(పాట మొదలు ఆలాపన సోహినీలో)
హాయి హాయిగా ఆమని సాగే
సాస సమగమా ధానిధ ధాసా..
సోయగాల గనవోయీ సఖా… హాయీ సఖా…
సారిసాని ధనినీసారీ సరిసనిసనిధ మధని ధనిధ మధమగ గమగ మధమ ధనిసనిరిసనిధమగరిస..
(మొదటి చరణం సోహినీలో)
లీలగా పువులు గాలికి ఊగ
సాధని మధని సానిస నిరిసా
కలిగిన తలపుల వలపులు రేగ
ధనిసగ సగసగ మగమగ రీగరిసా
ఊగిపోవు మది ఉయ్యాలగా… జంపాలగా… హాయి హాయిగా ఆమని సాగే
సారినీస ధని నీసారి సరిసనిసనిధ… మధని ధరిస ధనిధ మధమగ గమగ మధమ ధరిసనిరిసనిధమగరిస..
(క్రింది రెండవ చరణం పాట స్వరాలు బహార్‌లో)
ఏమో తటిల్లతికమేమెరుపొ?
మపసా నిపామ గమనీ1 ధని2సా
మైమరపేమో… మొయిలురాజు దరి మురిసినదేమో!
మాగమ గరిస… సససమామగమ మని1 ధని2 సాసా..
వలపు కౌగిళుల వాలీ సోలీ …
సాని2సామగరిస సరిసని1ని2సా..
(ఈ క్రింది లైను మళ్ళీ సోహినీలో ఉంటుంది)
ఊగిపోవు మది ఉయ్యాలగా.. జంపాలగా… || హాయి హాయిగా… ||
సారినీస ధని నీసారి సరిసనిసనిధ… మధని ధరిస ధనిధ మధమగ గమగ మధమ ధరిసనిరిసనిధమగరిస..
(క్రింది పాట మూడవ చరణం స్వరాలు జోన్‌పూరిలో)
చూడుమా చందమామ!
పసనిసా నిధపమాపా
అటు చూడుమా చందమామ..
మప పసనిసా నిధపమాపా
కనుమా; వయ్యారి.. శారద యామిని కవ్వించే ప్రేమా…..
మమపసాప; మరిసా.. సారిరి మాపప నినిధనిసా పసరీసా..
వగలా తూలె,
రిని1సా సాసా
విరహిణులా… మనసున మోహము రేపు నగవులా… ||ఊగిపోవు …||
పనిసగరీ.. పనిసరి మాగరిస సరిస మప రీసా..
(క్రింది పాట ఆఖరి చరణం స్వరాలు యమన్‌లో)
కనుగవ తనియగా, ప్రియతమా;
పపగరీ నిరిగమా గరినిసా
కలువలు విరిసెనుగా!
రిరిగమ రిగపమా…
చెలువము కనుగొనా:
గమమరి గమధసా…
మనసానంద నాట్యాలు సేయునోయి…
నిరిరీగాస నీసాని ధపగారిసా
ఆనంద నాట్యాలు సేయునోయి…
నీరీస నీసాని ధపగారిసా…
బోలెడన్ని రాగాలు నేర్చుకోటం కన్నా, తెలిసిన కాసిన రాగాలను వీలైనంత క్షుణ్ణంగా నేర్చుకుని వాటిలోని లోతులు తడమగలిగితే, ఆ తరవాత కొత్త రాగాలను పరిచయం చేసుకోటం సులభం అని నా అనుభవం. ఇది ఒక రకంగా పరిశోధనా పటిమను పెంచే పద్ధతి. సంగీతం కొత్తగా నేర్చునే వారికి తగినంత ఓపిక, శ్రద్ధ లేకపోటం వల్లే వారికి దూరంగా వెళ్ళిపోతుంది సంగీతం అనిపిస్తుంది నాకు. కొత్తగా సంగీతాన్ని సాధన చేసేవారు అప్పుడప్పుడే నేర్చుకుంటున్న తమ సంగీతపు పాండిత్యాన్ని ప్రదర్శించటంపై ఇష్టాన్ని పెంచుకోటం కన్నా నిగ్రహంగా సంగీత సాధకుడు ప్రవర్తించటం అవసరమని నాకు తోచేది.
ఇక్కడ ఇచ్చిన రాగమాలికను స్వరాలతో సహా పాడుతూ కానీ, ఒక వాయిద్య సహకారంతో కానీ ఉత్సాహం ఉన్నవారు సాధన చేసి కొంతైనా సాధించగలిగితే, ఇంత ఉపోద్ఘాతం వృధా కానట్టే నేను భావిస్తాను!