రచయిత వివరాలు

వైదేహి శశిధర్

పూర్తిపేరు: వైదేహి శశిధర్
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు.

 

అక్టోబర్ లో అడుగు పెట్టేసరికి
చుట్టూ వున్న చెట్లన్నీ
ముదురు రంగు కాషాయాల్ని ధరించటం మొదలెడతాయి

మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి.

అక్కడైనా ఇక్కడైనా వేసవి మధ్యాహ్నాలు ముళ్ళపొదలై గుచ్చుకునేవే! ప్రవాసంలో మాత్రం, చిన్నప్పటి జ్ఞాపకాలలో వేసవి మొగలిపొదల్లా గుబాళిస్తుంది వట్టివేళ్ళ పరదాల మీంచి వీచే ఫాన్‌గాలి […]

నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయే క్షణాన
నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని …

వారమంతా వారాంతం కోసం వోపిగ్గా ఎదురు చూశాక
ఎప్పటిలానే ఏలకుల సుగంధాన్ని మోసుకుని
శనివారపు ఉదయం మెత్తగా నిద్ర లేపుతుంది

ఇందులో వ్యంగ్యం ఏ మాత్రం లేదు. తనవారిని కూడా వెదికించి ఖైదులో ఉంచమని ప్రాదేయపడటంలో తన భార్యాబిడ్డలకి కనీసావసరమైన పూటభోజనం సమకూర్చాలన్న తపన, ఆరాటం, సమకూర్చలేని తన అశక్తత, ఉరిశిక్ష వేసినా అన్నం పెట్టిన అధికారుల పట్ల అమాయకమైన కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి.

లేత మొగ్గల పెదవులు సుతారంగా విచ్చీవిచ్చకనే
పట్టెడు పరిమళంతో ఇంటినంతటినీ
సుగంధపు అలలపై ఉయ్యాలలూపుతుంది

ఆనాడు అర్ధంతరంగా ఆపేసిన గీతాలన్నీ ఇన్నాళ్ళ తర్వాత
ఆలపించటానికి మళ్ళీ ఉత్సాహంగా గొంతులు సవరిస్తాం

రోజంతా అవిశ్రాంతంగా ఆలోచనల
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది

వర్షానంతరం శాంతించిన ఆకాశం
చిరుగాలుల చల్లని వ్రేళ్ళతో
దాడికి తడిసి చెల్లాచెదురైన
లేత రెమ్మల ముంగురులను
అలవోకగా స్పర్శిస్తుంది

ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

విల్లులా వంపు తిరిగిన యూకలిప్టస్‌ కొమ్మలలో చిక్కుకుని
గుల్మొహర్‌ లా పూచిన సాయంత్రాన్ని
నా కాన్వాస్‌ పై చిత్రించి నీకు కానుకగా ఇవ్వాలని

రాత్రంతా అవిశ్రాంతంగా రాట్నం వడికిందేమో
చంద్రునిలో అవ్వ,
దూదిపింజలుగా రాలే మంచుతో తోటంతా
మెత్తని పట్టుపరుపులా వత్తిగిల్లుతుంది.