మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?
చీమలమర్రి బృందావనరావు
- పూర్తిపేరు
- చీమలమర్రి బృందావనరావు
జీవిత విశేషాలు
చీమలమర్రి బృందావనరావు తెలుగు సాహిత్యంలో సుపరిచితులైన రచయిత, పద్య విశ్లేషకులు. పద్యరచనలు, విప్రనారాయణుని పతనం, సత్యభామ వర్ణనవంటి ప్రసిద్ధ పద్యాల వివరణలు రాశారు. పద్యంలోని అంతరార్థాన్ని వివరించడంలో వారిది ప్రత్యేక శైలి. ప్రసిద్ధ పద్యాల విశ్లేషణ, “నాకు నచ్చిన పద్యం” శీర్షికన వ్యాసాలు ప్రచురితమయాయి. ఈమాటతోసహా పలుకు తేనియలు, సాహితీ నందనం బ్లాగులలో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. పద్యాలలోని భావాన్ని, ఛందస్సును సులభంగా వివరిస్తారు. అభినవ కవిబ్రహ్మల గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు.