మోహన రాగంలోని తీవ్ర (అంతర) గాంధారానికి బదులుగా కోమల (సాధారణ) గాంధారాన్ని వాడటం వల్ల ఏర్పడే శివరంజని రాగఛ్చాయలో కనిపించే అనూహ్యమైన మార్పు ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే!
రచయిత వివరాలు
పూర్తిపేరు: విష్ణుభొట్ల లక్ష్మన్నఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
విష్ణుభొట్ల లక్ష్మన్న రచనలు
మన సౌర మండలంలో జరిగే ప్రతి మార్పుకు కారణభూతుడు సూర్యుడే. గ్రహాల గమనమైనా, వాటి ఉపగ్రహాల గమనమైనా, గ్రహాల చుట్టూ ఉండే వాతావరణం, అందులోని మార్పులూ, గ్రహణాలూ – వీటన్నిటికీ మూల కారణం సూర్యుడు. భూమి పైన జనించే సకల సృష్టికి కారణం సూర్యుడు. ఈ సృష్టిలో చేతనాచేతనమైన జీవాలకి ప్రత్యక్ష సాక్షి – సృష్టికర్త సూర్యభగవానుడు.
పిల్లవాడిని వదిలి బరువు గుండెలతో వెళ్ళే కారుణ్యమూర్తి అయిన గౌతమ బుద్ధుడు, అయోధ్య నగర అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యాన్ని వెతికే ఊర్మిళాదేవి ఉత్కంఠ, గంగానది గట్టు మీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో ఎక్కడకో కొట్టుకుపోయే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెల చప్పుడు – ఇతివృత్తాలు.
ఇప్పటి కుర్రకారుకి మన భారత దేశాన్నుంచి అమెరికా రావటమంటే నల్లేరు మీద బండి నడకే కావచ్చు. కానీ అప్పట్లో అదొక అద్భుతమైన సాహసయాత్రే!
సాహిత్య సదస్సులో నేను ఏమిటి మాట్లాడాలి అనుకుంటుండగా “ఆ పాత సాహిత్యంలో ఏముంది మాట్లాడటానికి?” అన్న నా మిత్రుని ప్రశ్న నన్ను నిజంగానే ఆలోచింపచేసింది.
గుర్రం జాషువా సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు […]
అయినా పట్టు విడవకుండా ఈ పాటనే సాధన చేసే వాడిని. ఈ పాట తప్ప మరే పాటా పాడకుండా దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రాగమాలికే సాధన చేసినట్టు గుర్తు.
ఒక రోజు, అపు నిద్ర లేచిన వెంటనే దిళ్ళ మధ్య తల పిన్ను పడి ఉండటం గమనిస్తూ, అంతలో, ఇంట్లో పనులు చేస్తున్న అపర్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు.
పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.
నేటి సినిమా పాటల రచయిత ఒక పంచ భర్తృక. మాకు ఐదుగురు మొగుళ్ళు. సంగీత దర్శకుడు, సినిమా నిర్మాత, దర్శకుడు, గాయకుడు, నిర్మాత లేక దర్శకుడి బావమరది. ఇంతమంది చెప్పింది విని గీత రచయిత పాట రాయాలి.
వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది.
ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”.
అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.
“ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
ఇప్పటికి 4500 సంవత్సరాలకి పూర్వమే, మహా వైభవంగా సాగిన పురాతన ఈజిప్ట్ చక్రవర్తుల (ఫెరోల) పాలనలో ప్రముఖ పాత్ర వహించిన హైరోగ్లిఫ్ లిపి కాల గర్భంలో కలిసిపోయి, దాదాపు 1500 సంవత్సరాల కాలం తరవాత, ఒకదాని తరవాత మరొక అద్భుత పరిశోధనల సముదాయం వల్ల, మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ కథా వివరాలే ఇక్కడ ప్రస్తావన.
ఇవి రాయటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఈమాట వంటి అంతర్జాతీయ వెబ్ పత్రిక నడపటంలో ఒక ముఖ్య ఉద్దేశ్యం – ప్రవాసాంధ్రుల అనుభవాలు అందరితోటీ పంచుకోటం కాబట్టి, ఈమాటను ఒక వేదికగా తీసుకొని మా అనుభవాలు పంచుకోవాలని. రెండవది, మేము ఫ్రాన్స్ నుంచి అమెరికా తిరిగి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. మా జ్ఞాపకాలు, అనుభవాలు మరిచి పోకముందే వాటిని రాతపూర్వకంగా పొందుపరచాలని!
ఎన్ని ఫొటోలు, టీవీ ప్రోగ్రాములు, వీడియోలు చూసినా, ప్రత్యక్షంగా పిరమిడ్లని చూస్తే కలిగే అనుభూతుల్ని వర్ణించటం కష్టం!
“కథ ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలి? పాత్రలను ఎలా మలచాలి? ఎటువంటి నేపథ్యంలో చెప్పాలి? ఎటువంటి కంఠస్వరం ఉపయోగించాలి? ఎల్లాంటి దృష్టికోణంలో చెప్పాలి?” అన్న ప్రశ్నలకి సమాధానమే కథా శిల్పం.
(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నాం. ) తెలుగువాడి జీవనాడి […]
(ఈ వ్యాసంలో ఒక రాగం కాకుండా, మూడు రాగాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.ఈ మూడు రాగాలకి దగ్గర సంబంధం ఉంది. “ఈమాట” పాత […]
“సినిమా పాటలు లైట్ సాంగ్స్ (లలిత సంగీతమే) కదా అని లైట్‌గా తీసుకోకండి” అనేవాడు సంగీతం బాగా తెలిసిన నా మిత్రుడు. సినిమా పాటలు […]
(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో […]
(ఈ రాగలహరి శీర్షికలో నాలుగో రాగం కల్యాణి. ఇంతకు ముందు పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి రాగాల్లాగే, కల్యాణి రాగం కూడా చాలా […]
(ఈ రాగలహరి శీర్షికలో మూడవ రాగం సింధుభైరవి. ఇంతకు ముందు పరిచయం చేసిన మోహనం, అభేరి రాగాల్లాగే, ఇప్పుడు సింధుభైరవి రాగాన్ని పరిచయం చేయ […]
(క్రిందటి సంచికలో చేసిన మోహనం రాగం పరిచయం చాలామంది శ్రోతపాఠకులు, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో బాగా ప్రవేశమున్న కొంతమంది మిత్రులు, ఈ సంగీత వ్యాసాలు […]
(సంగీతంలో ప్రవేశం లేనివాళ్ళు కూడా, సంగీతం విని ఆనందిస్తారన్నది అందరికీ తెలిసిందే! ఐతే, సంగీతంలో కాస్త పరిచయం కలిగినా సంగీతాన్ని ఇంకా ఎక్కువగా విని […]
( గత మంగళవారం , అక్టోబర్ 26, 1999, ఉదయం కన్నుమూసిన సుస్వరాల రాజేశ్వర రావుకి నివాళిగా ” ఈ మాట ” కోసం […]
“సినిమా ” కి ఎంత ప్రజాదరణ లభించిందో, “సినిమా పాట ” కి అంతకన్నా ఎక్కువ ఆదరణ లభించిందంటే అతిశయోక్తికాదు. గత 50 సంవత్సరాల […]