

చంద్రుడు మింటనంటి సరసంబుగ నగ్నికరాళ విస్ఫుర
చ్చంద్రిక కాయజొచ్చె సుమచాపుడు బాణములేయజొచ్చెనో
చంద్రి విలాస విభ్రమ విశాల కళారసలీల మీరగా
సాంద్ర కృపా కటాక్షమున చక్కగ కన్గొని కోర్కెతీర్పుమా

సకలభాగ్యములిత్తు చక్కరకెమ్మోవి
చవులు చూపింపవే చంద్రరేఖ
శంబరాంతకు చేతి శరముల కోర్వను
చక్క కౌగిటడాచు చంద్రరేఖ
చలమేల పూనెదు వలపు నిల్పగజాల
చన్ను లంటగ నిమ్ము చంద్రరేఖ
తాళజాలను నీదు కాలికిమ్రొక్కెద
స్మరమందిరము చూపు చంద్రరేఖ

కడకు పోవక నెమ్మోము ముడుచుకొనక
సిగ్గు విడనాడి నను కటాక్షించి నీదు
కన్నెప్రాయంపు రతికేళి కలయనిమ్ము
జాగుసేయక కటకపు చంద్రరేఖ

నీకున్‌ దాస్యము చేసెద
నాకున్‌ గల ధనమొసంగి నానాగతులన్‌
పైకొని రతి నన్నేలుము
ప్రాకటముగ చంద్రసాని పల్లవపాణీ

సిగ విడిజార మోముపయి చెమ్మటబిందువులూర గబ్బి చ
న్మొగడలు నిక్కుదేర తెగి ముత్తెపుపేరులు శయ్యచేరగా
భగ మతి సారమూర జలపంక కళంకిత జీలువారగా
వగ పురుషాయితంబున అవశ్యము నేలుము చంద్రరేఖరో

నా విని శరావసన్నిభ
కేవల సుస్నిగ్ధ మదనగృహము చెమర్పం
గా వాలు బెళుకుచూపుల
తా వలనుగ నతనిమోము తప్పకచూచెన్‌

ఇటువలె చూచిన నాతడు
తటుకున ఇదె సమయమనుచు తమితీరగ కౌ
గిటనొత్తి మోవిమధువటు
గుటుకుగుటుకురనుచు కడుపుకొలదిన్‌ గ్రోలెన్‌

బుడ్డికుండలవంటి బుగ్గలు చుంబించి
గొర్రెబొజ్జునుగేరు కురులు నిమిరి
కప్పచిప్పలవంటి కన్నులు ముద్దాడి
ఊదబొడ్డున కరం బూది నిలిపి
కొలిమితిత్తులబోలు కుచములు పీడించి
మరగాళ్ళ తెగడెడు కరములంటి
కొంగకంఠమువంటి కుతుక గోరులనించి
పులిబోనుబోలెడు పూకు చమిరి

వెడద కుంచములో వ్రేలువెట్టినట్లు
యోనిలో కామదండము నొత్తి దూర్చి
వెనుకకును ముంగలికి నూగుకొనుచు నీల
ధారుణీశుండు వడివడి తాక నదియు

మును నల్లమందు మాజుము
తినియున్నది గాన మేను తిమ్మిరిగొని యా
తని తాకులకు చలింపక
తన నేరుపుకోపు చూపదలచి కడంకన్‌

భగము వికసింపజేయుచు
బిగబట్టుచు లోనచొర నభేద్యంబుగ త
ప్పగ త్రోయుచు బెణకించుచు
బిగితొడలం చుట్టిపట్టి బిట్టలరించెన్‌

పారదోపమ వీర్యధారాతత భగంబు
స్తన చర్మ భస్త్రికా తాడవంబు
కక్షప్రదేశ నిర్గత ఘర్మసలిలంబు
చక్రక్రమ చపేట చాలనంబు
భూరితరాపాన మారుతోద్ధూతంబు
ఘన దేహదుర్గంధ గంధిలంబు
శునకబంధవిశేష వినమిత మేఢ్రంబు
క్రీడారచిత పాదతాడనంబు

గార్దభస్వర నిస్సరద్‌ గ్రామ్యవచన
మమిత రోదనజల పూరితాననంబు
చంద్రరేఖాభిధాన వేశ్యానలాస్య
ప్రథమసురతంబు నీలభూపతి కరంచె

ఇవ్విధంబున సమరతి గావించి నప్పు డప్పడుపుంబోటిమిన్న మున్నెరికంబున నన్నీలాద్రిరాజపుంగవుపై లంఘించి హుంకరించి జంకించుకయులేక సంకోచంబు మాని ఇంక నాచేతం జిక్కితి వెక్కడికి బోయెదవు నిలునిలు నా యుపరతి చమత్కారంబు తోరంబుగా జూపెద పరాకు కాకు రాకొమరా మారాడక నాకేమి మెప్పు లిప్పు డిచ్చెదవో మది నెంచుకొమ్ము అని చెక్కిలినొక్కి యక్కునం గ్రక్కునం తన లంబమాన పీన స్తనంబులు గదియించి నునుదొడల కుదియించి వదలని మదంబున ముదంబునం తన మదనసదనంబున నతని మేహనంబును నమోఘంబుగా తగిలించుకొని ముమ్మరమ్ముగా దొమ్మరికొమ్మ గడకదసి ఆడు చందంబున సంభ్రమించుచు లాగివైచు చందంబున నొత్తుచు మేను మేన హత్తింపుచు తత్తరింపక కొంచెపడక దిట్టతనంబు తెచ్చుకొని విచ్చలవిడి ముచ్చటలెల్లం దీర చనుమిట్టల గట్టిగ బిగబట్టి యిట్టట్టు బెసగక తడంబడక గుట్టుచెడక చేతులు పట్టువిడక ఎదురుదట్టింపుమని చేయి మార్పుమని అడుగుతప్పెనని మించబలుకుచు కులుకుచు కోడెప్రాయంపు నాడెంపు సాలెవాడు ఘళుకుఘళుకుమన పలక చులుకగ దాటించు వాటంబున నోటువడక నీటుజూపుచు పరిభ్రమణవేగంబునం కర పాద భూషణ విశేషంబులు ఘల్లుఘల్లుమని భీషణంబుగ ఘోషింప న వ్వారయోషాలలామంబు పెదవిపెదవిం గదియ తన నిడుద వాడి మొనపంటింబట్టి పీల్చుచు చిర్రికుర్రవెండ్రుకలు తొర్రకొప్పువీడి యక్కటిప్రదేశంబున నటియింప కుండలంబులు గండతలంబునం తాండవింప గోరిదకొంప సొంపునం పెంపారు కంపుమేనుల సమానంబుగా క్రమ్ము ముమ్మరంపు చెమ్మటసోన లతని దుర్భరతర సంవృథమాన దేహశాల్మలీద్రుమంబునందు దిగజార వీరులసివంబెత్తిన లాగున నూగులాడుచుండం గని యాప్రజాపతి సేదదీర్చుకొని క్రమ్మర నమ్మరుదురంబున కెదిరించి వదలని చలమ్ము హెచ్చం బెచ్చు పెరుగు మచ్చరంబున సమదమ్ముగ నదుముకొనిన నదియు వదలక పదరుచు గుదికొన్న తమకమ్మునం దలంకక నెదురుదాక ధాక నిద్దరుం తద్దయు సంభ్రమంబును చలంబును జయకాంక్షయు మనంబునం బెనంగొన నగ్గలంబుగ నిగ్గుచు వెనుకకుం దగ్గుచు మొగ్గరించుచు పగ్గెలు సెప్పుకొనుచు చెండుచెండుగ బండబండగ తాకులాడు నెడ నచ్చంద్రరేఖ బహువిటజన సంయోగ జనిత చాతుర్య కళాధుర్య కావున మొగ్గవేసి యోటువడం జేయ సమకట్టిన నా దిట్టమట్టిరేడును బహుగణికావిలాసినీ దాసికా సంభోగ సంభృత నైపుణీ గుణగణ గణ్యుడు కావున వెనుదీయక నునుతొడలం దానినడుము బిగించి మారొడ్డుచు తెబుకుతెబుకుమను చప్పుడు లుప్పతిల్ల బిట్టట్టుసేతల నెట్టుకొని గుట్టు వదలక పట్టువట్టి సూటితప్పకుండ గండుమీరి మూర్కొన్న మహిషంబుల డంబున చిత్తకుక్కల విధంబున చీంబోతుల భాతి మాలమాసటీండ్లం బోలె మార్జాలంబుల కైవడి మసకంపు పెనుబాముల చందంబున మదించిన కోడిపుంజుల మాడ్కి లకుముకుల లాగున గొర్రెపొట్టేళ్ళ భాతి గుంటుకతోలు లీల కొర్తవేసిన కైవడి చిట్టాముదముల గ్రుమ్ము నేర్పున గొంకుజంకు లేక సమరతి యుపరతి బంధంబులం దేల జిలజిల మరుజలంబులు జాలుకొని తదీయ శయ్యాతలంబునంబడి వెల్లివిరిసి సెలయేరులైపార మహామైథున సంకల్ప సంభోగ క్రీడావినోదంబులు సూపి అలసి సొలసి తొడలతొడలును బాహువులబాహువులును మోవినిమోవియు మొగంబునమొగంబును పదంబులపదంబులును నురంబుననురంబును భగంబునలింగంబును గదియ కౌగిలించుకొని దీర్ఘనిద్రా సమాయుక్త నేత్రులై పడియుండి రనంతరంబున

తమ్ముల చక్రమ్ముల నధి
కమ్ముగ బాధించు రాజు కాంతిదొరగి వే
గమ్మున క్రుంకెన్‌ తద్గతి
గ్రుమ్మరు నీలాద్రిరాజు క్రుంకకయున్నే

అల నీలాద్రి మహీపుం
డెలమిని చంద్రిని రమించి యెంతయు తేజో
బలహీనుడగుట తెలుపన్‌
తెలుపువొడమినట్లు తూర్పు తెలతెలవారెన్‌

ఇనవంశసంభవుండై
ఘనసన్మార్గంబు దొరగి కాముకుడౌ నీ
లనృపతి కాదన కినుకన్‌
చనుదెంచెననంగ నపుడు సవితృడు తోచెన్‌

అంత చింతలపాటి నీలాద్రిరాజు
మొగము వెలవెలబోవంగ నిగుడిలేచె
చంద్రరేఖయు ముఖకాంతి సడలి కనుల
నుసుముకొంచును మేల్కాంచి మసలుచుండె

అత్తరి నా రాజోత్తముండు దానిం గూర్చి యిట్లనియె

నావంటిరసికు డెందము
కేవలముగ కరగజేసి కేరుచు మిగులన్‌
భావభవకేళి దాసుని
కావించితి నీకు సాటి కా రేసానుల్‌

నీమొగము నీత్రికోణము
నీ మెరుగుంగన్నుదోయి నీ నునుదొడలున్‌
నీమోవి నీకుచంబులు
నామదినిక మరవజాల నమ్ముము బాలా

సొమ్ములు చీరలును వరాల్‌
సమ్మతమున నీకునిత్తు సత్యంబిక నా
సొమ్మయియుండుము విట సం
ఘమ్ములతో చెలిమిమాని కలికీ ఎపుడున్‌

సానిదాననంచు పూని లోలో వెచ్చ
కాండ్రకూడ నేను కాంచినపుడె
చన్ను ముక్కు యోనినున్న గొల్లియు జిర్రి
కొప్పుకోసి వెళ్ళగొట్టువాడ

రాయవరంబున నీ క
త్యాయత గేహంబు కట్టి యందుంచెద నీ
వేయెడకుపోక యుండుము
నీయండనె యుండువాడ నేనచ్చోటన్‌

నావుడు నదిట్టులనియెను దేవ నాకు
నీవు దయ దండ చిక్కుట కేవలముగ
సకల సామ్రాజ్యమిచ్చుటె సంశయంబు
లేదు నీదాననై యుందు మోదమునను

నీకంటె లోనిచుట్టము
నాకిచ్చెడువాడు కలడె నానాగతులన్‌
చేకొని కాపాడుము సుగు
ణాకర యెవ్వరినిజేర నరుగక యుందున్‌

అంత నంతకుమున్నె గోతియొద్ద నక్క చందంబున ద్వారబంధమ్ము కడ కాచుకొనియున్నవాడు కావున వేంకటసోమయాజి యిదంతయు నాలకించి తటుక్కున లోనికిం బ్రవేశించి యిట్లనియె

ఇషువినుము చంద్రరేఖా
భషకమువలె నిన్ను చేరబట్టి యెవరినిన్‌
విషయింపనీయ గట్టిగ
మృష కాదని పలికె మిగుల ప్రేమదలిర్పన్‌

అయ్యవసరంబున

ప్రాతపుట్టముకట్టి పూతచెందిరవెట్టి
పాతచెప్పులుమెట్టి చేతగట్టి
కోలపోలుచుబూని చాల మద్యంబాని
ప్రేలుకొంచును గూను గ్రాల యోని
పుండ్ల కీగలువ్రాల చండ్లు బొడ్డున తూల
కండ్ల పుసులు కార రొండ్లు వ్రేల
నోర దేగుడు కార ఊర బేరము మీర
సారె పయ్యెదజారి యోరజేర

దారి నెముకుచు బడబడ దగ్గుకొనుచు
అపుడు వేంకటసాని నీలాద్రిరాజు
గొల్లెనకు నాతులటుపాయ కొనుచు లోని
కరిగి చేయెత్తిమ్రొక్కి యిట్లనుచు పలికె

నీబానిసతొత్తిది దయ
చే బాసలనిచ్చి చాల చేపట్టుమికన్‌
గాబాగూబిగ చేయక
నీ బంతిని కూడు కుడుపు నీలాద్రినృపా

అనిన నతం డత్యంత సంతోషస్వాంతుండై యట్ల చేసెదనని దానికిం బీతాంబరాదికంబు లొసంగి చంద్రియె లోకంబుగా మెలంగుచుండె

రతిజేసి యలసిన ధృతి దాని మన్మథా
గార ద్రవంబెల్ల కడిగి తుడుచు
ఆకుచుట్టియొసంగినది తమ్మలముసేయ
దమ్మ గైకొని నోరగ్రుమ్మి నమలు
అది మదిర కొనంగ నది మంచిదేయని
తచ్ఛేషహాల మోదమున త్రావు
నిదురించుతరి దాని పదములు తొడలు త్రి
కోణంబు సుఖముగా గ్రుద్ది పిసుకు

మెల్లనే దాని మంచము నల్లి చంపు
లావుగుబ్బల గందమలంది నిడుద
క్రొమ్ముడిని పూవుటెత్తులగూర్చు వలపు
కులుక నీలాద్రిభూపాల మలహరుండు

ఇల్లెరుగక పట్టెరుగక
యెల్లధనము దానికిచ్చి యెగ్గును సిగ్గున్‌
చెల్లగ తత్పాదద్వయ
పల్లవముల దండ మురిసిపడి కాపుండెన్‌

పుడమిపై గూదలంజెకు బుడ్డవేడ్క
కాడనెడు మాట చంద్రరేఖకును నీల
ధరణివరునకు చెల్లెను తత్కథా వి
ధాన మెరిగించితిని నీకు తథ్యముగను

అనుచు తంబళ వీరభద్రార్యమణికి
నంబి నరసింహు డతులితానంద హృదయ
కమలుడై చెప్పి యంతట సముచితగతి
నతని వీడ్కొని చనె దేవతార్చనకును

వాచాగోచరముగ భువి
నాచంద్రార్కంబు కాగ హాస్యరసముచే
నా చంద్రరేఖ కథయును
నీ చరితము చెప్పినాడ నీలనృపాలా

ఈ కృతికి సమముగా కృతి
నే కవులును చెప్పజాల రిది బిరుదము భూ
లోకము రాజులలోపల
నీకు దొరకె హాస్యలీల నీలనృపాలా

ధరణియు మేఘమార్గమున తారలు తామరసాప్త చంద్ర ది
క్కరటి గిరీంద్ర శేషఫణి కంధి కిటీశ్వర కూర్మనాయకుల్‌
స్థిరముగ నెంతకాలము వసింతురు తత్క్రియ నీ ప్రబంధ ము
ర్వర సరసోత్తముల్‌ కవులు వర్ణనసేయగ నుండుగావుతన్‌

చేటీ వధూటికా కుచ
కోటీ సంలబ్ధ విపుల కోమల పంకో
త్పాటనకర ఖరనఖర ని
శాటోపమ ఘోరరూప ఆర్యదురూపా

రాచిరాజాన్వయా రామదావానలా
యాచకాస్తోక మేఘౌఘ ఝంఝానిలా
నీచవారాంగనా నిత్యరత్యాదరా
పాచకాధార నిర్భాగ్యదామోదరా

ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్ష ణానుక్షణ సంలబ్ధ సరసకవితా విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశభాషా విశేష భూషితాశేషకవితా విలాసభాసు రాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ బహుళప్రబంధ నిబంధనబంధురవిధాన నవీనశబ్దశాసన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపంబను హాస్యరసప్రబంధరాజంబునం తృతీయాశ్వాసంబు సర్వంబును సంపూర్ణము.